Sarkaaru Vaari Paata - Keerthi suresh: టాలీవుడ్ బ్యూటీ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ మహానటి.. స్టార్ హీరోయిన్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మొత్తానికి ఓ గుర్తింపు అందుకుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ జీ ఎమ్ బీ ఎంటర్టైన్మెంట్స్ 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని వినిపిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాలోని మహేష్ బాబు ప్రీ లుక్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటె ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది.
ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర హైలెట్ గా ఉంటుందట. స్క్రీన్ టైం కూడా ఎక్కువగా ఉంటుందట. ఇందులో ఈమె పాత్ర మహేష్ బాబుకు సబార్డినేట్ గా కనిపిస్తుందని అంటున్నారు. ఈ సినిమా బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం అందగా.. ఇందులో సోషల్ మెసేజ్ తో కూడిన కథాంశంగా తెరకెక్కనుందట. బ్యాంకింగ్ రంగాల వ్యవస్థలో జరుగుతున్న మోసాల అవినీతికి సంబంధించిన విషయాన్ని చూపించనున్నారట. ఇక ఇందులో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్ గా కనిపించనున్నాడట. అంతే కాకుండా అదే బ్యాంకు లో కీర్తి సురేష్ ఉద్యోగినిగా కనిపించనుందట. ఇక వీరిద్దరి మధ్య కాస్త కామెడీ కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తమిళం, మలయాళం లో కూడా వరుస సినిమాల్లో బిజీగా ఉంది. ఇదే కాకుండా లేడీ ఓరియెంటెడ్ గుడ్ లక్ సఖి సినిమాలో కూడా నటిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Keerthi Suresh, Sarkaaru vari paata, Super star mahesh babu film, Tollywood, కీర్తి సురేష్, టాలీవుడ్ బ్యూటీ, మహానటి, మహేష్ బాబు, సర్కారు వారి పాట