Karthikeya - Raja Vikramarka Releas Date: కార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాజా విక్రమార్క’. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ‘ప్రేమతో మీ కార్తీక్’ సినిమాతో పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ (Karthikeya Gummakonda).. ఆ తర్వాత అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘RX100’ మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి వావ్ అనిపించాడు. ఆ తర్వాత తెలుగులో ‘హిప్పి’, ‘గుణ 369’, 90 ML, చావు కవురు చల్లగా వంటి సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
తాజాగా చిరంజీవి హీరోగా నటించిన అలనాటి సినిమా టైటిల్ ‘రాజా విక్రమార్క’ టైటిల్‌తో కొత్త సినిమా చేసాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్‌తో ఈ సినిమాపై ఆసక్తి రేకిత్తించారు. తాజాగా ఈ సినిమాను నవంబర్ 12న (November 12) విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
Super excited & extremely thrilled to announce that our #RajaVikramarka is releasing in theatres on Nov 12th ?
One of the most special roles in my career. Need all your blessings and support ?
#RajaVikramarkaOnNov12 pic.twitter.com/KtqsvEdHrg
— Kartikeya (@ActorKartikeya) October 20, 2021
ఈ సినిమాలో కార్తికేయ కెరీర్‌లో తొలిసారి సూపర్ కాప్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కార్తికేయ ‘NIA’ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలోని సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కార్తికేయ ఒదిగిపోయారు. తనికెళ్ల భరణితో కార్తికేయ సన్నివేశాలు ఈ మూవీకి హైలెట్. ఈ సినిమాలో కార్తికేయ.. ఏజెండ్ విక్రమ్.. అదే ’రాజా విక్రమార్క’ పాత్రలో అలరించనున్నాడు.
Tollywood Brothers : సినీ ఇండస్ట్రీలో హీరోలుగా సత్తా చాటిన అన్నదమ్ములు.. నందమూరి టూ మెగా బ్రదర్స్..
మొత్తంగా డబుల్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్టు టీజర్‌లో చూపించారు. ‘రాజా విక్రమార్క’ సినిమాకు 88 రామారెడ్డి’ నిర్మించారు. శ్రీ సరిపల్లి డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో కార్తికేయకు జెడిగా తాన్య హోప్ నటించింది. ఈ చిత్రంలో కార్తికేయ యాక్షన్‌తో పాటు కామెడీని ట్రై చేసాడు. మొత్తంగా ‘రాజా విక్రమార్క’ గా కార్తికేయ మరో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Samantha : సమంత సంచలన నిర్ణయం.. ఆ యూట్యూబ్ ఛానెల్స్‌పై పరువు నష్టం కేసు..
మొత్తంగా కరోనా సెకండ్ వేవ్‌లో నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ మంచి సక్సెస్ అందుకొని తొలి బ్రేక్ ఈవెన్ మూవీగా 2021లో రికార్డులకు ఎక్కింది. ఆ తర్వాత అక్కినేని రెండో నట వారసుడు అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ కూడా క్లీన్ హిట్‌గా నిలిచిపోయింది. ఈ బాటలో మరికొన్ని సినిమాలు తమ విడుదల తేదిని ఖరారు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కార్తికేయ తొలిసారి NIA ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ సినిమా నవంబర్ 12న ప్రేక్షకులు ముందుకు రానుంది. RX 100 తర్వాత సరైన సక్సెస్ లేని కార్తికేయ.. చిరంజీవి ఓల్డ్ టైటిల్ ‘రాజా విక్రమార్క’ బాక్సాఫీస్ దగ్గర విజేతగా నిలుస్తాడా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kartikeya, Raja Vikramarka, Tollywood