Keerthy Suresh: చాయ్ అమ్ముతున్న కీర్తి సురేష్.. మహానటి కొత్త బిజినెస్ అదిరిందిగా..

కీర్తి సురేష్ (Twitter/Photo)

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ స్టాయిలో ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. తాజాగా కీర్తి సురేష్.. తాను నటించిన మిస్ ఇండియా సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడింది.

  • Share this:
    Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.   ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ స్టాయిలో ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. తాజాగా ఈమె ఛాయ్ అమ్ముతోంది. ఛాయ్ అమ్ముతోంది అంటే నిజమే అనుకుంటున్నారా లేదు.. తన లేటెస్ట్ మూవీ ‘మిస్ ఇండియా’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా టీ అమ్మింది. వివరాల్లోకి వెళితే.. కీర్తి ప్రస్తుతం తెలుగులో నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే'లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ యాక్ట్ చేస్తోంది. అది అలా ఉంటే కీర్తి ఇటీవల అన్ని లేడి ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తోంది. అందులో భాగంగా ఆమె ఇటీవల నటించిన చిత్రం పెంగ్విన్. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్‌లో కాకుండా..డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై పరవాలేదని పించింది. ఇక ఆమె నటించిన మరో చిత్రం మిస్ ఇండియా.. మహిళలపై జరిగే వేధింపుల నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా కూడా  నవంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో కీర్తి సురేష్ నటించిన రెండో సినిమా ఇది.  ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా చాయ్ పే చర్చా అంటూ అభిమానులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఈ  సినిమా థీమ్ చెప్పింది. అంతేకాదు ఛాయ్ ప్రేమి అంటూ నల్ల టీ షర్ట్ వేసుకొని మరి ప్రమోషన్ స్టార్ట్ చేసింది.



    మన దేశంలో అందరు టీ తాగడానిికీ ఇష్టపడతారు. విదేశాల్లో మాత్రం ఎక్కువ మటుకు కాపీ తాగడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. అలాంటి దేశంలో మన దేశం నుండి ఫారెన్‌కు వెళ్లిన ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి టీ బిజినెస్ స్టార్ట్ చేస్తోంది. ఈ సందర్భంగా ఆమెకు ఎదురైన సవాళ్లే మిస్ ఇండియా స్టోరీ అని చెప్పింది కీర్తి సురేష్. ఓ అమ్మాయి చాలెంజింగ్ స్టోరీనే ‘మిస్ ఇండియా’ సినిమా. ముందుగా ఈ సినిమా గ్లామర్‌కు సంబంధించిన సినిమా అనుకున్నా.. ట్రైలర్ విడుదల తర్వాత అభిమానులకు క్లారిటీ వచ్చిందన్నారు కీర్తి సురేష్.

    కీర్తి సురేష్ (Twitter/Photo)




    ఈ సినిమాతో నరేంద్రనాథ్ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరోవైపు కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్ లక్ సఖి’ కూడా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు తమిళంలో రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న ‘అన్నాత్తే’లో రజినీ కూతురుగా నటిస్తోంది కీర్తి సురేష్.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: