విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘కథ వెనుక కథ’(Katha Venuka Katha ). కృష్ణ చైతన్య దర్శకత్వంలో సంస్థ దండమూడి బాక్సాఫీస్ బ్యానర్‌పై అవనీంద్ర కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 24న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కథ వెనుక కథ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ సందర్బంగా.. సహ నిర్మాత సాయి గొట్టిపాటి మాట్లాడుతూ ‘‘మా కథ వెనుక కథ చిత్రాన్ని మార్చి 24న రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే కొన్ని అనివార్య కారణాలతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేశాం. త్వరలోనే మంచి రిలీజ్ డేట్ చూసుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం’’ అన్నారు.
ఈ సినిమాలో నటీనటులు విషయానికి వస్తే.. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ, అలీ, సునీల్, జయ ప్రకాష్, బెనర్జీ, రఘు బాబు, సత్యం రాజేష్, మధు నందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, ఈరోజుల్లో సాయి, రూప తదితరులు నటిస్తున్నారు.
ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. బ్యానర్: దండమూడి బాక్సాఫీస్, నిర్మాత: అవనీంద్ర కుమార్, స్టోరి, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి గొట్టిపాటి, సినిమాటోగ్రాఫర్స్: గంగనమోని శేఖర్, ఈశ్వర్, ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల, మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్, ఫైట్స్: అంజి, రియల్ సతీష్, ఆర్ట్: వెంకట్ సలపు, కొరియోగ్రఫీ: భాను, లిరిక్స్: కాసర్ల శ్యామ్, పూర్ణాచారి, ఆడియో: ఆదిత్య మ్యూజిక్, పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి బియాండ్ మీడియా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood news