• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KARTIKA DEEPAM SERIAL UPDATE SOURYA HAPPY WITH KARTHIK ELSEWHERE MOUNITHA DOUBT ON LAWYER SUJATHA MNJ

Karthika Deepam: టెన్ష‌న్‌లో మౌనిత‌.. కార్తీక్‌తో హ్యాపీగా గ‌డుపుతోన్న సౌర్య‌

Karthika Deepam: టెన్ష‌న్‌లో మౌనిత‌.. కార్తీక్‌తో హ్యాపీగా గ‌డుపుతోన్న సౌర్య‌

కార్తీకదీపం. తెలుగులో సూపర్ హిట్ సీరియల్. రేటింగ్స్‌లో కూడా టాప్‌లో ఉంది. ఈ సీరియల్‌లో నటించే వారి పాత్ర ఎంత ఉందో వారికి డబ్బింగ్ చెప్పే వారి పాత్ర కూడా ఉంది. ఈ సీరియల్‌లో ముఖ్యమైన పాత్రలకు ఎవరు డబ్బింగ్ చెబుతారో చూద్దాం.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ఆస‌క్తిక‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో మేడ మీద ప‌డుకున్న కార్తీక్ మీద సౌర్య చేయి వేస్తుంది. దాంతో హిమ అని క‌ళ్లు తెరిచిన కార్తీక్‌, సౌర్య‌ను చూసి చేయిని ప‌క్క‌కు తీస్తుంటాడు

  • Share this:
    Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ఆస‌క్తిక‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో మేడ మీద ప‌డుకున్న కార్తీక్ మీద సౌర్య చేయి వేస్తుంది. దాంతో హిమ అని క‌ళ్లు తెరిచిన కార్తీక్‌, సౌర్య‌ను చూసి చేయిని ప‌క్క‌కు తీస్తుంటాడు. అప్పుడు సౌర్య‌.. ఏం నాన్న నేను చేయి వేసుకోకూడ‌దా..? అని ప్ర‌శ్నిస్తుంది. దానికి కార్తీక్ మ‌న‌సులో.. నాన్న అంటే ఊ అనాలో ఊహూ అనాలో అర్ధం కాని ప‌రిస్థితిలో ఉన్నాను ఏం చెప్పాలి అని అనుకుంటూ మ‌ళ్లీ సౌర్య చేయిని త‌న మీద వేసుకుంటాడు. దాంతో సౌర్య సంతోషంగా నిద్ర‌పోతుంది.

    మ‌రుస‌టి రోజు సౌంద‌ర్య హ‌డావిడిగా వెళుతుండ‌గా.. సౌర్య ఆపి అత్త‌య్యా ఇంత హడావిడిగా వెళ్తున్నారేంటి అత్త‌య్యా అని అడుగుతుంది. దానికి సౌంద‌ర్య‌.. ధ‌ర్మం నాలుగు పాదాల మీద న‌డుస్తోంది శ్రావ్య‌. ప్ర‌పంచంలో కోపాలు, తాపాలు, విద్వేషాలు వీట‌న్నింటికి కాలం చెల్లింది. కేవ‌లం బంధాల‌కు, మాన‌వ సంబంధాల‌కు, కుటుంబంలోకి అనుబంధాల‌కు పెద్ద పీట వేసే రోజులు వ‌చ్చాయి అంటాయి. దానికి శ్రావ్య‌.. అత్త‌య్యా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావ‌డం లేదు అంటుంది.

    దానికి సౌంద‌ర్య‌.. మీ బావ గారు, అదే మా సుపుత్రుడు, వంశోద్దార‌కుడై మ‌న వంశాన్ని ఉద్ధ‌రిస్తున్నాడు. కోపం అనే ముసుగును తీసేసి తండ్రి అనే రూపాన్ని ధ‌రిస్తున్నాడు అని చెబుతుంది. దానికి శ్రావ్య‌.. ఇది కూడా అర్థ‌మై కాకుండా ఉంది అన‌గా.. సౌంద‌ర్య న‌వ్వుతూ ఆదిత్య మాట‌ల్లాగా అర్థం ప‌ర్థం లేకుండా ఉన్నాయా అని అంటుంది. దానికి శ్రావ్య‌.. అయ్యో.. అంత దారుణంగా ఎవ‌రూ మాట్లాడలేరు అత్త‌య్యా. మీరు బావ‌గారి గురించే క‌దా చెప్పేది అని అన‌గా.. అవును వాడిలో ర‌క్త‌సంబంధం ఉర‌కలు వేయ‌డం మొద‌లుపెట్టింది. అది క‌న‌ప‌డ‌ని పాశంలాగా ప‌ట్టి లాగుతోంది. దీప మీద పంతంతో హిమ‌ను తీసుకెళ్లి దీప అక్క‌డ పెట్టుకుంద‌న్న క‌సితో సౌర్య‌ను ఇక్క‌డ‌కు తీసుకొచ్చాన‌న్నాడు కానీ కార‌ణం అది కాదు. అది కాద‌ని వాడికి తెలీదు. అదే బంధం, రుణ బంధం, ర‌క్త సంబంధం. నాన్న రెండు రోజులు నీ ద‌గ్గ‌ర ఉండాల‌నుంది నాన్న అని సౌర్య ధీనంగా అడిగిన‌ప్పుడే వాడు ర‌మ్మ‌న్న‌ది మాన‌వ‌త్వంతో కాదు. వాడి తండ్రి మ‌న‌సు స్పందించింది. వాడి తండ్రి గుండె త‌ల్ల‌డిల్లిపోయింది. అందుకే సౌర్య‌ను వాడు తీసుకొచ్చాడు. దాని మ‌న‌సు నొప్పించ‌కుండా మ‌సులు కుంటున్నాడు అని సౌంద‌ర్య అంటుంది.

