Kavitha Husband dies of Covid-19: సీనియర్ నటి కవిత ఇంట్లో మరో విషాదం.. కరోనాతో భర్త మృతి..

సీనియర్ నటి కవిత భర్త మృతి (Facebook/Photo)

Kavitha Husband dies of Covid-19 | ప్రముఖ నటి కవిత ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త దశరథ రాజు కోవిడ్‌తో పోరాడుతూ.. కాసేపటి క్రితమే కన్నుమూసారు.

  • Share this:
    Kavitha Husband dies of Covid-19 | ప్రముఖ నటి కవిత ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త దశరథ రాజు కోవిడ్‌తో పోరాడుతూ.. కాసేపటి క్రితమే కన్నుమూసారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా 15 రోజుల క్రితం ఆమె కుమారుడు స్వరూప్ కన్నుమూసిన ఘటన మరవక ముందే ఆమె భర్త కరోనాతో కన్నుమూయడం విషాదకరం. కవిత కుమారుడు జూన్ 15 కోవిడ్ -19 కారణంగా ప్రాణాలను కోల్పోయాడు. తాజాగా ఆమె  భర్త దశరథ రాజు కరోనాతో ప్రాణాలు ఒదిలారు. కవిత భర్త దశరథ రాజు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు.
    కవిత కెరీర్ విషయానికి వస్తే.. కవిత చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1976 లో, కవిత తమిళంలో ఓహ్ మంజు, తెలుగులో సిరి సిరి మువ్వతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టారు. కవిత కేవలం 11 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి విజయవంతంగా రాణించారు. అప్పటి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు, మోహన్ బాబు,మురళీ మోహన్, చంద్రమోహన్‌తో పాటు చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించారు.

    ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తల్లి, వదిన పాత్రల్లో నటించి మెప్పించారు. కవిత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడల భాషాల్లో కలిపి మొత్తంగా 350 కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆడ పాండవులు, చేతిలో చెయ్యేసి, మీనాక్షి, యుగళ గీతం వంటి చిత్రాలలో ఆమె సహాయక పాత్రల్లో నటించి పాపులర్ అయ్యారు. కవిత ప్రస్తుతం ఎండ్రాండ్రం పున్నగై అనే తమిళ టీవీ షోలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: