కత్రినా కైఫ్ పెళ్లిపై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు.. పిల్లలు కూడా..
సల్మాన్ ఖాన్, కత్రినా మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్రపుటల్లో భద్రంగా ఒదిగిపోయిన వీర ప్రేమగాథ ఈ ఇద్దరిది. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ పాటికి కత్రినా కైఫ్ కాస్తా కత్రినా ఖాన్ అయ్యుండేది.

భారత్ మూవీ షూటింగ్ కంప్లీట్
- News18 Telugu
- Last Updated: May 28, 2019, 2:53 PM IST
సల్మాన్ ఖాన్, కత్రినా మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్రపుటల్లో భద్రంగా ఒదిగిపోయిన వీర ప్రేమగాథ ఈ ఇద్దరిది. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ పాటికి కత్రినా కైఫ్ కాస్తా కత్రినా ఖాన్ అయ్యుండేది. కానీ పరిస్థితులు పగ పట్టడంతో విడిపోయారు. కానీ ఈ మధ్యే మళ్లీ కలిసిపోయినట్లుగా కనిపిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ నుంచి కత్రినా విడిపోయిన తర్వాత మళ్లీ పాత ప్రేమికుడికి క్లోజ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి ఇప్పుడు భారత్ సినిమాలో నటిస్తున్నారు.

జూన్ 5న ఈద్ సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు ఈ జంట. ఇందులో భాగంగానే సల్మాన్ ఖాన్‌కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. కత్రినాకు యాక్టింగ్ కాకుండా మరో ప్రొఫెషన్ ఒకటి సజెస్ట్ చేయండి అంటూ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చాడు సల్మాన్ ఖాన్. కత్రినా పెళ్లి చేసుకోవాలి.. పిల్లల్ని కనాలి.. ఇదే ప్రొఫెషన్ అయితే బాగుంటుందంటూ సల్మాన్ చెప్పిన సమాధానానికి అంతా ఫిదా అయిపోయారు.
సల్మాన్ చెప్పిన సమాధానంపై కత్రినా మాట్లాడుతూ.. ప్రొఫెషన్ అంటే డాక్టర్, ఇంజనీర్ లాంటివి అడిగారు అంటూ చెప్పింది. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం మాట మార్చకుండా మరోసారి అదే చెప్పాడు. దాంతో అక్కడున్న అభిమానులతో పాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా నవ్వుకున్నారు. ఈ ఇద్దర్ని చూస్తుంటే మళ్లీ జంట ఒక్కటవుతుందేమో అనే కొత్త అనుమానాలు కూడా వస్తున్నాయి. కత్రినాతో పాటు ఈ చిత్రంలో దిశా పటానీ, టబు కూడా నటిస్తున్నారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనల సమాహారంగా భారత్ సినిమాను అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించినట్టు తెలుస్తుంది. దానికి తగ్గట్లుగానే ఈ చిత్రంలో సల్మాన్ ఐదు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నాడు. యువకుడిగా, గని కార్మికుడిగా, నేవీ అధికారిగా, వృద్ధుడిగా ఇలా వివిధ పాత్రల్లో సల్మాన్ తన నటనతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నాడు. మొత్తానికి సల్మాన్ ఖాన్ చెప్పినట్లుగానే కత్రినా పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కంటుందేమో చూడాలిక.

సల్మాన్ కత్రినా కైఫ్

సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్
దీపిక పదుకొనే మనసు దోచిన ఆ క్రికెటర్.. భర్త రణ్వీర్ ఎదురుగానే..
సల్మాన్ ఖాన్ ఇంట్లో బాంబు.. దమ్ముంటే ఆపాలని మెయిల్..
స్టార్ హీరోకు ఘోర అవమానం.. అవార్డ్ ఇస్తామని పిలిచి స్టేజీపైనే..
దీపిక పదుకొనే చపక్ ట్రైలర్ విడుదల...యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో సంచలనం..
విడాకులు తీసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్..
పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్..
సల్మాన్ చెప్పిన సమాధానంపై కత్రినా మాట్లాడుతూ.. ప్రొఫెషన్ అంటే డాక్టర్, ఇంజనీర్ లాంటివి అడిగారు అంటూ చెప్పింది. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం మాట మార్చకుండా మరోసారి అదే చెప్పాడు. దాంతో అక్కడున్న అభిమానులతో పాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా నవ్వుకున్నారు. ఈ ఇద్దర్ని చూస్తుంటే మళ్లీ జంట ఒక్కటవుతుందేమో అనే కొత్త అనుమానాలు కూడా వస్తున్నాయి. కత్రినాతో పాటు ఈ చిత్రంలో దిశా పటానీ, టబు కూడా నటిస్తున్నారు.

సల్మాన్, కత్రినా