అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్‌గా హిందీలో ప్రసారం అవుతోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి (Kaun Banega Crorepati) దేశ వ్యాప్తంగా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోకు లక్షల్లో అభిమానులున్నారు. ప్రస్తుతం 13వ సీజన్ (KBC 13's 1st crorepati) నడుస్తోంది. ఈ షోలో తాజాగా హిమానీ బుందేలా ( Himani Bundela)అనే యువతి పాల్గోని కోటీ రూపాయలు గెలిచింది . ఆగ్రాకు చెందిన హిమానీ బుందేలా కౌన్ బనేగా కరోడ్‌పతిలో ఈ సీజన్లో పాల్గోని కరోడ్ పతి అయిన మొదటి వ్యక్తి. అంతేకాదు 25 ఏళ్ల బుందేలా దృష్టి లోపంతో పోరాడుతూనే ఈ పోటీలో కోటీ రూపాయలు గెలిచి నిలిచింది. దీంతో ప్రస్తుతం ఆమె గురించి ఆమె కోటీ రూపాయలు గెలిచిన ఆ ప్రశ్న గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. బుందేలా మునుపటి ఎపిసోడ్లో రూ .50 లక్షలు గెలుచుకున్నారు. ఆమె గత రాత్రి ఎపిసోడ్లో రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా కొనసాగుతూ కోటి రూపాయల ప్రశ్నతో ప్రారంభించారు. హిమానీ బుందేలా రూ .1 కోటి గెలుచుకోవడానికి అమితాబ్ అడిగిన ప్రశ్న ఏమంటే.. బ్రిటిష్ గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన తన మారుపేరు ఏంటీ.. ఈ ప్రశ్నకు బుందేలా చాలా ఆలోచించిన తరువాత బిగ్ బికి తన సమాధానాన్ని లాక్ చేయమని చెప్పింది.
1 కోటి ప్రశ్న ఇక్కడ : రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్‌లో బ్రిటన్ గూఢచారిగా పనిచేయడానికి నూర్ ఇనాయత్ ఖాన్ (Noor Inayat Khan ) ఉపయోగించిన మారుపేరు ఏది?
నాలుగు ఆప్షన్స్: వెరా అట్కిన్స్, క్రిస్టినా స్కార్బెక్, జూలియన్ ఐస్నర్, జీన్-మేరీ రెనియర్స్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం.. జీన్-మేరీ రెనియర్స్. హిమానీ ఆ ప్రశ్నకు సరైన సమాదానం చెప్పి కోటి రూపాయలు గెలుచుకుంది.
ఇక ఆతర్వాత జాక్‌పాట్ ప్రశ్న.. ఈ ప్రశ్నకు సమాదానం చెబితే ఏడు కోట్లు గెలవచ్చు. హిమాని బుందేలాను అమితాబ్.. బిఆర్ అంబేద్కర్ (BR Ambedkar)కు సంబంధించిన ప్రశ్న అడిగారు. రూ .7 కోట్ల ప్రశ్న విన్న తర్వాత, ఆమె కొంచెం గందరగోళానికి గురైంది. దీంతో ఆ షో నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకుంది.
జాక్ పాట్ ప్రశ్నకు సమాదానం ఇవ్వకుండా తప్పుకున్నందుకు ఆమె.. కోటీ రూపాయలతో పాటు ఒక కారు కూడా బహుమతిగా వచ్చింది.
ఇక జాక్ పాట్ ప్రశ్న విషయానికి వస్తే.. 1923 లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు సమర్పించిన థీసిస్ శీర్షిక ఏమిటి?
నాలుగు ఆప్షన్స్ : ది వాంట్ అండ్ మీన్స్ ఆఫ్ ఇండియా, ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపాయి, నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా, లా అండ్ లాయర్స్. సరైన సమాధానం: ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపాయి. అయితే హిమానీని సమాధానాలలో ఏదైనా ఒకదానిని ఊహించమని అడిగినప్పుడు, ఆమె నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియాను ఎంచుకుంది. అది తప్పు సమాదానం. ఏది ఏమైనా చూపులేని ఓ మహిళ ఈ సీజన్లో మొదటిసారిగా కోటీ రూపాయలు గెలుచుకుని ఆదర్శంగా నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Tollywood news