Home /News /movies /

KEERTHI SURESH EMOTIONAL POST ON MAHESH BABU AND SARKARU VAARI PAATA SB

Keerthi Suresh: మహేష్ బాబు లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. కీర్తి సురేష్ ఎమోషనల్ పోస్టు

మహేష్‌తో కళావతి (Twitter/Photo)

మహేష్‌తో కళావతి (Twitter/Photo)

కీర్తి సురేష్ నటించిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్టు పెట్టింది. అందులో మహేష్ బాబు గురించి చివర్లో ప్రత్యేకంగా రాసుకొచ్చింది.

    కీర్తి సురేష్‌కు (Keerthi Suresh) ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వచ్చిన సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో కీర్తి ఖాతాలో ఓ హిట్ పడింది. సర్కారు వారి పాట మే 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అనుహ్యమైన స్పందన వచ్చింది. ఇందులో మహేష్, కీర్తి సురేష్ లుక్స్ ప్రేక్షకులను అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక టాలీవుడ్ (Tollywood) బ్యూటీ ముద్దు గుమ్మ కీర్తి సురేష్ గురించి మనందరికీ తెలిసిందే. నేను శైలజ ( Nenu Sailaja) సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తరువాత తెలుగులో పలు సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

    ఈ ఆనందంలో కీర్తి ఎంతో ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ ని రాసుకొచ్చింది. కీర్తి సురేష్ నటించిన సాని కాయిదం అనే మూవీతో పాటు సర్కార్ వారి పాట చిత్రాలు పెద్ద విజయాలు అందుకున్నాయి. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా రెండు సినిమాలు చేసిన టీంకు ధన్యవాదాలు తెలిపింది కీర్తి. ‘ప్రియమైనవారందరికీ నా మాట ఇది. నటిగా ఉండటం అనేది హానికర ఎగుడుదిగుడు ప్రయాణం లాంటిది.మనం ఎత్తులు పల్లాలను చూస్తాము. కానీ ఈ ప్రయాణం తరచుగా మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇటీవలి గతం నాకు పరీక్షా సమయం లాంటిది. ఇది ఒక దశ. ప్రపంచానికి నా అత్యుత్తమ ప్రదర్శనను అందించడానికి నేను నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని నాకు అర్థమైంది అని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.’

    అయితే ఈ పోస్టులో అందరికీ కృతజ్ఞతలు తెలిపిన కీర్తి... మహేష్ బాబుకు మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ.. మహేష్ బాబు పేరు ప్రస్తావించారు. మహేష్‌ బాబుతో కలిసి పనిచేయడం నిజంగా చాలా బావుంది అంటూ.. ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. ఇక నెటిజన్లు కూడా కీర్తి సురేష్ రాసిన పోస్టుపై కామెంట్లు పెడుతున్నారు. చాలా బాగా రాశారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Keerthi Suresh, Mahesh Babu, Sarkaru Vaari Paata

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు