• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KATHIKA DEEPAM SERIAL KARTHIK TAKES SENSATION DECISION MNJ

Karthika Deepam: కార్తీక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మౌనిత‌ను పెళ్లి చేసుకుంటా

Karthika Deepam: కార్తీక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మౌనిత‌ను పెళ్లి చేసుకుంటా

కార్తీక దీపం సీరియల్

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్తరంగా మారింది. నిన్న‌టి ఎపిసోడ్‌లో నీ మీద ప‌డ్డ నింద‌ను అబద్ద‌మ‌ని నిరూపించుకో వ‌దినా అంటూ దీప‌కు ఆదిత్య స‌ల‌హా ఇవ్వ‌గా

  • Share this:
    Karthika Deepam: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్తరంగా మారింది. నిన్న‌టి ఎపిసోడ్‌లో నీ మీద ప‌డ్డ నింద‌ను అబద్ద‌మ‌ని నిరూపించుకో వ‌దినా అంటూ దీప‌కు ఆదిత్య స‌ల‌హా ఇవ్వ‌గా.. నేను అదే ప‌నిలో ఉన్నానంటూ దీప చెప్పుకొస్తుంది. మ‌రోవైపు హిమ ఎండ‌లో ఇబ్బంది ప‌డ‌టాన్ని దూరం నుంచి చూస్తూ ఉండే కార్తీక్.. లోలోప‌ల బాధ‌ప‌డుతాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఏమ‌ని చెప్పి వ‌చ్చావురా దానికి అంటూ ఆదిత్య‌ను సౌంద‌ర్య అడుగుతుంది. తిర‌గ‌బ‌డ‌మ‌ని చెప్ప‌వా..?కోర్టుకు ఎక్క‌మ‌న్నావా..? ప‌ంచాయితీ పెట్టించ‌మ‌ని చెప్పావా..? అని సౌంద‌ర్య ప్ర‌శ్నిస్తుంది. మీరు ఇన్ని రోజులు చెప్ప‌నిదే చెప్పి వ‌చ్చాను మ‌మ్మీ.. వ‌దిన మీద ప‌డ్డ నింద‌ను చెరుపుకోమ‌ని చెప్పా అని చెబుతాడు. ఆ నింద అబ‌ద్ద‌మ‌ని తేలితే త‌ప్ప అన్న‌య్య, వ‌దిన‌ను న‌మ్మ‌డు. అది అబద్ద‌మ‌ని నేను నిరూపిస్తాను మ‌మ్మీ అని అంటాడు. అదే స‌మ‌యానికి ఇంట్లోకి వచ్చిన కార్తీక్.. ఆ ప‌ని చేయిరా అంటాడు.

    నిజంగా అడుగుతున్నాను ఆదిత్య‌. అది అబ‌ద్ధ‌మ‌ని నిరూపించు. ఆ త‌రువాత నేను హిమ‌ను ఇక్క‌డికి తెచ్చుకుంటా. ప్ర‌పంచ‌మంతా కాదు నేను న‌మ్మితే చాలు అని చెబుతాడు. ఇది హిమ స‌మ‌స్య ఒక్క‌టే కాదురా అని ఆనంద‌రావు అడ‌గ్గా.. కానీ హిమ బ‌లైపోయింది. దానికి కార‌ణం ఎవ‌రు అని అంటాడు. నేను.. అందులో హిమ త‌ప్పు ఏం లేదు అని చెబుతుంది. దానికి కార్తీక్.. ఆ ప‌సిదాని త‌ప్పు ఉంద‌ని నేను చెప్ప‌డం లేదు. అందుకే నేను న‌ర‌కం చూస్తున్నా. క‌న్న‌ది అది. పెంచిది నేను. ఎత్తుకొచ్చింది నువ్వు. నిజం దాచింది మీరు. లోకం తెలియ‌ని ప‌సిదాన్ని తెచ్చి నా చేతిలో పెడితే దాని త‌ప్పు ఎలా అవుతుంది అని కార్తీక్ అంటాడు. మ‌రి దీప మీద అంత సానుభూతి ఉంటే.. దాన్ని ఇక్క‌డకు తీసుకురావొచ్చుగా. పెంచిన ప్రేమ‌ను చంపుకోవ‌డం ఎందుకు అని ఆనంద‌రావు అడుగుతాడు. పెంచ‌డానికి, ర‌క్తం పంచ‌డానికి చాలా తేడా ఉంటుంది అని కార్తీక్ చెబుతాడు.

    వెంట‌నే సౌంద‌ర్య‌.. అందుకని హిమ‌కు శిక్ష వేస్తావా..? అని అంటుంది. ఆ త‌రువాత కార్తీక్.. ఆదిత్య నిజంగా అడుగుతున్నాను. మీ వ‌దిన ఏ త‌ప్పు చేయ‌లేద‌ని నువ్వు నిరూపిస్తావా..? అని అంటాడు. నేను నిరూపిస్తాను రా. నా కోడ‌లు నిప్పు అని నేను నిరూపిస్తా అని సౌంద‌ర్య‌ అన‌గా.. నీ మీద నాకు న‌మ్మ‌కం లేదు. నువ్వు నిజాల‌ను దాచిపెడ‌తావు. అబ‌ద్దాల‌ను బ‌తికిస్తావు. నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు. ఆ రోజు నువ్వు ఆ బిడ్డ‌ను తీసుకురాకుండా ఉండి ఉంటే.. ఇంత మ‌మకారం పెంచుకునేదాన్ని కాదు. క‌నీసం సౌర్య‌ను చూసిన‌ట్లు అయినా చూసేవాణ్ణి. ఎంతోకొంత సాయం చేసేదాన్ని. ఇలా గాయం చేసేవాణ్ణి కాదు అని చెబుతాడు. అయినా ఇందులో దీప త‌ప్పు ఏం లేదు. ఎందుకంటే నువ్వు ఎత్తుకొచ్చిన‌ది దానికి తెలీదు క‌దా. ఆదిత్య ఆ నింద అబ‌ద్ద‌మ‌ని నిరూపించు. నిజ‌మ‌ని తేలితే మాత్రం నేను మౌనిత‌ను పెళ్లి చేసుకుంటా అని పెద్ద బాంబు వేస్తాడు కార్తీక్.

    మ‌రోవైపు దీప ఇంట్లో అన్నం తిని చ‌ల్ల‌టి నీళ్ల‌తో చేయిని క‌డుకున్న‌ హిమ.. చ‌లికి వ‌ణుకుతూ దీప ద‌గ్గ‌ర చేరుతుంది. అప్పుడు సౌర్య త‌న స్వెట‌ర్‌ని హిమ‌కు ఇస్తుంది. మ‌రి నీకు అంటే ఏం ప‌ర్లేదు. ఒక్క రోజే క‌దా. రేపు వార‌ణాసిని అక్క‌డ‌కు పంపి.. స్వెట‌ర్ తెప్పిద్దాంలే అని చెబుతుంది. అయితే హిమ‌.. చలికి నువ్వు ఉండ‌లేవుగా.. ఇది తీసుకో అని చెప్ప‌గా.. ఆగు ఆగు.. నేను ఇప్పుడు స్వెట‌ర్ వేసుకోవాలి అంతేక‌దా. ఒక్క నిమిషం ఇప్పుడే వ‌స్తాను అని సౌర్య లోప‌లికి వెళుతుంది. ఇంకొక‌టి ఉందా అమ్మా అని హిమ, దీప‌ను అడ‌గ్గా.. దుప్ప‌టి క‌ప్పుకొని వ‌స్తుందేమో అని దీప చెబుతుంది. అప్పుడు హిమ ఆలోచ‌న‌లోకి వెళుతుంది. ఒక‌రోజు చ‌లికి త‌ట్టుకోలేక హిమ‌, దుప్ప‌టి వేసుకురావ‌డం అది చూసి కార్తీక్.. నువ్వు ఇలా వేసుకోవ‌డం నాకు న‌చ్చ‌దు. నేను చూడ‌లేను. రోడ్డు ప‌క్క‌న ఉన్న వాళ్లు అలా వేసుకుంటారు. నీకు చాలా స్వెట‌ర్‌లు ఉన్నాయి క‌దా. ఇలా ఇంకోసారి క‌ప్పుకోకు అని కార్తీక్ చెప్పిన మాట‌ల‌ను గుర్తుచేసుకుంది.

    ఇక లోప‌లి నుంచి సౌర్య ఓ స్వెట‌ర్‌ని వేసుకొని వ‌స్తుంది. దాన్ని చూసి హిమ న‌వ్వుతూ.. ఇది అని అడ‌గ్గా.. మ‌న నాన్న‌దే. నాన్న కొద్ది రోజులు ఉండి వెళ్లారుగా. అప్పుడు మ‌రిచిపోయి వెళితే నేను దాచిపెట్టా. ఇప్పుడు స‌డ‌న్‌గా గుర్తుకు వ‌చ్చింది అని చెబుతుంది. ఈ స్వెట‌ర్ బ‌దులు నాన్న ఉంటే ఎంత బావున్నో క‌దా అని హిమ అడుగుతుంది. వెంట‌నే దీప కాస్త బాధ‌ప‌డుతుంది. అది గ‌మ‌నించిన సౌర్య‌..నేను ఇలా నీ మీద చెయ్యి వేసుకొని ప‌డుకుంటే.. నాన్న‌నే వేసిన‌ట్లు ఉంటుందిలే అని చెబుతుంది. అప్పుడు హిమ‌.. నాకు ఒక‌సారి బాగా జ్వ‌రం వ‌చ్చి ఇక్క‌డే ఉన్నాను క‌దా అమ్మా. అప్పుడు నేను బాగా గుర్తొచ్చి. నా ఫ్రాక్‌ని ప‌క్క‌న పెట్టి జోకొడుతూ ప‌డుకునేవార‌ట. డాడీనే చెప్పాడు. ఇప్పుడు నేను డాడీ ష‌ర్ట్‌ని పట్టుకొని ప‌డుకుంటాను. కానీ ఎప్ప‌టివ‌ర‌కు ఇలా. ఇప్పుడు ఇలానేనా అని హిమ అంటే.. వ‌స్తారు. నాన్న వ‌స్తారు అని దీప ఇద్దరినీ హ‌త్తుకొంటుంది.

    ఇక హిమను గుర్తు చేసుకుంటూ ఉంటాడు కార్తీక్. ఆ లోపు హిమ నుంచి ఫోన్ రావ‌డంతో కాస్త ఆలోచిస్తాడు. ఒక‌వేళ నాకు గుర్తు వ‌చ్చిన‌ట్లే.. హిమ‌కు కూడా గుర్తొచ్చానేమో అని కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్‌లో హిమ భోజనం చేశావా డాడీ..? అని అడుగుతుంది. నేను తిన్నానో లేదో అడ‌గ‌వా..? అని అడుగుతుంది. నా మ‌న‌సు హిమకు తెలిసిపోతుందా..? హిమ ప్రేమ న‌న్ను చేరుకుంటుందా..? అని కార్తీక్ లోలోప‌ల అనుకుంటాడు. వెంట‌నే హిమ‌.. ఏం డాడీ మాట్లాడ‌వా..? అని అడ‌గ్గా.. ఏం లేదు బంగారం అనిపించిందే వినిపించింది. ఎలా ఉన్నావు నాన్న. ఏం చేస్తున్నావురా..? అన్నం తిన్నావా..? అక్క‌డ చ‌లిగా ఉందా..? నువ్వు తీసుకెళ్లిన బ‌ట్ట‌ల్లో స్వెట‌ర్ స‌ర్దానా..? అని ప్ర‌శ్న‌లు వేస్తూనే ఉంటాడు. దానికి హిమ న‌వ్వుతూ ఉంటుంది. అస‌లు నువ్వు ఏంటి మాట్లాడ‌వురా..? అని అంటాడు. నీ న‌వ్వు హాయిగా ఉంద‌మ్మా.. కానీ ఎందుకు న‌వ్వుతున్నావో అర్థం కావ‌డం లేదు అని కార్తీక్ అంటాడు.

    దానికి హిమ‌.. న‌న్ను నువ్వు మాట్లాడించ‌కుండా నువ్వే మాట్లాడుతున్నావు. అందుకే నాకు న‌వ్వు వ‌స్తుంది అని అంటుంది. దానికి కార్తీక్ కూడా న‌వ్వుతాడు. నువ్వే మాట్లాడు నాకు వినాల‌నుంది అని చెబుతాడు. వెంట‌నే హిమ‌.. చూడాల‌ని ఎందుకు లేదు డాడీ అని అడుగుతుంది. నాకు నిన్ను చూడాల‌నిపించింది. నువ్వు భోజనం చేశావో.. లేదో..? అని గుర్తొచ్చింది. అందుకే ఫోన్ చేశా. నాన్న‌మ్మ‌తో నేను చెప్పాను. నేను లేన‌ని మీరు డాడీని భోజ‌నానికి పిల‌వ‌క‌పోతే తిరిగి వ‌చ్చాక నేను ఊరుకోను అని చెప్పాను. అడిగే వాళ్లు లేక‌పోతే నువ్వు తిన‌డం కూడా మ‌ర్చిపోతావు అని హిమ అంటే.. కార్తీక్ సంతోషంగా ఫీల్ అవుతాడు. వెంట‌నే హిమ‌.. డాడీ అమ్మ‌ను క‌విత‌లు నేర్పించ‌మ‌ని ఇందాకే అడిగాను అని అన‌గా.. కార్తీక్ మ‌న‌సు మ‌ళ్లీ మారిపోతుంది. మౌనిత చెప్పిన మాట‌లు గుర్తుకు తెచ్చుకొని ఫోన్‌ని ప‌క్క‌న‌పెట్టేస్తాడు.

    వెంట‌నే ఏం అయ్యింది అమ్మా.. అని దీప అడ‌గ్గా.. ఇందాక బానే మాట్లాడాడు. అన్నం తిన్నావా..? స‌్వెట‌ర్ వేసుకున్నావా..? అని అన్నాడు. డ‌బ్బులు ఇవ్వ‌లేదు ఏం అనుకోకురా అన్నాడు. కానీ ఉన్న‌ట్లుండి ఫోన్ క‌ట్ చేశాడు ఎందుక‌మ్మా అని అడుగుతుంది. వెంట‌నే దీప మ‌న‌సులో.. నువ్వు క‌విత‌ల గురించి మాట్లాడ‌క‌పోయి ఉంటే.. ఇంకా కాసేపైనా మాట్లాడేవాడేమో. నువ్వు తృప్తిగా, ధైర్యంగా నిద్ర‌పోయేదానికి అని అనుకుంటుంది. నువ్వు ఏం అన్నావు హిమ అని సౌర్య అడ‌గ్గా.. అమ్మ‌ను క‌విత‌లు నేర్పించ‌మ‌ని చెప్పాను అని అన్నాను అంటుంది. వెంట‌నే సౌర్య అమ్మ పేరు చెప్పావు క‌దా. అందుకే కోపం వ‌చ్చిందేమో అని అంటుంది. కాదు క‌విత‌లు నేర్పించ‌మ‌ని చెప్పాను అని హిమ‌ అంటుంది. అయినా వాటి మీద ఎందుకు కోపం. ఆయ‌నే నేర్చుకోమ‌ని పంపాడుగా అని సౌర్య అంటుంది.

    ఇక దీప‌.. హిమ నాన్న నువ్వు మాట్లాడ‌న‌ప్పుడు ఎంత బ‌తిమాలుకుంటాడు. ఇప్పుడు అలానే ఉండు. నాలుగు రోజులు నువ్వు మాట్లాడ‌క‌పోతే.. ఇక్క‌డ‌కు వ‌చ్చి నాన్న‌, క‌న్నా, బంగారం అంటాడు అని చెబుతుంది. వెంట‌నే హిమ‌.. అవును అలానే చేస్తాను. అప్పుడు కానీ డాడీకి తిక్క కుద‌రదు అని అంటుంది. నాలుగు రోజులు మాట్లాడ‌కుంటే.. ఆ త‌రువాత నీకు అల‌వాటు అవుతుందేమోన‌ని నీకు ఆశ పెట్టాను త‌ల్లి న‌న్ను క్షమించు అని దీప మ‌న‌సులో అనుకుంటుంది.

    అటు కార్తీక్ ఇంట్లో భోజ‌నం చేస్తుండగా.. కార్తీక్ మౌనంగా ఉంటాడు. దాన్ని గ‌మ‌నించిన సౌంద‌ర్య‌. మౌనంగా ఉండ‌కురా. ప్ర‌శాంతంగా తిను అని చెబుతుంది. దానికి కార్తీక్.. గొంతు దిగట్లేదు మ‌మ్మీ అని అంటాడు. ఆక‌లిగా లేదా..? అని ఆనంద‌రావు అడ‌గ్గా.. ఏదో లేదు అని కార్తీక్ స‌మాధానం ఇస్తాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. అంత మ‌న‌సులోనే ఉంటుంది. ఉన్న‌ది ఉంటుంది. లేనిది ఉంటుంది. మ‌న‌సును అడిగితే అదే జ‌వాబు చెబుతుంది. అంత‌రాత్మ మ‌న‌సును నిల‌దీస్తూనే ఉంటుంది అని అంటుంది. వెంట‌నే కార్తీక్.. నువ్వు ఇప్పుడు ఫిలాస‌ఫీలు బాగానే చెబుతావు మమ్మీ అంటాడు. ఇక రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో హిమ‌ను చూసేందుకు కార్తీక్, దీప ఇంటికి వెళతాడు.
    Published by:Manjula S
    First published: