పార్టీ చేసుకున్న కీర్తి సురేష్..

కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో అగ్ర హీరోయిన్లల ఒకరుగా రాణిస్తున్నారు. ఆమె తెలుగులో నటించిన 'మహానటి' సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

news18-telugu
Updated: November 23, 2019, 11:30 AM IST
పార్టీ చేసుకున్న కీర్తి సురేష్..
Instagram/keerthysureshofficial
  • Share this:
కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో అగ్ర హీరోయిన్లల ఒకరుగా రాణిస్తున్నారు. ఆమె తెలుగులో నటించిన 'మహానటి' సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసింది. మహానటిలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోవడమే కాదు.. కీర్తికి జాతీయ పురస్కారం కూడ లభించింది. కాగా కీర్తి సురేష్ రామ్ హీరోగా వచ్చిన 'నేను శైలజ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన నేను లోకల్‌లో అదరగొట్టింది. అయితే 'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న కీర్తి, ఆ తర్వాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో చాలా ఆచి తూచి వ్యవహరిస్తోంది. కీర్తి ప్రస్తుతం మిస్ ఇండియా’లో నటిస్తోంది. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. కీర్తితో పాటు ఈ సినిమాలో నవీన్ చంద్ర, జగపతిబాబు, నరేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. మరో వైపు కీర్తి ఓ స్పోర్స్ డ్రామాలో కూడా నటిస్తోంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా లుక్‌ను ఆ మధ్య కీర్తి బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. ఆ లుక్‌లో కీర్తి సన్నగా మారి స్టైలీష్‌ లుక్‌లో అదరగొడుతోంది. అది అలా ఉంటే కీర్తి దుబాయ్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఫ్రెండ్స్‌తో అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. దానికి సంబందించిన కొన్ని పిక్స్‌ను కీర్తి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 keerthy suresh enjoys dubai trip,Keerthy Suresh comments on love marriage,keerthy suresh miss india,keerthi suresh insta,keerthi suresh new movies,keerthi suresh fb,keerthi suresh age,keerthi suresh size,keerthi suresh pics,keerthy suresh movies,keerthy suresh interview,keerthy suresh rejects rana,keerthy suresh rejects rana daggubati offer,keerthy suresh speech,keerthi suresh rejected rana,keerthi suresh rejected rana movie,keerthy suresh telugu movies,keerthy suresh latest news,keerthi suresh reject nani,keerthy suresh say no to rana,keerthy suresh rana daggubati,Keerthy Suresh rejects rana film,keerthy suresh,keerthi suresh,keerthy suresh speech,keerthi suresh hot,keerthy suresh movies,mahanati keerthy suresh,keerthy suresh latest updates,keerthi suresh movies,keerthi suresh new movie,keerthy suresh movies hindi dubbed,keerthy suresh navel,keerthy suresh father,keerthy suresh telugu,keerthy suresh mother,keerthy suresh new film,keerthy suresh dubbing,keerthu suresh hot,keerthy suresh new movie,కీర్తి సురేష్,కీర్తి సురేష్ కొత్త సినిమాలు,
Instagram/keerthysureshofficial


కవ్విస్తోన్న శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్..
Published by: Suresh Rachamalla
First published: November 23, 2019, 10:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading