సురయ్యగా అదరగొడుతున్న కత్రినా

‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ ఈ యేడాది బాలీవుడ్‌లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో ఒకటి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తోన్న ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాలో కత్రినా కైఫ్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

news18-telugu
Updated: September 21, 2018, 11:32 AM IST
సురయ్యగా అదరగొడుతున్న కత్రినా
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ మూవీలో కత్రినా లుక్(ట్విట్టర్ ఫోటో)
  • Share this:
‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ ఈ యేడాది బాలీవుడ్‌లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో ఒకటి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తోన్న ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాలో కత్రినా కైఫ్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ మూవీలో కత్రినా కైఫ్ ..సురయ్యా అనే పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో కత్రినాది డాన్సర్ తరహా పాత్ర అనే విషయం ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఖుదాబక్ష్‌గా అమితాబ్ బచ్చన్ లుక్‌కు...ఫాతిమా సనా షేక్ పోషిస్తోన్న ‘జఫీరా’ అనే పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్స్‌కు సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్‌ ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తోన్న ఈ మూవీపై బీటౌన్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో ఇతర ముఖ్యపాత్రల్లో కత్రినా కైఫ్, జాకీష్రాఫ్‌ నటిస్తున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్  చేస్తోన్న ఈ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీని దీపావళి కానుకగా నవంబర్ 8న రిలీజ్ చేయనున్నారు.ఇది కూడా చదవండి 

సిగ‌రెట్ ఇవ్వండి బ్ర‌ద‌ర్.. ఎన్టీఆర్‌తో ఏఎన్నార్..

ఆర్మీ ఆఫీసర్ పాత్రలో వెంకటేశ్

First published: September 21, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు