కీర్తి సురేష్ చేసిన పనికి ఆశ్చర్యపోతున్న చిత్ర యూనిట్..

కీర్తి సురేష్.. తెలుగు, తమిళనాట అనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందరి నోళ్లలో నానుతున్న పేరు. తాజాగా ఈ భామ ‘మిస్ ఇండియా’ మూవీ సెట్‌లో చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు.

news18-telugu
Updated: October 5, 2019, 8:27 PM IST
కీర్తి సురేష్ చేసిన పనికి ఆశ్చర్యపోతున్న చిత్ర యూనిట్..
కీర్తి సురేష్ మిస్ ఇండియా స్టిల్
  • Share this:
కీర్తి సురేష్.. తెలుగు, తమిళనాట అనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందరి నోళ్లలో నానుతున్న పేరు.ఏ ముహూర్తానా ఈమె ‘మహానటి’ సినిమా చేసిందో కీర్తి సురేష్ కీర్తి ఆకాశామే హద్దుగా సాగుతోంది. ఈ సినిమాకు అందరు అనుకున్నట్టుగానే జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా ఊపుతో కీర్తి సురేష్ బాలీవుడ్‌లో కొత్త సినిమాలో కూడా సినిమాలు చేస్తుంది.   ప్రస్తుతం కీర్తి కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సత్తా చాటుతోంది. తాజాగా ఈ భామ.. తమిళంలో ‘మిస్ ఇండియా’ అనే ఫీమేల్ సెంట్రిక్ చిత్రంలో నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా కీర్తి సురేష్‌కు ఇది 24వ సినిమా. వచ్చే యేడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంద. తాజాగా కీర్తి సురేష్.. ఈ చిత్రంలో పనిచేసే వారందరికీ గోల్డ్ కాయిన్స్ బహుమతిగా ఇచ్చిందట. దీంతో చిత్ర యూనిట్ మొత్తం ఆశ్చర్యపోయిందట. గతంలో  కొంత మంది హీరోలు ఇలానే కాయిన్స్ గిఫ్ట్‌గా అందించగా.. ఓ కథానాయిక తన సినిమాకు  పనిచేసే యూనిట్ మెంబర్స్‌కు ఇలా కాయిన్స్ పంచడమనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకుంటున్నారు.

Published by: Kiran Kumar Thanjavur
First published: October 5, 2019, 8:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading