రజినీకాంత్, కమల్ హాసన్‌కు కట్టప్ప వెన్నుపోటు..

బాహుబలి మొదటి పార్ట్ చూసిన వారికి కట్టప్ప..బాహుబలిని ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అనే డౌట్స్ ఉండే. ఈ సినిమాతో ఓవర్ నైట్ బాహుబలిగా నటించిన ప్రభాస్‌కు ఎంత పేరొచ్చిందో అందులో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్‌కు అంతకంటే ఎక్కువ పేరొచ్చింది. తాాజాగా ఈ కట్టప్ప  పాత్రధారి నిజ జీవితంలో తన రజినీకాంత్, కమల్ హాసన్‌లకు వెన్నుపోటు పొడిచాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: June 11, 2019, 12:06 PM IST
రజినీకాంత్, కమల్ హాసన్‌కు కట్టప్ప వెన్నుపోటు..
రజినీకాంత్, కమల్ హాసన్‌కు సత్యరాజ్ వెన్నుపోటు
news18-telugu
Updated: June 11, 2019, 12:06 PM IST
బాహుబలి మొదటి పార్ట్ చూసిన వారికి కట్టప్ప..బాహుబలిని ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అనే డౌట్స్ ఉండే. ఈ సినిమాతో ఓవర్ నైట్ బాహుబలిగా నటించిన ప్రభాస్‌కు ఎంత పేరొచ్చిందో అందులో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్‌కు అంతకంటే ఎక్కువ పేరొచ్చింది. తాాజాగా ఈ కట్టప్ప  పాత్రధారి నిజ జీవితంలో తన రజినీకాంత్, కమల్ హాసన్‌లకు వెన్నుపోటు పొడిచాడు. వివరాల్లోకి వెళితే..దక్షిణాదిలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా తమిళనాడులో వీటిని వేరు చూసి చూడలేం. దివంగత జయలలిత  అన్నాడీఎంకే పార్టీతో పాటు విపక్ష కరణానిధికి చెందిన డీఎంకే  పార్టీ కూడా సినిమాలతో విడదీయరాని అనుబంధం ఉంది. జయలలిత హీరోయిన్‌గా రాణిస్తే..కరుణానిధి రైటర్‌గా తమిళ సినిమాల్లో సత్తా చూపెట్టిన సంగతి తెలిసిందే కదా. వీళ్ల బాటలోనే విజయ్ కాంత్ సొంతపార్టీ పెట్టి అపోసోపాలు పడుతున్నారు. మరోవైపు కమల్ హాసన్.. ‘మక్కల్ నీది మయ్యం’ అనే కొత్త పార్టీ స్థాపించాడు. మరోవైపు రజినీకాంత్ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల లోపు కొత్త పార్టీ ప్రకటించి ఎన్నికల బరిలో దిగుతానని  చెప్పిన సంగతి తెలిసిందే కదా.

kattappa fame Satyaraj sensational comments on tamil super stars rajinikanth, kamal haasan,kattappa,Sathyaraj,kattappa sathyaraj,satyyaraj sensational comments on rajinikanth kamal haasan,sathyaraj rajinikanth kamal haasan,sathyaraj twitter,sathyaraj instagram,sathyaraj facebook,rajinikanth twitter,rajinikanth instagram,kamal haasan twitter,kamal haasan instagram,rajini kanth kamal haasan politics,dmk stalin,kollywood,tollywood,కట్టప్ప,కట్టప్ప సత్యరాజ్,సత్యరాజ్ కామెంట్స్ రజినీకాంత్ కమల్ హాసన్,రజినీకాంత్ కమల్ హాసన్ లపై సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు,సత్యరాజ్,రజినీకాంత్,కమల్ హాసన్,రాజకీయాల్లో కమల్ హాసన్ రజినీకాంత్,కోలీవుడ్ న్యూస్,తమిళనాడు రాజకీయాలు,డీఎంకే స్టాలిన్,
కమల్ హాసన్, రజినీకాంత్ (ఫైల్ ఫోటోస్)


ఈ  లోక్‌సభ ఎన్నికల్లో కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. మరోవైపు రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దగ్గజ నటులు.. తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది అందుకే రాజకీయాల్లో వచ్చాము అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే కదా. దీనిపై తాజాగా నటుడు సత్యరాజ్ స్పందించాడు. రాజకీయాల్లో వచ్చిన కమల్ హాసన్‌తో పాటు రావాలని ఫిక్స్ అయిన రజినీకాంత్‌ వల్ల తమిళనాడు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. ఎపుడే భూమిలో పాతుకుపోయిన డీఎంకే లాంటి పార్టీని పెకిలాంచాని అనుకోవడం మూర్ఖత్వమేనని అన్నారు.అందుకే లోక్‌సభ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు ప్రజలు పట్టం కట్టారన్నారు. రాజకీయాలు చేయడానికి చాలా మందే ఉన్నారన్నారు. సినిమా  నటులు నటనపై ద‌ృష్టి పెట్టాలని రాజకీయాల్లో వేలు పెట్టకూడదని ఇన్‌డైరెక్ట్‌గా రజినీకాంత్,కమల్ హాసన్‌‌లకు క్లాస్ పీకారు. ఇపుడీ మ్యాటర్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

First published: June 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...