HOME »NEWS »MOVIE »katrina kaif sister isabella kaif on the way she chemistry rocks with that hero ta gh

Katrina Kaif Sister: అక్క కత్రినా బాటలో చెల్లెలు ఇసబెల్లా కైఫ్ .. ఆ హీరోతో కత్రినా సిస్టర్ కెమిస్ట్రీ మాములుగా లేదుగా..

Katrina Kaif Sister: అక్క కత్రినా బాటలో చెల్లెలు ఇసబెల్లా కైఫ్ .. ఆ హీరోతో కత్రినా సిస్టర్ కెమిస్ట్రీ మాములుగా లేదుగా..
కత్రినా కైఫ్, ఇసబెల్లె కైఫ్ (Instagram/Photo)

Katrina Kaif Sister: కత్తి లాంటి కత్రిన కైఫ్ (Katrina Kaif) కు యూత్‌‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.   ఈమె చెల్లెలు ఇసబెల్లీ కైఫ్ (Isabelle Kaif) కూడా బాలీవుడ్‌లో లక్ పరీక్షించుకుంటోంది. 

  • Share this:
Katrina Kaif Sister: కత్తి లాంటి కత్రిన కైఫ్ (Katrina Kaif) కు యూత్‌‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.   ఈమె చెల్లెలు ఇసబెల్లీ కైఫ్ (Isabelle Kaif) కూడా బాలీవుడ్‌లో లక్ పరీక్షించుకుంటోంది.  అక్క కత్రినా కైఫ్ బాటలోనే  సోషల్ మీడియాలో ఇసబెల్లీకి రోజు రోజుకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు. కత్రినా కైఫ్ కూడా ఎపుడు తన చెల్లెలు ఫోటోలను షేర్ చేస్తూ, క్యాట్ ఫ్యాన్స్ కు ఇసబెల్లీ చాలా ఫెమిలియర్ పర్సనాలిటీగా మారారు. ఇప్పటికే వరుస సిజ్లింగ్, హాట్ ఫొటో షూట్లతో ఇసబెల్లీ తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. కేవలం స్టార్ సిస్టర్ గా కాకుండా యాక్టింగ్, డ్యాన్సింగ్ తో పాటు డెరెక్షన్ డిపార్ట్మెంట్ లోనూ అనుభవం సంపాదించాక బాలీవుడ్ (Bollywood) లో తెరంగేట్రం చేసేందుకు ఈమె రెడీ అయ్యారు.

"సుస్వాగతం ఖుషామదీద్" (Suswagatam Khushaamaded) పేరుతో వస్తున్న ఈ మూవీలో పుల్కిత్ సమ్రాట్ (Pulkit Samrat) తో ఇసబెల్లీ రొమాన్స్ చేయనున్నారు. ఇసబెల్లీ గురించి గొప్పగా మాట్లాడిన హీరో పుల్కిత్ .."మా ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఢమాకా" అని చెబుతోంది.  సోషల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో ఇసబెల్లీ ఆగ్రాకు చెందిన "నూర్" అనే అమ్మాయి పాత్రలో కనిపించనుంది.


View this post on Instagram

A post shared by Isabelle Kaif (@isakaif)సూరజ్ పాంచోలీ, ఆయుష్మాన్ శర్మా వంటి అప్ కమింగ్ హీరోలు, స్టార్ కిడ్స్ తో కలిసి నటిస్తున్న ఈమె.. బిజీ స్టార్ సిస్టర్ గా మారారు. ప్రస్తుతం చేతిలో మరో క్రేజీ ప్రాజెక్టులతో  ఇసబెల్లీ బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో ఎంతోమందికి గాడ్ ఫాదర్ గా నిలిచిన సల్మాన్ ఖాన్ (Salman Khan) ఆశీస్సులతో ఇసబెల్లీ తన బాలీవుడ్ కెరీర్‌లో దూసుకుపోతున్నట్టు బీ టౌన్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. స్టార్ సిస్టర్ గా ఈమెపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కెనడియన్ ప్రొడక్షనల్ వెంచర్ "డాక్టర్ క్యాబి"లో ఇసబెల్లీ నటించారు కూడా.
View this post on Instagram


A post shared by Isabelle Kaif (@isakaif)

ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే 14 ఏళ్లకే మోడల్ గా మారి, న్యూయార్క్ లో యాక్టింగ్ కోర్సు కూడా పూర్తి చేసిన యంగ్ గన్ గా చెప్పాల్సిందే. "కమింగ్ హోమ్" అనే షార్ట్ ఫిలింలో అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ రాణే సరసన ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకున్న ఇసబెల్లీ డ్యాన్స్ లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా ఈమె 2014లో పనిచేశారు. లండన్ బేస్డ్ మోడల్ అయిన ఈమెకు థియేటర్ అంటే అత్యంత ఇష్టం, ఈ ఇష్టంతోనే ప్రొడక్షన్ కంపెనీని కూడా నిర్వహిస్తున్నారు. ఇక తల్లిదండ్రుల విషయానికి వస్తే కశ్మీరీ బిజినెస్ మ్యాన్ మహమ్మద్ కైఫ్ కు బ్రిటీష్ తల్లి సుసానా టార్కోట్ కు జన్మించిన సంతానమే కత్రీనా, ఇసబెల్లీలు. వీరు మొత్తం ఆరుగురు అక్కచెల్లెళ్లు కాగా, ఒక సోదరుడు కూడా కత్రీనాకు ఉన్నారు."బాలీవుడ్ భాయీజాన్" సల్మాన్ ఖాన్ కు రాఖీ సిస్టర్ గా పేరుగాంచిన జర్నలిస్ట్ శ్వేతా రోహిరా భర్తనే ఈ పుల్కిత్ సమ్రాట్ కాగా, కత్రీనా కొన్నేళ్లపాటు సల్మాన్ ప్రేమలో మునిగి తేలిందనే విషయం ఓపన్ సీక్రెట్.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 21, 2021, 19:14 IST