Nani | Dasara : నాని సినిమాకు భారీగా డిమాండ్ చేస్తోన్న కీర్తి సురేష్..

Keerthy Suresh Photo : Instagram

Nani | Dasara : దసరా రోజున నాని కొత్త సినిమాను ప్రకటించారు. దసరా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారట. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

 • Share this:
  నాచురల్ స్టార్ (Nani) వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా దసరా రోజున ఆయన మరో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దసరా (Dasara)అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారట. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా తెలంగాణ నేపధ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్‌లో నాని రగ్డ్ లుక్కుతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఓ టీజర్’ను వదిలారు. ఆ వీడియోలో నాని తెలంగాణ యాసలో ఓ రేంజ్‌లో అదరగొట్టారు. సింగరేణి నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించనున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించడానికి భారీగా డిమాండ్ చేసిందట.

  దాదాపు మూడు కోట్లను డిమాండ్ చేసినట్లు టాక్. ఇది ఒక రకంగా ఆమె విషయంలో భారీ రెమ్యూనరేషన్‌నే అయినప్పటికీ.. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. కీర్తి ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తమిళ్‌లో అన్నాత్తేలోను నటిస్తున్నారు.  ఇక నాని దసరా విషయానికి వస్తే... ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడిగా కనిపించనున్నారు. అంతేకాదు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారని తెలుస్తోంది. తెలంగాణ యాసపై పట్టుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ని కూడా నియమించుకున్నట్టు తెలుస్తుంది.

  Naga Chaitanya : అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్... అనుకున్న సమయం కంటే ముందే...

  నాని గ‌తంలో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా కోసం రాయ‌ల‌సీమ యాస నేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన హీరోగా వచ్చిన తాజా చిత్రం టక్ జగదీష్. రీతూ వర్మ (Ritu Varma), ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్స్ గా నటించారు. టక్ జగదీష్(Nani Tuck Jagadish)సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.


  ఈ సినిమా మొదట థియేటర్ రిలీజ్ కోసం ప్రయత్నించిన పలు కారణాల వలన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఎంచుకుంది. అందులో భాగంగా టక్ జగదీష్ (Amazon prime) ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న రిలీజ్ అయ్యింది. మొదట్లో ఈ సినిమా గురించి కాస్తా నెగిటివ్ టాక్ వచ్చిన ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.

  దసరా సినిమాతో పాటు నాని నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. నాని ట్యాక్సీవాలా' ఫేమ్‌ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్’  (Shyam Singha Roy)సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదిని చిత్రబృందం ప్రకటించనుంది.

  ఈ సినిమాలో సాయి పల్లవి, 'ఉప్పెన' ఫేమ్‌ కృతిశెట్టి హీరోయిన్‌లుగా (Sai pallavi ) (kriti shetty)  నటిస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్‌‌లో నాని 70 ఏళ్ల వయసు మళ్లిన వ్యక్తిగా కనిపించబోతున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మంచి ఆదరణ పొందింది. పిరియాడిక్‌ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం మొత్తం కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కినట్లు సమాచారం. ఈ మూవీకి మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందిస్తున్నారు.
  Published by:Suresh Rachamalla
  First published: