భారతదేశంలో బాగా పాపులరైన టీవీ షోలలో (TV Show) ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (Kaun Banega Crorepati) మొదటి స్థానంలో ఉంటుంది. ఈ షోకి హోస్టుగా అమితాబ్ బచ్చన్ (Amitabh bachchan) వ్యవహరిస్తున్నారు. తన గాంభీర్యమైన గొంతుతో, చక్కని కమ్యూనికేషన్‌తో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. అయితే కొందరు ప్రజలు రూ.కోట్లు గెలుచుకోవడానికి ఈ కార్యక్రమానికి వస్తే.. మరికొందరు కేవలం అమితాబ్ బచ్చన్‌ను కలుసుకోవడానికే వస్తుంటారు. అలాంటి వారిలో రాజస్థాన్‌కు చెందిన దేశ్ బంధు పాండే (Deshbandhu Pandey) ఒకరు. వృత్తిరీత్యా రైల్వే అధికారి (Indian Railways) అయిన పాండే ఇటీవల ‘కేబీసీ 13’ సీజన్ లో పాల్గొని హాట్ సీటులో కూర్చునే అర్హత సాధించారు. పది ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి రూ.3,40,000 గెలుచుకుని ఇంటికి తీసుకెళ్లారు.
అయితే అమితాబ్ బచ్చన్‌ను కలుసుకుని తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నప్పటికీ.. పాండే సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఇంటికి చేరుకోగానే రైల్వే అడ్మినిస్ట్రేషన్ అతడికి ఛార్జిషీటు అందజేసింది. దాంతో ప్రస్తుతం చట్టపరమైన చర్యలతో సతమతమవుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. కేబీసీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోటాకు చెందిన దేశ్ బంధు పాండే ముంబయిలో ఆగస్టు 9 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు ఉన్నారు. అంతకు ముందే తాను సెలవులు తీసుకుంటున్నానని ఉన్నత అధికారులకు తెలియజేశారు. కానీ అతడి లీవ్ అప్లికేషన్‌ను వారు పరిగణలోకి తీసుకోలేదు. అయినా సెలవులు మంజూరు కాకుండానే పాండే కార్యక్రమంలో పాల్గొనేందుకు హాలిడేస్ తీసుకున్నారు. దీంతో రైల్వే శాఖ అతడిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే రైల్వే ఉద్యోగుల ఆర్గనైజేషన్లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
IPL 2021: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌కు దూరమైన ఆల్‌రౌండర్
ఇంతకీ పాండే సమాధానం చెప్పలేకపోయిన ఆ ప్రశ్న ఏంటంటే.. "ఈ దేశాలలో ఏ దేశం పూర్తిగా యూరప్‌లో ఉంది?" ఆప్షన్స్: రష్యా, టర్కీ, ఉక్రెయిన్, కజకిస్థాన్ గా ఇచ్చారు. ఈ ప్రశ్నకు పాండే రష్యా అని సమాధానం చెప్పారు. కానీ సరైన సమాధానం ఉక్రెయిన్. దీంతో పాండే ఎలిమినేట్ అయిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.