కౌశ‌ల్ ఆర్మీ క్రేజ్.. మాట‌ల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..!

రోజురోజుకీ కౌశల్ ఆర్మీ ర‌చ్చ పెరుగుతుందే కానీ త‌గ్గ‌డం లేదు. చూస్తుంటే ఆయ‌న్ని బిగ్‌బాస్ షో విన్న‌ర్ చేసే వ‌ర‌కు నిద్రపోయేలా లేరు. కౌశ‌ల్ ఆర్మీ సోష‌ల్ మీడియాలో కూడా నెంబ‌ర్‌వ‌న్ ట్రెండ్ అవుతుంది. తాజాగా ఈయ‌న పేరుతో 2కే వాక్ కూడా చేసారు అత‌డి అభిమానులు. ఇందులో అంతా చ‌దువుకున్న వాళ్లే పాల్గొన‌డం విశేషం.

news18-telugu
Updated: September 9, 2018, 11:20 AM IST
కౌశ‌ల్ ఆర్మీ క్రేజ్.. మాట‌ల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..!
కౌశల్ ఆర్మీ
  • Share this:
మూడు నెల‌ల ముందు అతడెవ‌రో తెలియ‌దు.. సీరియ‌ల్స్ చూసేవాళ్ల‌కు త‌ప్ప ఆయ‌న ఫేస్ సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు క‌నీసం గుర్తు కూడా లేడు. ఫోటో చూపిస్తే ఎవ‌రు ఈయ‌న అడిగే వాళ్ళే ఎక్కువ కానీ.. ఓహో ఈయ‌నా అని చెప్పేవాళ్లు లేరు. కానీ కాలం వేగంగా వెళ్లిపోయింది. ఒక్క రియాలిటి షో ఆయ‌న్ని సూప‌ర్ స్టార్ కాదు కాదు దానికంటే ఎక్కువే చేసింది. అస‌లేం చూసి ప‌డిపోతున్నారో తెలియ‌దు కానీ ఇప్పుడు ఆయ‌న పేరు వింటే సోష‌ల్ మీడియా షేక్ అయిపోతుంది.. ఏకంగా ఆయ‌న పేరుతో ఓ ఆర్మీ పుట్టుకొచ్చింది. అత‌డే వ‌న్ అండ్ ఓన్లీ కౌశ‌ల్.

kaushal army
కౌశల్ ఆర్మీ


సాధార‌ణ బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు ఇంత‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ రావ‌డం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ను కూడా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. బాబు గోగినేని ఉన్న‌పుడు ఆయ‌న్ని బిగ్గ‌ర్ బాస్ అన్నారు కానీ ఆ బిగ్‌బాస్‌ను కూడా డామినేట్ చేసే స్థాయికి వెళ్లిపోతున్నాడు కౌశ‌ల్. ఈయ‌న పేరుతో ఆర్మి పుట్టింది.. ఇప్పుడు కానీ కౌశ‌ల్‌ను ఎలిమినేట్ చేస్తే వాళ్లు బిగ్‌బాస్‌షోను ఆపేయాల‌ని ధ‌ర్మాలు చేసినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. రోజురోజుకీ ఈ ర‌చ్చ పెరుగుతుందే కానీ త‌గ్గ‌డం లేదు. చూస్తుంటే ఆయ‌న్ని బిగ్‌బాస్ షో విన్న‌ర్ చేసే వ‌ర‌కు నిద్రపోయేలా లేరు. కౌశ‌ల్ ఆర్మీ సోష‌ల్ మీడియాలో కూడా నెంబ‌ర్‌వ‌న్ ట్రెండ్ అవుతుంది.
కౌశల్ ఆర్మీ
కౌశల్ ఆర్మీ పేరుతో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

తాజాగా ఈయ‌న పేరుతో 2కే వాక్ కూడా చేసారు అత‌డి అభిమానులు. ఇందులో అంతా చ‌దువుకున్న వాళ్లే పాల్గొన‌డం విశేషం. హైద‌రాబాద్ మాదాపూర్‌లో ఈ 2కే ర‌న్ నిర్వ‌హించారు. ఏదో 100 మంది వ‌స్తే ఎక్కువ అనుకున్నారు కానీ ఏకంగా 1000 మంది కంటే ఎక్కువే వచ్చేస‌రికి అంద‌రికీ కౌశ‌ల్ క్రేజ్ చూసి మ‌బ్బులు విడిపోతున్నాయి. అస‌లు ఈయ‌నేంటి.. ఈయ‌నకు ఇంత క్రేజ్ ఏంటి అనుకుంటున్నారు. దానికి తోడు సినిమా వాళ్లు కూడా అంతా ఆయ‌న‌కే స‌పోర్ట్ చేస్తున్నారు.

kaushal army
కౌశల్ ఆర్మీ

కోన‌వెంక‌ట్, కాజ‌ల్, సంప‌త్‌నంది లాంటి వాళ్లు కౌశ‌ల్‌కే స‌పోర్ట్ చేస్తున్నారు. ఈ కౌశ‌ల్ ఆర్మీ పిచ్చి అనుకోవ‌చ్చు కానీ దీనిపై మంచి ప‌నులు కూడా చేస్తున్నారు. మొన్న‌టికి మొన్న కేర‌ళ వ‌ర‌ద‌ల‌కు సాయం చేసారు.. ఇప్పుడు పేదోళ్ల‌కు స‌రుకులు పంచారు.. 2కే ర‌న్ పేరుతో చాలా మంచి ప‌నులు చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు కౌశ‌ల్ తీరు చూస్తుంటే ఆయ‌న్ని బిగ్‌బాస్ విన్న‌ర్ కావ‌డం లాంఛ‌న‌మే అయ్యేలా ఉంది. అది తేడా జ‌రిగితే జ‌రిగే ఘోరాలు ఊహ‌ల‌కు కూడా అంద‌వేమో మ‌రి..?
Published by: Praveen Kumar Vadla
First published: September 9, 2018, 10:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading