హోమ్ /వార్తలు /సినిమా /

అభిమానులకు కీర్తి సురేష్ బిగ్ షాక్.. రజినీకాంత్ సినిమాలో..

అభిమానులకు కీర్తి సురేష్ బిగ్ షాక్.. రజినీకాంత్ సినిమాలో..

కీర్తి సురేష్‌,రజినీకాంత్ (file photo)

కీర్తి సురేష్‌,రజినీకాంత్ (file photo)

అభిమానులకు కీర్తి సురేష్ బిగ్ షాక్ ఇవ్వనుంది. వివరాల్లోకి వెళితే.. ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ కీర్తి పతాకం అమాంతం పెరిగిపోయింది.

    అభిమానులకు కీర్తి సురేష్ బిగ్ షాక్ ఇవ్వనుంది. వివరాల్లోకి వెళితే.. ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ కీర్తి పతాకం అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు కూడా కైవసం చేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న 168వ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో కీర్తి సురేష్.. రజినీకాంత్ సరసన హీరోయిన్‌గా నటించడం లేదని సమాచారం. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా నటిస్తున్నారు. మరోవైపు కీర్తి సురేష్ ఈ చిత్రంలో రజినీకాంత్ చెల్లెలు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఒక రకంగా కీర్తి సురేష్‌ అభిమానులకు ఇది మింగుడు పడని విషయం. రజినీకాంత్ సరసన హీరోయిన్‌గా నటించకుండా ఈ పాత్ర ఎందుకు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ చిత్రంలో కీర్తి సురేష్ సరసన ఎవరైనా హీరోగా నటించే అవకాశం ఉంది. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ప్రకాష్ రాజ్, సూరి,శ్రీమాన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2020 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్టు సమాచారం.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Kollywood, Kushboo, Meena, Rajinikanth, Tollywood

    ఉత్తమ కథలు