• Home
 • »
 • News
 • »
 • movies
 • »
 • KEERTHY SURESH AJAY DEVGN SPORTS BASED NEW MOVIE MAIDAAN STARTED TODAY TA

కీర్తి సురేష్ కొత్త సినిమా ప్రారంభం.. ఇంతకీ హీరో ఎవరంటే..

కీర్తి సురేష్ (photo/ Instagram)

ఏ ముహూర్తానా ‘మహానటి’ సినిమా చేసిందో కీర్తి సురేష్ కీర్తి ఆకాశామే హద్దుగా సాగుతోంది. ఈ సినిమాకు అందరు అనుకున్నట్టుగానే జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. తాజాగా ఈ రోజు కొత్త సినిమాకు శ్రీకారం చుట్టింది.

 • Share this:
  ఏ ముహూర్తానా ‘మహానటి’ సినిమా చేసిందో కీర్తి సురేష్ కీర్తి ఆకాశామే హద్దుగా సాగుతోంది. ఈ సినిమాకు అందరు అనుకున్నట్టుగానే జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా ఊపుతో కీర్తి సురేష్ బాలీవుడ్‌లో కొత్త సినిమాకు సైన్ చేసింది. అంతేకాదు ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్ మూవీల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ప్రముఖ భారతీయ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న  సినిమాకు ‘మైదాన్’ అనే టైటిల్ ఖరారు చేసారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ ఈ రోజే ప్రారంభమైంది. 1952 -1962 లో భారతీయ ఫుట్‌బాల్‌కు స్వర్ణయుగానికి సంబంధించిన స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 1952 నుంచి 1962 వరకు భారతీయ ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేసిన అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 1950 నుంచి 1963 వరకు భారత ఫుట్ టీమ్ మేనేజర్‌గా మన దేశానికి ఎన్నో పతకాలు వచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దారు సయ్యద్ అబ్దుల్ రహీమ్. అమిత్ శర్మ డైరెక్ట్ చేస్తున్న  ఈమూవీని జీ స్టూడియో, బోనీకపూర్, ఆకాశ్ చావ్లా, జాయ్ సేన్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు.

  ‘మైదాన్’ పోస్టర్ ఫస్ట్ లుక్ (Twitter/Photo)


  ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్  పాత్రలో నటిస్తున్నాడు.  ఈ సినిమాతో ‘మహానటి’తో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. మరి ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్‌లో కూడా పాగా వేస్తుందా లేదా అనేది చూడాలి.
  First published: