సల్మాన్‌ ఖాన్‌తో నా బంధం అక్కడి వరకే.. కత్రినా కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

2005లో తొలిసారి మైనే ప్యార్ క్యోం కియా సినిమాలో సల్మాన్, కత్రినా కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఈ జంట ఎప్పుడూ ఖండించలేదు.

news18-telugu
Updated: September 23, 2019, 3:14 PM IST
సల్మాన్‌ ఖాన్‌తో నా బంధం అక్కడి వరకే.. కత్రినా కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్
  • Share this:
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్.. ఈ జంట పెళ్లి చేసుకోవాలని కోరుకునే అభిమానులెందరో. సల్లూ భాయ్‌కు కత్రినా సరిగ్గా సూట్ అవుతుందని, వారిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉంటారని అంటారు. వారిద్దరు కలిసి నటించిన ఎన్నో సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. 2005లో తొలిసారి మైనే ప్యార్ క్యోం కియా సినిమాలో సల్మాన్, కత్రినా కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఈ జంట ఎప్పుడూ ఖండించలేదు. అయితే, ఆ తరువాత కొన్ని రోజులకు సల్మాన్, కత్రినా విడిపోయినట్లు ప్రచారం జరిగింది. మళ్లీ కత్రినా.. రణబీర్ కపూర్‌తో ప్రేమాయణం నడిపించింది. ఆరేళ్ల తర్వాత వారిద్దరు విడిపోయారు. దీంతో సల్మాన్, కత్రినా మళ్లీ కలవబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఈ మధ్యే సల్మాన్, కత్రినా కలిసి భారత్ సినిమాలో నటించారు. ఆ సినిమాను చూసిన అభిమానులంతా.. వీరిద్దరి కెమిస్ట్రీ గురించి వేనోళ్ల పొగిడారు. వారిద్దరు కలిస్తే చూడాలని ఉందని సోషల్ మీడియాను హోరెత్తించారు.

అయితే, సల్మాన్‌తో బంధంపై కత్రినా కైఫ్ పెదవి విప్పింది. ఓ ఆంగ్ల ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కత్రినా.. ‘సల్మాన్‌తో 16 ఏళ్ల స్నేహ బంధం నాది. అతడు చాలా ధృడమైన వ్యక్తి. ఆపదలు, అవసరాలు వస్తే మాత్రం కచ్చితంగా తోడుంటాడు. ఎప్పుడూ టచ్‌లో ఉండకపోయినా, తన స్నేహితులకు మాత్రం అండగా ఉంటాడు’ అని చెప్పుకొచ్చింది.
First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading