‘కేదార్‌నాథ్’ మూవీపై బ్యాన్ విధించని ఉత్తరాఖండ్ ప్రభుత్వం..కండిషన్స్ అప్లై

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారాఅలీ ఖాన్ హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కేదార్‌నాథ్’. అభిషేక్ కపూర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని..2013లో కేదార్‌నాథ్‌లో సంభవించిన వరుదల నేపథ్యంలో తెరకెక్కించారు. దీనిపై స్థానికంగా ఉండే కలెక్టర్స్‌ స్థానిక పరిస్థితులను బట్టి ఈ మూవీపై నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు ప్రకటించింది.

news18-telugu
Updated: December 7, 2018, 1:12 PM IST
‘కేదార్‌నాథ్’ మూవీపై బ్యాన్ విధించని ఉత్తరాఖండ్ ప్రభుత్వం..కండిషన్స్ అప్లై
కేదార్ నాథ్ మూవీ
  • Share this:
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారాఅలీ ఖాన్ హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కేదార్‌నాథ్’. అభిషేక్ కపూర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని..2013లో కేదార్‌నాథ్‌లో సంభవించిన వరుదల నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఒక ముస్లిం యువకుడు, హిందూ యువతి మధ్య సంభవించిన ప్రేమ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు.

హిందూవులకు ఎంతో పవిత్రమమైన కేదార్‌నాథ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీ పలు వివాదాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ మూవీలో పలు అభ్యంతరకర సన్నివేశాలు తమ మనోభావాలను కించపరిచేలా ఉందనంటూ ‘కేదార్‌నాథ్’ మూవీని బ్యాన్ చేయాలని కేదార్‌నాథ్ భక్త మండల్ ఉత్తరాఖండ్ హైకోర్ట్‌లో పిల్ దాఖలు చేసింది. ఇపుడీ పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది.

దీనిపై స్థానికంగా ఉండే కలెక్టర్స్‌ స్థానిక పరిస్థితులను బట్టి ఈ మూవీపై నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు ప్రకటించింది. ఈ మూవీని ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్, ఉదమ్ సింగ్ నగర్ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ మేజిస్ట్రేట్స్ శాంతి భద్రతల దృష్ట్యా ఈ మూవీపై నిషేధం విధించారు.


మరోవైపు ఈ మూవీ విషయమై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్..ఆ రాష్ట్ర టూరిజం మినిష్టర్ సత్పాల్ మహారాజ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.  ఈ కమిటీ అన్ని పరిశీలించాకా ఈ మూవీని బ్యాన్ చేయాల్సిన పనిలేదని రిపోర్ట్ ఇచ్చిందని సమాచారం.

మరోవైపు స్థానిక జిల్లా కలెక్టర్స్‌కే ఈ మూవీపై నిషేధం విధించాలా వద్దా అనేది అక్కడి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని తాత్కాలికంగా అధికారాలను కట్టబెట్టింది. మొత్తానికి వివాదాలతో మొదలైన ఈ మూవీ చివరకు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


ఇది కూడా చదవండి కొత్త కథలు వద్దు..పాత కథలే ముద్దు..సీక్వెల్స్‌కు జై కొడుతున్న శంకర్

చిరు, బాలయ్య..ఇపుడు మాధురి

టాలీవుడ్‌లో బయోపిక్ ట్రెండ్...‘ఎన్టీఆర్’ మూవీతో పెరిగిన క్రేజ్
Published by: Kiran Kumar Thanjavur
First published: December 7, 2018, 1:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading