Katrina Kaif : ఖైదీకి తోడుగా కత్రీనా.. హిందీ రీమేక్‌లో హీరోయిన్ పాత్ర..

Katrina Kaif : కత్రినా కైఫ్ వెంకటేష్ సరసన 'మల్లీశ్వరీ' సినిమాలో నటించి తెలుగుతెరకు పరిచయమైంది.

news18-telugu
Updated: August 17, 2020, 9:43 AM IST
Katrina Kaif : ఖైదీకి తోడుగా కత్రీనా.. హిందీ రీమేక్‌లో హీరోయిన్ పాత్ర..
కత్రినా కైఫ్ Photo : Twitter
  • Share this:
కత్రినా కైఫ్ వెంకటేష్ సరసన 'మల్లీశ్వరీ' సినిమాలో నటించి తెలుగుతెరకు పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భాగానే అలరించిన.. ఆ తర్వాత బాలయ్య సరసన నటించిన 'అల్లరి పిడుగు' బోల్తాకొట్టింది. దీంతో తెలుగులో మరే సినిమాలో నటించలేదు కత్రీనా. బాలీవుడ్‌లో మాత్రం అమ్మడు ఇరగదీస్తోంది. అయితే ఈ మధ్య ఈ భామ నటించిన.. సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేక పోతున్నాయి. అయినా.., అమ్ముడు అందానికి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అది అలా ఉంటే గత ఏడాది కార్తి హీరోగా విడుదలైన తమిళ చిత్రం 'ఖైదీ'. ఈ సినిమాను ఇదే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదలచేయగా.. ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఇటు తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా మంచి విజయాన్ని సాధించింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు, దానికి తోడు మంచి తండ్రి కూతురు సెంటిమెంట్.. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే రీతిలో కథ కథనాలు సినిమాకు మంచి విజయాన్ని అందించాయి. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకుడు.

katrina kaif,katrina kaif songs,katrina kaif movies,katrina kaif age,katrina kaif fb,katrina kaif facebook,katrina kaif insta,katrina kaif instagramkatrina kaif twitter,katrina kaif interview,salman khan katrina kaif,katrina kaif news,katrina,salman katrina,వెంకటేష్ మల్లీశ్వరీ,కత్రీనా కైఫ్ హాట్,కత్రీనా కైఫ్ హాట్ ఫోటోస్
లోకేష్ కనకరాజ్, అజయ్ దేవ్ గన్ Photo : Twitter


ఆయన ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ విజయ్’తో మాస్టర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైన కరోనా కారణంగా విడుదలకు నోచుకోలేదు. అది అలా ఉంటే ఖైదీ సినిమాను ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారు. అజయ్ దేవగణ్‌ హీరోగా నటించనున్నాడు. కాగా ఒరిజనల్ తమిళ 'ఖైదీ'లో హీరోయిన్ రోల్ ఉండదు. అంతేకాదు అసలు ఆమె పాత్రనే తెరపై చూపించరు. కానీ హిందీలో కొన్ని మార్పులతో పాటు చేర్పులు చేయబోతున్నారు. అందులో భాగంగా హిందీ ఖైదీలో హీరోయిన్ పాత్రను యాడ్ చేస్తున్నారట. అయితే ఆ పాత్ర కోసం అందాల తార కత్రినా కైఫ్‌ను తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ హిందీ ఖైదీని కూడా లోకేష్ కనకరాజే దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. అన్ని కుదిరితే.. ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో  మొదలుకానుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనుంది చిత్రబృందం.
Published by: Suresh Rachamalla
First published: August 17, 2020, 9:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading