KEERTHI SURESH INTERESTING COMMENTS ON MAHESH BABU SB
Mahesh Babu: మహేష్ బాబు ముఖంమీద తిట్టమన్నారు.. నా వల్ల కాలేదు.. హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మహేష్ బాబు ముఖం చూసి అలా తిట్టడం తన వల్ల కాలేదని ఆమె అన్నారు. నేను అలా చేయలేనని.. ఆమె అనడంతో.. ముందుగా అంతా షాక్ తిన్నారట, తర్వాత ఆమెను ఎలాగోలా ఒప్పించారట.
మహేష్ బాబు ముఖం చూసి అలా తిట్టడం తన వల్ల కాలేదని ఆమె అన్నారు. నేను అలా చేయలేనని.. ఆమె అనడంతో.. ముందుగా అంతా షాక్ తిన్నారట, తర్వాత ఆమెను ఎలాగోలా ఒప్పించారట.
మహేష్ బాబు నటించిన మూవీ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). ఈసినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై రికార్డులు సృష్టించింది. మాస్ ఆడియన్స్‌కు ఫుల్ మాస్ ఎంటర్ టైనర్‌గా నిలిచింది. ఈ సినిమా హీరోయిన్గా కీర్తి సురేష్(Keerthi Suresh) నటించిన విషయం తెలిసిందే. ఇక కీర్తి నటన సర్కారు వారి పాటలో ఎక్స్ట్రార్డనరీ అనే చెప్పాలి. ఇంతకుముందు ఎప్పుడూ కనిపించని లుక్‌తో డైలాగస కీర్తీ అలరించింది. మరీ ముఖ్యంగా మహేష్ బాబును(Mahesh Babu) .. కీర్తి తిట్టే సీన్స్‌కు థియేటర్లలో ఈలలు వేస్తూ.. గోల చేశారు అభిమానులు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సినిమాలోని ఒక సన్నివేశంలో కీర్తి సురేష్ మహేష్ ను తిడుతుంటుంది. కొన్ని అనకూడని పదాలు అంటూ తిడుతుంది. దర్శకుడు మహేష్ ను అలా తిట్టించడంపై మహేష్ బాబు అభిమానుల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. అయితే సినిమాలోని ఆ సీన్ కు సంబంధించి కీర్తి సురేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. మహేష్ ను అలా తిట్టే సమయంలో తన గుండె ఆగిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు. మహేష్ ఫ్యాన్స్ తనపై సీరియస్ అవుతారని అనిపించిందని కీర్తి సురేష్(Keerthi Suresh) కామెంట్లు చేశారు. మహేష్ బాబు ముఖం చూసి అలా తిట్టడం తన వల్ల కాలేదని ఆమె అన్నారు. మొదట తాను ఆ డైలాగ్ ను మెల్లగా చెప్పానని కీర్తి సురేష్ తెలిపింది. అయితే పరశురాం(Parasuram) మాత్రం అందుకు ఒప్పుకోలేదన్నారు. ముఖం మీద చూపించి తిట్టాలని చెప్పారని కీర్తి సురేష్‌కు చెప్పారట. దీంతో మొత్తానికి ఎలాగోలా ఆ సన్నివేశాన్ని పూర్తి చేశానని కీర్తి తెలిపింది.
అయితే ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ భయపడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు మహేష్ బాబు కూడా ఈ సిన్ గురించి స్పందించి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. మూడు టేకులు అయినా కీర్తి సురేష్ తనను తిట్టలేకపోయిందని మహేష్ కామెంట్లు చేశారు. ఆ సమయంలో దుబాయ్(Dubai) లో ఎండ మండిపోతుందని సన్నివేశం ఓకే కావడం లేదని మహేష్ చెప్పారు. తాను కీర్తి సురేష్ దగ్గరకు వెళ్లి తిట్టు తిట్టు అని మొరపెట్టుకున్నానని మహేష్ చెప్పుకొచ్చారు. డైరెక్టర్ కూడా తిట్టాలని గట్టిగా చెప్పడంతో కీర్తి సురేష్ తిట్టారని మహేష్ బాబు వెల్లడించారు. దీంతో ఇప్పుడు మహేష్, కీర్తి చేసిన కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.