బాలకృష్ణ నా గురువు.. ఆయనే లేకుంటే అంటున్న కత్రినా కైఫ్..

Katrina Kaif: బాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పింది కత్రినా కైఫ్. అయితే ఆమె మూలాలు మాత్రం తెలుగులోనే ఉన్నాయి. కత్రినా స్టార్ అయింది తెలుగు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 17, 2020, 8:26 PM IST
బాలకృష్ణ నా గురువు.. ఆయనే లేకుంటే అంటున్న కత్రినా కైఫ్..
బాలయ్య కత్రినా కైఫ్ (balakrishna katrina kaif)
  • Share this:
బాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పింది కత్రినా కైఫ్. అయితే ఆమె మూలాలు మాత్రం తెలుగులోనే ఉన్నాయి. కత్రినా స్టార్ అయింది తెలుగు సినిమాలతోనే. ఇక్కడే మన సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి.. అక్కడికి వెళ్లి సూపర్ స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ లాంటి హీరోలతో డేటింగ్ చేసి మరింత పాపులర్ అయింది ఈ భామ. కెరీర్ మొదట్లో తెలుగులో వెంకటేష్‌తో మల్లీశ్వరి.. బాలయ్యతో అల్లరి పిడుగు సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.
వెంకటేష్ కత్రినా కైప్ (Venkatesh Katrina Kaif)
వెంకటేష్ కత్రినా కైప్ (Venkatesh Katrina Kaif)


ఇందులో మల్లీశ్వరి బ్లాక్‌బస్టర్ కాగా.. బాలయ్య సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. అయినా కూడా తనకు బాలయ్య అంటే చాలా యిష్టం అంటుంది కత్రినా. ఓ రకంగా తన గురువు బాలయ్యే అంటుంది ఈ బ్యూటీ. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ మధ్యే ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు చూసి అంతా షాక్ అయ్యారు. కెరీర్ మొదట్లో కత్రినా డాన్స్ చూసి అంతా నవ్వేవాళ్లు.
బాలయ్య కత్రినా కైఫ్ (balakrishna katrina kaif)
బాలయ్య కత్రినా కైఫ్ (balakrishna katrina kaif)

నటన అంటే ఎలాగోలా మేనేజ్ చేసేది కానీ డాన్స్ దగ్గరికి వచ్చేసరికి దొరికిపోయేది ఈ భామ. అలాంటి పరిస్థితుల్లోనే బాలయ్యతో అల్లరి పిడుగు సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఓ వైపు బాలయ్య సూపర్ డాన్సర్.. ఆయనతో చేయాలంటే కత్రినా వెనకబడేది. తన బాధ అర్థం చేసుకున్న బాలయ్య.. డ్యాన్స్ ఎలా చేయాలో మెళుకువలు నేర్పించాడు బాలయ్య. ఆయన చెప్పిన అన్ని మెళకువలను శ్రద్ధగా పాటిస్తూ తన తదుపరి సినిమాల్లో సూపర్ డాన్స్ చేసింది కత్రినా కైఫ్.
బాలయ్య కత్రినా కైఫ్ (balakrishna katrina kaif)
బాలయ్య కత్రినా కైఫ్ (balakrishna katrina kaif)

ఆ తర్వాత మెల్లగా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ టాప్ డాన్సర్స్‌లో ఒకరిగా ఉంది కత్రినా. అందుకే బాలకృష్ణ తన డాన్స్ గురువు అంటుంది కత్రినా. తెలుగు సినిమాలు తనకు చాలా నేర్పించాయని.. ఇక్కడి హీరోలు చాలా మంది వాళ్లని చెప్తుంది కత్రినా కైఫ్. మొత్తానికి చేసిన రెండు సినిమాలతోనే టాలీవుడ్‌ను నెత్తిన పెట్టుకుంది ఈ లండన్ బ్యూటీ.
Published by: Praveen Kumar Vadla
First published: July 17, 2020, 8:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading