ప్రధాని మోదీతో డిన్నర్ చేయాలనేది తన కోరికంటున్న సల్మాన్ భామ కత్రినా..
ప్రధాని మోదీతో డిన్నర్ చేయాలనేది తన కోరికంటున్న సల్మాన్ భామ కత్రినా..
పీఎం నరేంద్ర మోదీ,కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్
సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో భారత ప్రధాన మంత్రిగా మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే కదా. దీంతో ప్రధాని మోదీకి రోజు రోజుకు అభిమానులు పెరిగిపోతున్నారు. తాజాగా ఈ లిస్టులో కత్రినా కైఫ్ కూడా చేరింది.
సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో భారత ప్రధాన మంత్రిగా మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే కదా. దీంతో ప్రధాని మోదీకి రోజు రోజుకు అభిమానులు పెరిగిపోతున్నారు. తాజాగా ఈ లిస్టులో కత్రినా కైఫ్ కూడా చేరింది. తాజాగా ‘భారత్’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ఇంతకీ ఆ విలేఖరి ఏమడిగాడంటే.. మీరు బ్రతకి ఉణ్న లేక చనిపోయిన వారిలో ఎవరితో డిన్నర్ చేయాలనుకుంటున్నారని అడిగారు. దాని కత్రినా.. మార్లిన్ మన్రో, నరేంద్ర మోదీ, కండోలిజా రైస్ అని సమాధానమిచ్చింది.
రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ (ఫైల్)
ఈ లిస్టు నేను లేనా అంటూ సల్మాన్ కల్పించుకుని అడిగాడు. దానికి కత్రినా మాట్లాడుతూ మేమిద్దరం ఎన్నో సినిమాల్లో కలిసి నటించినా ఇప్పటి వరకు కలిసి డిన్నర్ చేయలేదని సమాధానమిచ్చింది. దానికి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ... కత్రినా డిన్నర్ సాయంత్రం ఆరున్నరకే అయిపోతుంది. అపుడు నేను లంచ్ చేస్తాను అన్ని కొంచెం ఫన్నీగా అన్నాడు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ.. నేను లంచ్ అయిన డిన్నర్ అయిన తన ఫ్యామిలీ మెంబర్స్‌తోనే కలిసి చేస్తానని మీడియాకు తెలియజేసాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.