బాలయ్య భామకు అంత కష్టమొచ్చిందా.. గిన్నెలు తోముతున్న కత్రినా..

కత్రినా కైఫ్ ఈ పేరును తెలుగు వారికి మరోసారి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు.

news18-telugu
Updated: March 24, 2020, 3:00 PM IST
బాలయ్య భామకు అంత కష్టమొచ్చిందా.. గిన్నెలు తోముతున్న కత్రినా..
అల్లరి పిడుగులో బాలయ్య, కత్రినా కైఫ్ Photo : Twitter
  • Share this:
కత్రినా కైఫ్ ఈ పేరును తెలుగు వారికి మరోసారి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. కత్రీనా హిందీ హీరోయిన్ అయినా.. తెలుగులో రెండు సినిమాలు చేసింది. ఈ భామ మొదటసారిగా విక్టరీ వెంకటేష్ సరసన 'మల్లీశ్వరీ' సినిమాలో నటించింది. ఆ సినిమాలో నటనతో పరవాలేదనిపించినా.. అందచందాలతో అదరగొట్టింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భాగానే అలరించింది. దీంతో ఆ తర్వాత బాలయ్య సరసన 'అల్లరి పిడుగు'లో నటించింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక అప్పటినుండి తెలుగులో ఈ భామకు అవకాశాలు రాలేదు. అయితే హిందీలో మాత్రం అమ్మడు ఇరగదీస్తోంది. ఈ భామ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తోన్న సూర్యవంశీలో కీలకపాత్ర చేస్తోంది. అది అలా ఉంటే దేశవ్యాప్తంగా కరోనా ధాటికి అన్ని రంగాలు మూతపడ్డాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ షూటింగ్స్ అన్ని ఆపేసింది. దీంతో హీరోలు, హీరోయిన్స్ ఇంట్లో ఖాలీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ కాలం గడుపుతున్నారు. అందులో భాగంగా అందాల భామ కత్రినా కూడా తాను తిన్న గిన్నెలు తోముతూ దానికి సంబందించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.


View this post on Instagram

🍽 +🧽=🙂🏠 really makes u appreciate all the help we have at home #socialdistancing #staysafe #helpoutathome


A post shared by Katrina Kaif (@katrinakaif) on
Published by: Suresh Rachamalla
First published: March 24, 2020, 3:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading