మహేష్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ భామ

కత్రినా కైఫ్ తెలుగులో దాదాపు 13 ఏళ్ల క్రితం వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాలో అలరించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆమె చివరిసారిగా బాలకృష్ట 'అల్లరి పిడుగు'లో చేసింది. ఈ సినిమా తర్వాత కత్రినా తెలుగులో ఏ సినిమాను ఒప్పుకోలేదు. అయితే కత్రినా తాజాగా తెలుగులో మహేష్ హీరోగా చేస్తున్న ఓ క్రేజీ ప్రాజేక్ట్‌‌లో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

news18-telugu
Updated: January 4, 2019, 12:58 AM IST
మహేష్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ భామ
Mahesh and Katrina
  • Share this:
కత్రినా కైఫ్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటించేట్టు కనపడుతోంది. అదీ...తెలుగు సూపర్ స్టార్ మహేష్ పక్కన నటించనున్నట్లు తెలుస్తోంది. కత్రినా... తెలుగులో దాదాపు 13 ఏళ్ల క్రితం వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాలో అలరించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆమె చివరిసారిగా బాలకృష్ట 'అల్లరి పిడుగు'లో చేసింది. ఈ సినిమా తర్వాత కత్రినా తెలుగులో ఏ సినిమాను ఒప్పుకోలేదు. అయితే బాహుబలి సినిమాకి వచ్చిన క్రే‌జ‌్‌తో తెలుగు సినిమాలకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.

దీంతో బాలీవుడ్ భామలు తెలుగులో ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ నటించడానికి ఇష్ట పడుతున్నారు. అందులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వాని వరుసగా తెలుగులో సినిమాలు చేస్తోంది. మరో బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ కూడా ప్రబాస్ సరసన 'సాహో' సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కత్రినా మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న.. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చేస్తోంది తెలిసిందే. ఈ సినిమా తర్వాత సుకుమార్ సినిమా ఉంటుంది. దీన్నిమైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతోంది.

మహేష్‌తో  సుకుమార్ ఇంతకు ముందు "నేనొక్కడినే" సినిమా చేసిన విషయం తెలిసిందే.. అయితే సుకుమార్ ఆ సినిమా విజయంతో సంతృప్తిగా లేడు. దీంతో ఈసారి మహేష్‌కు ఏలాగైనా మంచి హిట్ ఇవ్వాలనీ కసిగా ఉన్నాడు. చూడాలి మరీ ఏమాత్రం హిట్ కొడతాడో..

పైసావసూల్ బ్యూటీ ముస్కాన్ సేథీ హాట్ ఫోటోషూట్

Published by: Suresh Rachamalla
First published: January 4, 2019, 12:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading