Kaushal Manda: నా భార్యపై అలా కామెంట్ చేశారు.. కన్నీళ్లు పెట్టిస్తున్న బిగ్ బాస్ కౌశల్ పోస్ట్..?

Kaushal Manda

Kaushal Manda: తెలుగు సినీ, టెలివిజన్ నటుడు కౌశల్. బాలనటుడిగా టెలివిజన్ లో అడుగుపెట్టి మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ తర్వాత పలు సీరియలో అవకాశాలు అందుకున్నాడు.

  • Share this:
    Kaushal Manda: తెలుగు సినీ, టెలివిజన్ నటుడు కౌశల్. బాలనటుడిగా టెలివిజన్ లో అడుగుపెట్టి మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ తర్వాత పలు సీరియలో అవకాశాలు అందుకున్నాడు. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 2 లో టైటిల్ విన్నర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని అభిమానులలో కౌశల్ ఆర్మీ గా నిలిచాడు. బుల్లితెరలో డాన్స్ బేబీ డాన్స్ షో కు హోస్టింగ్ గా చేశాడు.ఆ తర్వాత పలు సినిమాలలో హీరోల స్నేహితుడు గా, బావ బామ్మర్ది వంటి పాత్రలలో నటించాడు. ఇక బిగ్ బాస్ లో ఉన్నంతకాలం మంచి గుర్తింపు తెచ్చుకున్న కౌశల్ ఆ తర్వాత కొన్ని కాంట్రవర్సి లను కూడా ఎదుర్కొన్నాడు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ డబ్బులన్నీ వృథా చేస్తున్నట్లు తనపై ఆరోపణలు కూడా వచ్చాయి. అంతే కాకుండా ఆయన భార్య నీలిమ పై కూడా కొన్ని ఆరోపణలు ఎదురయ్యాయి. వీరిద్దరు కలిసి ఇలా చేస్తున్నారని బాగా పుకార్లు వచ్చాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటాడు కౌశల్.

    ఇక గతంలో నీలిమ కు సర్జరీ అవగా ఆ విషయం గురించి మీడియా ముందు చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు కౌశల్. ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేయగా అందులో తన భార్య తను కలిసి ఉన్న ఫొటోస్ వీడియో అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాకుండా అందులో తన భార్య గురించి కొన్ని ఎమోషన్ కామెంట్స్ చేశాడు కౌశల్.

    ఏదో సాధించేందుకు బయలుదేరింది అంటూ.. ఏదో ఒకటి చేసేందుకు తను తన జీవితంతో పోరాడుతుందని, తనకున్న ధైర్యంతో తను సాధిస్తుందంటూ.. తను త్వరగా కోలుకోవడానికి కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు కౌశల్. అంతేకాకుండా తనను తన కలల కోసం పోరాడమంటూ.. లవ్ యూ.. మిస్ యూ అని షేర్ చేయగా.. కౌశల్ అభిమానులు వదినకి ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published: