కత్రినా కైఫ్‌ను పోలిన యువతి.. చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే..

మనుషులను పోలిని మనుషులు ఏడుగురు ఉంటారంటారు మన పెద్దలు. కానీ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ను పోలిన నటి జరీన్ ఖాన్ ఉందన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా జరీన్ ఖాన్ కాకుండా అచ్చు కత్రినా పోలికలతో ఉన్న ఒకామె సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

news18-telugu
Updated: September 19, 2019, 11:19 AM IST
కత్రినా కైఫ్‌ను పోలిన యువతి.. చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే..
కత్రినా కైఫ్‌ను పోలిని యువతి (News18/English)
  • Share this:
మనుషులను పోలిని మనుషులు ఏడుగురు ఉంటారంటారు మన పెద్దలు. కానీ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ను పోలిన నటి జరీన్ ఖాన్ ఉందన్న సంగతి తెలిసిందే కదా. కత్రినాతో గొడవ కారణంగా అప్పట్లో సల్మాన్ ఖాన్.. తన ‘వీర్’ సినిమా కోసం కత్రినా పోలికలు ఉన్న జరీన్ ఖాన్ వెతికి మరి పట్టుకొచ్చాడు. తాజాగా జరీన్ ఖాన్ కాకుండా అచ్చు కత్రినా పోలికలతో ఉన్న ఒకామె సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. జరీన్ ఖాన్ అన్న కత్రినాకు చాలా పోలికల్లో తేడా ఉన్నాయి. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం అచ్చుగుద్దినట్టు కత్రినాలా ఉంది. తాజాగా హీరోయిన్ కత్రినా కైఫ్‌ను పోలిన ఈ యువతి టిక్‌టాక్‌లో సందడి చేస్తోంది. కత్రినాకు జిరాక్స్ కాపీలా ఉన్న ఈమెపేరు ఎలిన్ రాయ్. ఈమె టిక్‌టాక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలను వీడియోలను షేర్ చూస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

కత్రినా కైఫ్‌ను పోలిన ఎలినా రాయ్ (News18/English)


ఈ ఫోటోలను చూసిన చాలా మంతి నెటిజన్లు ఎవరు కత్రినానో ఎవరు ఎలిన్ రాయ్ అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారు.

 

First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>