హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi : చిరంజీవికి చెల్లెలుగా ఆ యువ హీరోయిన్ ఖరారు.. భారీగా డిమాండ్..

Chiranjeevi : చిరంజీవికి చెల్లెలుగా ఆ యువ హీరోయిన్ ఖరారు.. భారీగా డిమాండ్..

చిరంజీవి (Chiranjeevi Photo : Twitter)

చిరంజీవి (Chiranjeevi Photo : Twitter)

Chiranjeevi : చిరంజీవి తమిళ సూపర్ హిట్ చిత్రం వేదాళంను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

చిరంజీవి తమిళ సూపర్ హిట్ చిత్రం వేదాళంను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్‌లో అజిత్ చేసిన పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు. దీనికోసం టెస్ట్ షూట్ చేశారు చిరంజీవి. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ఆ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసుకున్నారు. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. దీంతో ఈ పాత్రలో చాలా మందిని పరిశీలించిన చిత్రబృందం ఓ హీరోయిన్‌ను ఖరారు చేశారని తెలుస్తోంది. మొదట ఈ పాత్రలో సాయి పల్లవిని అనుకున్నారు. కానీ ఎందుకో ఆమె ఒప్పుకోలేదని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. అనేక పేర్ల పరిశీలన తర్వాత చివరకు కీర్తి సురేష్‌ బాగుంటుందని మెగా టీమ్ కూడా భావించిందట. దీంతో చిరుకి చెల్లిగా కీర్తి సురేష్‌‌ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇక చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటించడానికి ఆమెను కూడా ఒప్పించారట. సిస్టర్ పాత్రను చేయడానికి కీర్తి సురేష్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని టాక్. అయితే ఆమె అడిగినంత ఇవ్వడానికి మేకర్స్ కూడా అంగీకరించారట. అన్ని కుదరడంతో ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

ఇక చిరంజీవి నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఇక చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాను చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ ఓ మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట. ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఆచార్యలో చిరంజీవి సరసన ముందునుండి త్రిషను అనుకుంటే ఆమె ఏవో కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో కాజల్‌ను తీసుకుంది చిత్రబృందం. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఇది కూడా చూడండి : లోదుస్తుల్లో యాంకర్ విష్ణుప్రియ.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

ఆచార్యతో పాటు చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 12 నుంచి మొదలు కానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే సినిమాను ఖారారు చేసినట్లు తెలుస్తోంది. అనేక పేర్లను పరిశీలించిన చిత్ర బృందం ఈ టైటిల్ వైపు మొగ్గు చూపిస్తుందని దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ పనిచేస్తున్నారు.

First published:

Tags: Tollywood news

ఉత్తమ కథలు