కీర్తి సురేష్ ప్రేమ పెళ్లి చేసుకోనుందా.. తేల్చేసిన ముద్దుగుమ్మ..

Keerthy Suresh :  ఇటీవల మీడియాతో మాట్లాడిన కీర్తి.. ప్రేమ, పెళ్లిలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

news18-telugu
Updated: January 21, 2020, 7:08 AM IST
కీర్తి సురేష్ ప్రేమ పెళ్లి చేసుకోనుందా.. తేల్చేసిన ముద్దుగుమ్మ..
Instagram
  • Share this:
కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో అగ్ర హీరోయిన్లల ఒకరుగా ఉన్నారు.  తెలుగు సినిమా 'మహానటి'తో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది కీర్తి. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసింది. మహానటిలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోవడమే కాదు.. కీర్తికి జాతీయ పురస్కారం కూడ లభించింది.  'నేను శైలజ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన కీర్తి సురేష్ వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న కీర్తి, ఆ తర్వాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.  కాగా ఆ మధ్య మీడియాతో మాట్లాడిన కీర్తి ప్రేమ, పెళ్లిలపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. లవ్ మ్యారేజ్‌లు మా ఇంట్లో సహజమే.. మా అమ్మానాన్నలది కూడా ప్రేమ వివాహమే... మా సిస్టర్ కూడా అలానే పెళ్లి చేసుకుంది. అయితే నా విషయానికి వస్తే.. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానో, లేదో నాకు తెలీదు.. కానీ ప్రేమించడం తప్పు కాదు అంటోంది. ప్రేమపై నాకు గౌరవం ఉందన్నారు. అయితే ప్రస్తుతం నాకు కాబోయేవాడు ఎలా ఉండాలనే  ఆలోచన లేదు.. ప్రస్తుతం కెరీర్‌పైనే ద‌ృష్టి అంతా అంటోంది.



 





View this post on Instagram




 

For the Galatta awards recently in this classic white and gold ❤️ Outfit- @masabagupta @houseofmasaba Jewellery- @mykreshya M&H @moovendhar_makeup @savitanalwade Photos- @kiransaphotography Styling - @shravyavarma #styledbyshravyavarma


A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on





కీర్తి ప్రస్తుతం మిస్ ఇండియా’లో నటిస్తోంది. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. మరో వైపు కీర్తి ఓ స్పోర్స్ డ్రామాలో కూడా నటిస్తోంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా లుక్‌ను కీర్తి బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. ఆ లుక్‌లో కీర్తి సన్నగా మారి స్టైలీష్‌ లుక్‌లో అదరగొడుతోంది. మరోవైపు కీర్తి సురేష్ రజనీకాంత్, శివ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో కీలకరోల్‌ చేస్తోంది. తెలుగులో నితిన్‌తో రంగ్‌దే అనే సినిమా చేస్తోంది కీర్తి.
First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు