Keerthy Suresh : జీరో సైజ్ కోసం ట్రై చేస్తున్నావా.. కీర్తిని ఆడిపోసుకుంటున్నారుగా..

కీర్తి సురేష్ Photo : Instagram

Keerthy Suresh : కీర్తి తాజాగా ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె టీ, కాపీ, చెన్నై సిటీ పట్ల తన ప్రేమను తెలుపుతూ ఓ ఫోటోను పెట్టింది.

 • Share this:
  కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్స్‌లో ఒకరు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో కీర్తి సౌత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో తన నటనకు కీర్తికి జాతీయ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత నుండి కీర్తి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ వరుసగా విజయాలను అందుకుంటోంది. అందులో భాగంగా ఆమె హీరోయిన్ ఓరియెంటేడ్‌గా సినిమాలు చేస్తోంది. పెంగ్వీన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ.. ఆ కోవలోనివే. ఇక ఆమె నటించిన వాటిలో ఇప్పటికే పెంగ్విన్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. కాగా ఆమె మిగితా రెండు సినిమాలు కూడా ఓటీటీలోనే విడుదలకానున్నాయని టాక్ నడుస్తోంది. అయితే అందులో వాస్తవం లేదట. ముఖ్యంగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీగా వస్తోన్న సినిమా ‘మిస్ ఇండియా’. ఈ సినిమా ఓటిటీ ప్లాట్‌ ఫామ్‌ లో విడుదల కానుందని.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ కు ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి కొనుకుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మించాడు.

  ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మిస్ ఇండియాలో మహిళలు, లైంగిక వేధింపులు అనే అంశంపై చర్చించనున్నారట. ఓ మహిళ జీవితంలో ఒక్కో స్టేజిలో ఒక్కో రకంగా ఎలా దాడుల జరుగుతాయి అనే అంశాన్ని విశ్లేషాత్మకంగా చూపించబోతున్నారట. కీర్తి సురేష్ తన నటనతో ఇరగదీసిందట. ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీర్తి ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన రంగ్ దే, మహేష్ సర్కారు వారి పాటలో నటిస్తోంది. మరోవైపు తమిళంలో రజనీకాంత్, శివ కాంబినేషన్‌లో వస్తున్న మరో సినిమాలో కూడా కీర్తి కీలక రోల్‌లో కనిపించనుంది.  అది అలా ఉంటే కీర్తి తాజాగా ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె టీ, కాపీ, చెన్నై సిటీ పట్ల తన ప్రేమను తెలుపుతూ ఓ ఫోటోను పెట్టింది. కానీ అది ఆమె అభిమానులకు అది పెద్దగా నచ్చలేదు. ఆ ఫోటోలో కీర్తి సురేష్ చాలా స్లిమ్ అయిపోయింది. ఆకర్షణ తగ్గిందని అంటున్నారు ఆమె అభిమానులు. కీర్తి మొదట్లో బొద్దుగా, బబ్లీగా ఉండేది. ఆ లుక్స్ చూసే ఆమెను కుర్రకారు ఎక్కువగా అభిమానించారు. అలాంటి ముద్దుగుమ్మ డైటింగ్ చేస్తూ గుర్తుపట్టలేనంతగా సన్నబడిపోయింది. దీంతో నెటిజన్స్ ఆమె పిక్ పై రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. జీరో సైజ్ ఏమైనా ట్రై చేస్తున్నావా.. అసలు కీర్తికి ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నితిన్ రంగ్ దే షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. దీంతో పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా వస్తోన్న సర్కారు వారి పాటలో కీర్తి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అమెరికా లో జరగనుంది. దీంతో కీర్తి అమెరికా పయనం కానుంది. దీనికి సంబందించిన వీసా పనులు జరుగుతున్నాయి.
  Published by:Suresh Rachamalla
  First published: