ఆ డ్రెస్ అదిరిపోయింది...ప్రియాంక‌ను వెనకేసుకొచ్చిన కత్రినా కైఫ్

ఇటీవల జరిగిన గ్రామీ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా వేసుకున్న గౌన్ డ్రెస్‌ చాలా ఎబ్బెట్టుగా ఉందని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఆ డ్రెస్ అదిరిపోయిందంటూ ప్రియాంక చోప్రాను కత్రినా కైఫ్ వెనకేసుకొచ్చింది.

news18-telugu
Updated: February 21, 2020, 5:56 PM IST
ఆ డ్రెస్ అదిరిపోయింది...ప్రియాంక‌ను వెనకేసుకొచ్చిన కత్రినా కైఫ్
ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్
  • Share this:
ఇటీవల గ్రామీ అవార్డ్స్ వేడుకలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్‌పై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రముఖ ఇంటర్నేషనల్ డిజైనర్స్ రాల్ఫ్ అండ్ రూసో డిజైన్ చేసిన తెలుపు రంగు గౌనును వేసుకుని రెడ్ కార్పెట్‌పై నడిచింది ప్రియాంక. ఈ గౌన్ డ్రెస్ చాలా ఎబ్బెట్టుగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ డ్రెస్ నీకు ఎలా నచ్చిందో అర్థంకావడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ సుందరీమణులు దిశా పటాని, హినా ఖాన్, సుచిత్రా కృష్ణమూర్తి తదితరులు ఇప్పటికే ప్రియాంకకు బాసటగా నిలిచారు. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో ఆమె ఇష్టం, అది నిర్ణయించటానికి మీరెవరంటూ నెటిజన్స్‌పై సెలబ్రిటీలు సెటైర్లు వేశారు.

తాజాగా కత్రికా కైఫ్ కూడా ప్రియాంక చోప్రా గ్రామీ డ్రెస్ అదిరిపోయిందంటూ కితాబిచ్చింది. ప్రియాంక డ్రెస్ గురించి ఎవరు ఏమని చెప్పారో తనకు తెలీదని, అయితే ఆ డ్రెస్‌లో ప్రియాంక చాలా బ్యూటిఫుల్‌గా ఉందని చెప్పుకొచ్చింది. ప్రియాంక డ్రెస్ నచ్చని వాళ్లు...ఆ ఫోటోను సరిగ్గా చూసి ఉండరని కూడా అభిప్రాయపడింది. గ్రామీ అవార్డ్స్ వేడుకలో ప్రియాంక వేసుకున్న డ్రెస్‌ను ఇక్కడ చూడండి..






 



Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి




 

Tassel fun. #grammys


Priyanka Chopra Jonas (@priyankachopra) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది






ప్రియాంక చోప్రా డ్రెస్ తనకు నచ్చిందని ఆమె తల్లి మధు చోప్రా కూడా గతంలో వెల్లడించింది. ఈ డ్రెస్‌ను వేసుకోవడానికి ముందే శ్యాంపుల్‌ను తనకు చూపించినట్లు తెలిపింది. ఈ డ్రెస్ కాస్త రిస్కీగా ముందుగా తాను భావించానని, ప్రియాంక వేసుకున్న బెస్ట్ డ్రెస్‌లలో ఇది కూడా ఒకటని అభిప్రాయపడింది. కంప్యూటర్ల వెనుక దాక్కున్న కొందరు అజ్ఞాత వ్యక్తులు, వారి జీవితాన్ని ఎంజాయ్ చేయలేకున్నారని...అందుకే ఇలా ప్రియాంక డ్రెస్ గురించి చెడు కామెంట్స్ చేస్తున్నారంటూ నెటిజన్స్‌పై మండిపడింది.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు