Raja Vikramarka Teaser : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ‘ప్రేమతో మీ కార్తీక్’ సినిమాతో పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ (Karthikeya Gummakonda).. ఆ తర్వాత అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘RX100’ మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి వావ్ అనిపించాడు. ఆ తర్వాత తెలుగులో ‘హిప్పి’, ‘గుణ 369’, 90 ML, చావు కవురు చల్లగా వంటి సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా చిరంజీవి హీరోగా నటించిన అలనాటి సినిమా టైటిల్ ‘రాజా విక్రమార్క’ టైటిల్‌తో కొత్త సినిమా చేసాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ఈ సినిమాపై ఆసక్తి రేకిత్తించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసారు.
ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తి రేకిత్తించేలా ఉంది. ఈ సినిమాలో కార్తికేయ ‘NIA’ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలోని సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కార్తికేయ ఒదిగిపోయారు. తనికెళ్ల భరణితో కార్తికేయ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఏక్ లడ్ కీ భీగీ భాగీ సీ’ అంటూ కిషోర్ కుమార్ సాంగ్‌తో ఈ టీజర్‌ను ఓపెన్ చేసారు.
Taking you into an action-packed fun ride with our dynamic agent #?????????????? aka @ActorKartikeya ?
#RajaVikramarkaTeaser
▶️https://t.co/X9ZCuMTRMd@actortanya @SriSaripalli_ @88Ramareddy @AdireddyT @prashanthvihari @SCMMOffl @saregamasouth @PulagamOfficial pic.twitter.com/72Vbxs8iud
— BA Raju's Team (@baraju_SuperHit) September 4, 2021
అనుకోకుండా కార్తికేయ చేతిలో రివాల్వర్ పేలుతోంది. దానికి అతను బాబాయి తనికెళ్ల భరణిని ఉద్దేశిస్తూ చూసుకోలేదు బాబాయి అంటాడు. దానికి తనికెళ్ల భరణి.. ఏదో కాలి తొక్కినంత ఈజీగా చెప్పావు అంటారు. ఇక మార్నింగ్ కశ్మీర్లో మిలిటెంట్స్‌కు దొరికిపోయి.. రాత్రి సెకండ్ షోకు ఢిల్లికి వచ్చాడని హీరో గురించి తనికెళ్ల భరణి చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.
Tollywood Brothers : సినీ ఇండస్ట్రీలో హీరోలుగా సత్తా చాటిన అన్నదమ్ములు.. నందమూరి టూ మెగా బ్రదర్స్..
ఈ సినిమాలో కార్తికేయ.. ఏజెండ్ విక్రమ్.. అదే ’రాజా విక్రమార్క’ పాత్రలో అలరించనున్నాడు. మొత్తంగా డబుల్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్టు టీజర్లో చూపించారు. చిన్నపుడు కృష్ణగారిని, పెద్దయ్యాక టామ్ క్రూజ్‌ను చూసి ఆవేశపడిపోయి ఈ డ్యూటీలో జాయిన్ అయ్యాను. సరదా తీరిపోతుంది అంటూ కార్తికేయ చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి.
‘రాజా విక్రమార్క’ సినిమాకు 88 రామారెడ్డి’ నిర్మించారు. శ్రీ సరిపల్లి డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో కార్తికేయకు జెడిగా తాన్య హోప్ నటించింది. ఈ చిత్రంలో కార్తికేయ యాక్షన్‌తో పాటు కామెడీని ట్రై చేసాడు. మొత్తంగా ‘రాజా విక్రమార్క’ గా కార్తికేయ మరో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.