హోమ్ /వార్తలు /సినిమా /

Keeravani: ఎన్టీఆర్‌కు కీరవాణి అంకితం ఇచ్చిన ఈ పాట తెలుసా.. తారక్ ముందు తప్ప ఎక్కడ ఆ పాట పాడని క్రీమ్..

Keeravani: ఎన్టీఆర్‌కు కీరవాణి అంకితం ఇచ్చిన ఈ పాట తెలుసా.. తారక్ ముందు తప్ప ఎక్కడ ఆ పాట పాడని క్రీమ్..

కీరవాణికి పద్మశ్రీ అవార్డు  Keeravani Photo : Twitter

కీరవాణికి పద్మశ్రీ అవార్డు Keeravani Photo : Twitter

Padma Shri MM Keeravani: ప్రతి యేడాది కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా  వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పద్మ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి కేంద్రం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి సినీ ప్రముఖులు బెస్ట్ విషెస్ అందజేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Keeravani: ప్రతి యేడాది కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా  వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పద్మ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది కూడా కేంద్రం 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది. అందులో ఆరుగురికి పద్మ విభూషణ్.. 9 మందికి పద్మ భూషణ్.. 91 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటిచింది. ఈ కోవలో ఆర్ఆర్ఆర్ సినిమా సహా తెలుగు, తమిళం హిందీ సహా పలు అద్భుతమైన బాణీలు సమకూర్చిన  కీరవాణికి కేంద్రం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు కీరవాణికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక పద్మ అవార్డుల గ్రహీతలకు బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్,ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి నటీనటులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక కీరవాని విషయానికొస్తే.. నాటు నాటు పాటతో ఈయన పేరు ఇపుడు విశ్వవ్యాప్తం కూడా అయింది. తాజాగా ఈయన స్వర పరిచిన నాటు నాటు పాట ఇపుడు ఆస్కార్ బరిలో ఉత్తమ గీతం విభాగంలో నామినేట్ అయింది. మన దేశం తరుపున ఓ భారతీయ చిత్రం నామినేట్ కావడం అనేది ఇదే మొదటిసారి. అంతకు ముందు నాటు నాటు పాటకు కీరవాణి అమెరికాలోని గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. గత కొన్నేళ్లుగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును పొందిన వాటికే ఆస్కార్ అవార్డులు వరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీరవాణి.. త్వరలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.

ఇక ఈయన కెరీర్‌లో ఎన్నో అద్భుత చిత్రాలకు సంగీతం అందించారు. ఇక ఈయన సంగీతం అందిస్తూ పాట పాడిన ‘మాతృదేవోభవ’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో ‘రాలిపోయే పూవా నీకు రాగాలేందుకే’ పాటకు ప్రత్యేక స్థానం ఉంది. వేటూరి రాసిన ఈ పాటకు జాతీయ అవార్డు వరించింది. ఈ పాటను ఓ సందర్భంలో ఎన్టీఆర్‌కు అంకితమిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ పాటను NTR ముందు మాత్రమే పాడతారు. ఒకవేళ ఆయన అనుమతి ఇస్తే మాత్రమే బయటి వాళ్ల దగ్గర మాత్రమే పాడతాననే విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. తాజాగా తనకు వచ్చిన అవార్డును తనకు వచ్చిన విజయం మాత్రమే కాదు.. తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరిది అంటూ ట్వీట్ చేశారు.

కీరవాణి విషయానికొస్తే.. మనసు మమత చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్షణ క్షణం’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు తీసుకొచ్చింది. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అల్లరి మొగుడు’ సినిమాతో మొదలై.. దాదాపు 20 పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అందులో ఇక నాగార్జున హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.ఇక హీరోల్లో నాగార్జునతో ఎక్కువ చిత్రాలకు పనిచేసారు. ఇక ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తరుపున 11 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఇందులో 8 ఉత్తమ సంగీత దర్శకుడిగా అందుకుంటే.. 3 సార్లు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా ఈ అవార్డును అందుకున్నారు.

First published:

Tags: Jr ntr, M. M. Keeravani, Tollywood

ఉత్తమ కథలు