• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KEERTHY SURESH GOING TODUBAI FOR MAHESH SARKARUVAARI PAATA AND HER PHOTO GOES VIRAL MHN

Super Star Mahesh- Keerthy Suresh - Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' కోసం దుబాయ్‌కి కీర్తి సురేష్..వైరల్‌ అవుతోన్న ఫొటో

Super Star Mahesh- Keerthy Suresh - Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' కోసం దుబాయ్‌కి కీర్తి సురేష్..వైరల్‌ అవుతోన్న ఫొటో

Keerthy Suresh Going toDubai For Mahesh Sarkaruvaari Paata and her photo goes viral

Super Star Mahesh- Keerthy Suresh - Sarkaru Vaari Paata: సూపర్‌స్టార్‌ మహేశ్‌ 'సర్కారువారి పాట' షూటింగ్‌ దుబాయ్‌లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌లో పాల్గొనడానికి హీరోయిన్‌ కీర్తిసురేష్‌ దుబాయ్‌ పయనమైంది.

  • Share this:
    సూపర్‌స్టార్‌ మహేశ్‌ ఇటీవల తన 27వ సినిమా 'సర్కారు వారి పాట' షూటింగ్‌ను దుబాయ్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముందు యు.ఎస్‌లో చిత్రీకరించాల్సిన షెడ్యూల్‌ను కోవిడ్‌ ప్రభావంతో దుబాయ్‌కు మార్చారు. కీలక సన్నివేశాలను దుబాయ్‌లో చిత్రీకరిస్తారు. దుబాయ్‌లో ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సర్కారువారి పాట టీమ్‌ ఇప్పుడు సెకండ్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ను షురూ చేసుకోనుంది. దీని కోసం కీర్తిసురేష్‌ దుబాయ్‌కి బయలు దేరింది. ఈ విషయాన్ని కీర్తిసురేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేస్తూ మెసేజ్‌ను పోస్ట్‌ చేసింది. సర్కారువారిపాట సినిమా షూటింగ్‌ షురూ అవుతుందని, చాలా ఎగ్జయిటింగ్‌ ఉందని కీర్తిసురేష్‌ ఫొటోతో పాటు షేర్‌చేసిన మెసేజ్‌ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

    మహానటి తర్వాత ఎక్కవగా హీరోయిన్‌ సినిమాలకే ఓటు వేస్తూ వచ్చిన కీర్తిసురేష్‌కు .. ఆమె చేసిన ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీస్‌ ఏవీ కలిసి రాలేదు. ఆ టైమ్‌లోనే సూపర్‌స్టార్‌ మహేశ్‌తో 'సర్కారు వారి పాట' సినిమాలో అవకాశం వచ్చింది. కమర్షియల్‌ సినిమా అయినప్పటికీ కీర్తిసురేష్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమాలో నటించడానికి ఓకే చెప్పేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్‌ షెడ్యూల్‌ చిత్రీకరణను తొలి షెడ్యూల్‌లో పూర్తి చేశారు. ఇప్పుడు హీరో, హీరోయిన్స్‌ మధ్య సన్నివేశాలను సెకండ్‌ షెడ్యూల్‌లో పూర్తి చేస్తున్నారు.









    సర్కారువారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకాలపై డైరెక్టర్‌ పరుశురాం తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇండియాలోని బ్యాంకులను మోసం చేసి పారిపోయిన విలన్‌ను హీరో ఇండియాకు తిరిగి ఎలా రప్పించాడనే పాయింట్‌తో సినిమా రూపొందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
    Published by:Anil
    First published: