నిన్న గిన్నెలు తోమినా కత్రినా.. తాజాగా ఏమి చేసిందో తెలిస్తే ఆశ్యర్యపోతారు..

కత్రినా కైఫ్ ఈ పేరును తెలుగు వారికి మరోసారి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. మొన్ననే ఇంట్లో గిన్నెలు తోముడు ప్రత్యక్షమైన కత్రినా.. తాజాగా ఏమి చేసిందో తెలుసా..

news18-telugu
Updated: April 29, 2020, 9:22 AM IST
నిన్న గిన్నెలు తోమినా కత్రినా.. తాజాగా  ఏమి చేసిందో తెలిస్తే ఆశ్యర్యపోతారు..
కత్రినా కైఫ్ (Instagram/Photo)
  • Share this:
కత్రినా కైఫ్ ఈ పేరును తెలుగు వారికి మరోసారి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. కత్రీనా హిందీ హీరోయిన్ అయినా.. తెలుగులో రెండు సినిమాలు చేసింది. ఈ భామ మొదటసారిగా విక్టరీ వెంకటేష్ సరసన 'మల్లీశ్వరీ' సినిమాలో నటించింది. ఆ సినిమాలో నటనతో పరవాలేదనిపించినా.. అందచందాలతో అదరగొట్టింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భాగానే అలరించింది. దీంతో ఆ తర్వాత బాలయ్య సరసన 'అల్లరి పిడుగు'లో నటించింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక అప్పటినుండి తెలుగులో ఈ భామకు అవకాశాలు రాలేదు. అయితే హిందీలో మాత్రం అమ్మడు ఇరగదీస్తోంది. ఈ భామ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తోన్న సూర్యవంశీలో హీరోయిన్‌గా నటించింది. ఎపుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.


View this post on Instagram

Tuesday = 🥘+👩🏽‍💻@🏠


A post shared by Katrina Kaif (@katrinakaif) on

ఆ సంగతి పక్కన పెడితే..ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ధాటికి అన్ని రంగాలు మూతపడ్డాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. దీంతో హీరోలు, హీరోయిన్స్ ఇంట్లో ఖాలీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ కాలం గడుపుతున్నారు. అందులో భాగంగా అందాల భామ కత్రినా కూడా తాను తిన్న గిన్నెలు తోముతూ దానికి సంబందించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ భామ... ఇంట్లో వంట చేస్తూ కనిపించింది. తన సోదరి ఇసాబెల్లతో కలిసి ఎల్లిపాయలతో ఏదో ఐటెం వండటానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అభిమానులు కూడా కత్రినా చేస్తోన్న ఐటెం ఏంటో తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఐతే.. ప్రస్తుతం క్రతినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఎమోజీలను పోస్ట్ చేసింది. వాటిని చూస్తే.. ఇంట్లో తినడం.. పండుకోవడం తప్పించి వేరే ఏ పనులు లేవన్నట్టు ఉంది. మొత్తానికి లాక్‌డౌన్ నేపథ్యంలో ఎపుడు వంటింటి మొఖం చూడని హీరోయిన్స్ వంటింట్లో గరిటలు తిప్పుతున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 29, 2020, 9:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading