క‌త్రినా కైఫ్‌కు కోపం వ‌చ్చింది.. సెల్ఫీ కోసం వ‌చ్చిన అభిమానితో..

ఈ రోజుల్లో సెలెబ్రిటీస్ ఎక్క‌డికైనా బ‌య‌టికి రావాలంటే భ‌య‌ప‌డిపోతున్నారు. ఎక్క‌డ అభిమానులు వ‌చ్చి త‌మ మీద ప‌డిపోతారో అని భ‌యం వాళ్ల‌కు. హీరోలు అయితే ఓకే కానీ హీరోయిన్ల‌కే ఎక్క‌డ లేని స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 2, 2019, 3:06 PM IST
క‌త్రినా కైఫ్‌కు కోపం వ‌చ్చింది.. సెల్ఫీ కోసం వ‌చ్చిన అభిమానితో..
కత్రినా కైఫ్ ఫైల్ ఫోటో
  • Share this:
ఈ రోజుల్లో సెలెబ్రిటీస్ ఎక్క‌డికైనా బ‌య‌టికి రావాలంటే భ‌య‌ప‌డిపోతున్నారు. ఎక్క‌డ అభిమానులు వ‌చ్చి త‌మ మీద ప‌డిపోతారో అని భ‌యం వాళ్ల‌కు. హీరోలు అయితే ఓకే కానీ హీరోయిన్ల‌కే ఎక్క‌డ లేని స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. కొంద‌రు ఆక‌తాయిలు సెల్ఫీల పేరుతో వ‌చ్చి వాళ్ల‌తో మిస్ బిహేవ్ చేస్తున్నారు. అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించినా కూడా అస‌హ‌నం చూపించ‌కుండా ఉండాలంటే ఎలా.. వాళ్లు కూడా మ‌నుషులే క‌దా.. క‌చ్చితంగా వాళ్ల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌పుడు కోపం వ‌స్తుంది. ఇప్పుడు క‌త్రినా కైఫ్ విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. ఈమెకు కూడా తాజాగా ఎయిర్ పోర్టులో ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది.

లోప‌లి నుంచి వ‌స్తున్న క‌త్రినాను అభిమానులు చుట్టుముట్టారు. చుట్టూ గార్డ్స్ ఉన్నా కూడా వాళ్ల‌ను త‌ప్పించుకుని మ‌రీ క‌త్రినా ద‌గ్గ‌రికి వ‌చ్చేసాడు ఓ ఫ్యాన్. సెక్యూరిటీ ఎంత బ‌య‌టికి తోస్తున్నా కూడా అత‌డు మాత్రం దూసుకొచ్చాడు. దాంతో ఒక్క‌సారిగా క‌త్రినాకు కూడా కోపం వ‌చ్చింది. వెంట‌నే దూరంగా వెళ్లాలి అన్న‌ట్లు సైగ‌లు చేసింది. కోపంగా అరించేసింది కూడా. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ కుర్రాడు సెల్ఫీ కోసం రావ‌డంతో హూందాగా వ్య‌వ‌హ‌రించింది ఈ ముద్దుగుమ్మ‌. మెల్ల‌గా తీసుకో.. కానీ దూరం నుంచి సెల్ఫీ తీసుకో అంటూ ప‌ర్మిష‌న్ ఇచ్చింది. దాంతో ఫ్యాన్ హ్యాపీగా ఫోటో తీసుకుని వెళ్లిపోయాడు.
Published by: Praveen Kumar Vadla
First published: July 2, 2019, 3:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading