హోమ్ /వార్తలు /సినిమా /

KBC 14 : అమితాబ్ కేబీసీ 14వ సీజన్ త్వరలో ప్రారంభం.. కంటెస్టెంట్స్ కోసం షోలో అత్యంత కీలకమైన మార్పు..

KBC 14 : అమితాబ్ కేబీసీ 14వ సీజన్ త్వరలో ప్రారంభం.. కంటెస్టెంట్స్ కోసం షోలో అత్యంత కీలకమైన మార్పు..

KBC 14 త్వరలో ప్రారంభం ప్రోమో విడుదల (Twitter/Photo)

KBC 14 త్వరలో ప్రారంభం ప్రోమో విడుదల (Twitter/Photo)

KBC 14 : అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది తమ కలలను సాకారం చేసుకున్నారు. తాజాగా కేబీసీకి సంబంధించిన 14వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

  KBC 14 :  లాక్ కర్‌దే అంటూ కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని కౌన్ బనేగా కరోడ్‌పతి (Kaun Banega Crodepati) ప్రోగ్రామ్‌తో అందుకున్నారు బిగ్ బీ (Big B) అమితాబ్ బచ్చన్. ఈ ప్రోగ్రామ్‌లో ఒక్క సీజన్ తప్పించి అన్ని సీజన్లకు బిగ్‌బీ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇప్పటికే కౌన్ బనేగా కరోడ్ పతి 13 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. తాజాగా 14వ సీజన్‌కు (KBC 14) రెడీ అవుతోంది. గత ఇరవై రెండు యేళ్లుగా కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్ అప్రతిహతంగా ప్రసారమవుతూనే ఉంది. KBC ద్వారా ఎంతో మంది తమ కలలను సాకారం చేసుకున్నారు.  ఇక 12వ సీజన్‌ కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా ప్లాన్ చేశారు. తాజాగా 14వ సీజన్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

  ఇప్పటి వరకు ఈ షోలో ప్రైజ్ మనీని రూ. 5 కోట్ల నుంచి రూ. 7.5 కోట్లకు పెంచారు. ఇక ఆజాదీగా అమృత్ మహోత్సవ్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో ఈ రియాలిటీ షోలో పలు మార్పులు చేసారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు. అమితాబ్.. తన ముందర ఉన్న సంతోష్ అనే కంటెస్ట్‌ను ఉద్దేశిస్తూ మీరు ఇప్పటి వరకు రూ. కోటి గెలుచుకున్నారు. నెక్ట్స్ రూ. 7.5 కోట్లు గెలుచుకోవడానికి తర్వాతి ప్రశ్నకు జవాడు చెప్పడానికి రెడీగా ఉన్నారా లేదా అని క్వశ్చన్ చేసారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్‌కు రకరకాల వ్యక్తులు.. నెక్ట్స్ క్వశ్చన్‌ను తెలియకపోతే.. ఊరుకో.. అవవసరంగా తెలియకుండా చెప్పావో.. రూ. 3,20,000 లకు పడిపోతావు అన్న మాటలు గుర్తుకు వస్తాయి.

  కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెబితే.. రూ. 7.5 కోట్లు గెలుచుకుంటావు. లేకపోతే.. 3 లక్షల 20 వేలు కాకుండా.. రూ. 75 లక్షలతో తిరిగి వెళతారు అంటూ చెబుతారు. ఆజాదీగా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో 75 సూచించేలా.. రూ. 7.5 కోట్ల క్వశ్చన్‌కు ఆన్చర్ తప్పు ఇచ్చినట్లైయితే.. 3 లక్షల 20 వేలు కాకుండా.. రూ. 75 లక్షలతో తిరిగి వెళ్లవచ్చని చెప్పారు.

  మిలినియమ్ ఇయర్ 2000లో ప్రారంభమైన ఈ గేమ్ షోలో ఇప్పటి వరకు 13 సీజన్లు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించారు. 2008లో మాత్రం షారుఖ్ ఖాన్ ఒక్క సీజన్‌కు మాత్రమే వ్యాఖ్యాతగా వ్యవహరించి మెప్పించలేకపోయారు. ఇక 13వ సీజన్‌లో సామాన్యలతో పాటు సెలబ్రిటీలు చాలా మంది ఈ షోలో రూ. కోటి రూపాయలు గెలుచుకున్నారు. మరి ఈ 14వ సీజన్‌లో ఎంత మంది కోటీశ్వరులు అవుతారో చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Amitabh bachchan, Bollywood news, KBC 14

  ఉత్తమ కథలు