కీర్తి సురేష్ సినీ ప్రయాణానికి ఆరేళ్లు.. ఎమోషనల్ అయిన మహానటి..

కీర్తి సురేష్.. తెలుగు, తమిళనాట అనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందరి నోళ్లలో నానుతున్న పేరు. ఈ రోజుతో కీర్తి సురేష్ నటిగా 6 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న విషయాన్ని తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

news18-telugu
Updated: November 18, 2019, 6:30 PM IST
కీర్తి సురేష్ సినీ ప్రయాణానికి ఆరేళ్లు.. ఎమోషనల్ అయిన మహానటి..
కీర్తి సురేష్ (Instagram/keerthysureshofficial)
  • Share this:
కీర్తి సురేష్.. తెలుగు, తమిళనాట అనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందరి నోళ్లలో నానుతున్న పేరు. 2013లో ‘గీతాంజలి’ అనే మలయాళ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్.. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్ర సీమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈ భామ.. రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి ’ సినిమా కీర్తి సురేష్ నట జీవితాన్నే మార్చేసింది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  ఈ సినిమాతో కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ చేసే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ తెలుగులో ‘మన్మథుడు 2’ లో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక ఎమోషనల్ థ్రిల్లర్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. వాటితో పాటు ‘మిస్ ఇండియా’ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషిస్తోంది. ఈ రోజుతో కీర్తి సురేష్ నటిగా ఆరేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఓ భావోద్వేకమైన ట్వీట్ చేసింది.
ఆరేళ్ల క్రితం నటిగా జన్మించాను. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించే అవకాశం దక్కడం తన అదృష్ణం కొద్ది దక్కిందన్నారు. మీ ప్రేమాభిమానాలతోనే నేనీ స్థాయిలో ఉన్నాను. నేనీ స్టేజ్‌లో ఉండటానికి కారణం.. నా కుటుంబ సభ్యులు స్నేహితులే అంటూ కారణం అంది. ఇంకా సినీ పరిశ్రమలో నేను ప్రయాణించాల్సిన దూరం ఇంకా ఉంది అంటూ ట్వీట్ చేసింది.
First published: November 18, 2019, 6:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading