news18-telugu
Updated: October 23, 2019, 9:33 AM IST
కత్రినా కైఫ్,నయనతార (Instagram/Photo)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు కత్రినా కైఫ్‌కు సౌతిండియా లేడీ సూపర్ స్టార్ ప్రచారం చేయడం ఏమిటి అనుకుంటున్నారా. బాలీవుడ్‌లో హీరోయిన్‌గ సత్తా చూపిస్తున్న కత్రినా కైఫ్.. తాజాగా ‘కే బై కత్రినా’ అనే సౌందర్య ఉత్పత్తుల రంగంంలో అడుగుపెట్టారు.ఈ ప్రొడక్ట్స్‌కు నయనతార ప్రచారం చేస్తోంది. అంతేకాదు దీనిక సంబంధించిన క్లిప్‌ను కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూ... సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ నా బ్రాండ్ ప్రమోషన్స్‌కు అండగా ముంబై వచ్చిన నయనతారకు ధన్యవాదాలు తెలిపుతూ ఒక మెసేజ్ చేసింది. తాజాగా కత్రినా కైఫ్.. అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సూర్య వంశీ’ సినిమాలో యాక్ట్ చేస్తోంది. మరోవైపునయనతార చిరంజీవితో చేసిన ‘సైరా నరసింహారెడ్డి’చేసింది. తాజాగా ఈ భామ విజయ్ హీరోగా నటించిన ‘విజిల్’ సినిమా త్వరలో విడుదల కానుంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 23, 2019, 9:33 AM IST