    దానికి శ్రావ్య‌.. మీరు ఇప్పుడు చెబుతుంటే అర్థం అవుతుంది. నాకు, ఆదిత్య‌కు, మామ‌య్య‌కు బావ‌గారు సౌర్య‌ను తీసుకురావ‌డం ఏంట‌ని అస్స‌లు అర్థం కాలేదు. ఇప్పుడు పూర్తిగా అర్థ‌మైంది అని అంటుంది. దానికి సౌంద‌ర్య‌.. నాకు ఆ రోజే అర్థం అయ్యింది. ఇవాళ ఉద‌యం తండ్రి కూతుర్లు బ‌య‌టకు వెళ్లారు. ఇదంతా వంట‌ల‌క్క‌కు తెలిస్తే ఎంత సంతోష‌ప‌డుతుందో అందుకే దానికి చెప్ప‌డానికే బ‌యలుదేరాను వ‌స్తాను అని చెప్పి అక్క‌డి నుంచి వెళుతుంది.

    ఇక కార్తీక్‌ని ఒక టిఫెన్ బండి ద‌గ్గ‌ర‌కు తీసుకెళుతుంది కార్తీక్. ఇక్క‌డా అని కార్తీక్ అడ‌గ్గా.. ఇక్క‌డే ఎప్పుడూ తిన‌లేదా నాన్న అని సౌర్య అడుగుతుంది. దానికి కార్తీక్.. తింటాన‌ని ఎప్పుడూ నాన‌మ్మ‌ను బెదిరించ‌డ‌మే కానీ ఎప్పుడూ కారు దిగ‌లేదు, ఇక్క‌డ‌కు రాలేదు అంటాడు. ఇక సౌర్య‌.. ఇప్పుడు దిగండి నాన్న అని కిందికి దిగుతుంది. దాంతో ఏమీ చేయ‌లేక కార్తీక్ కూడా కారు నుంచి దిగుతాడు. ఇక సౌర్య‌.. నాన్న నువ్వు ఎప్పుడూ డాబా మీద ప‌డుకోలేదు. థ్రిల్లింగ్‌గా ఉంద‌న్నావు క‌దా రాత్రి. ఇప్పుడు ఇక్క‌డ టిఫెన్ తిన్నా అలాగే థ్రిల్లింగ్‌గా ఉంటుంది ప‌ద అని కార్తీక్‌ని తీసుకెళుతుంది.

    ఇక మెను ఏంటి అని టిఫెన్ బండి అత‌డిని కార్తీక్ అడ‌గ్గా.. దానికి సౌర్య న‌వ్వుతూ నేను చెబుతాలే అన్నా.. ఒక ఉల్లి దోస‌, జిల‌క‌ర్ర కూడా వెయ్యి, అందులోకి అల్లం ప‌చ్చ‌డి, కొబ్బ‌రి ప‌చ్చ‌డి, సాంబారు అన్నీ కావాలి. నాకు ప్లేట్ ఇడ్లీ. నెయ్యి, కారం పొడి వేసి అల్లం ప‌చ్చ‌డి, సాంబారు ఇవ్వు అని అంటుంది. దానికి అత‌డు అలాగే అంటాడు. ఇక అక్క‌డ అంద‌రూ తినే విధానం చూసి కార్తీక్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. ఇక సౌర్య‌.. ఇక్క‌డ ఇడ్లీ మీద మార్చిన కారం వేసి నెయ్యి వేస్తే ఉంటుంది నాన్న. మామూలుగా ఉండ‌దు. ఆ వంట‌ల‌క్క ఏం చేస్తాది. ఇదీ టిఫెన్ అంటే. మాల‌తికి కూడా స‌రిగ్గా చేయ‌డం రాదు తెలుసా అని అంటుంది.

    ఇక టిఫెన్లు తీసుకొచ్చి ఇవ్వ‌గా.. కార్తీక్ ఎలా తినాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ ప్లేట్‌లోని సాంబారు, చ‌ట్నీని సౌర్య క‌లుపుతూ ఉంటుంది. ఏంటి ఇది అని కార్తీక్ అడుగుతూ.. ఏయ్ రౌడీ ఇదేం కాంబినేష‌న్ అని అంటాడు. దానికి సౌర్య‌.. ఇది చాలా బావుంటుంది. ఇది నేనే క‌నిపెట్టాను నాన్న అని అంటుంది. ఆ త‌రువాత ఎలా తినాలో కార్తీక్‌కి చెప్పే సౌర్య‌.. తృప్తిగా తింటేనే ఇమ్యూనిటీ పెరుగుతుంద‌ట అని అంటుంది. ఇక కార్తీక్.. అంద‌రూ చూస్తున్నారే అంటే..చూస్తున్న వాళ్లంద‌రూ ఇమ్యూనిటీ పెంచ‌రు నాన్న. అయినా వాళ్లు ఇలానే తింటున్నారు చూడండి అని సౌర్య చెబుతుంది. ఆ త‌రువాత కార్తీక్ అక్క‌డున్న వారిని చూసి తిన‌డం స్టార్ట్ చేస్తాడు.

    ఎలా ఉంద‌ని సౌర్య అడ‌గ్గా.. అదిరింద‌ని కార్తీక్ అంటాడు. ఇక సౌర్య ఇంకో దోసె చెప్స‌నా అంటే.. నీకు కూడా చెప్పు కుమ్మేద్దాం అని కార్తీక్ అంటాడు. దాంతో సౌర్య రెండు దోసెలు చెబుతుంది. ఇక దీప బండి మీద వ‌చ్చిన సౌంద‌ర్య‌.. కార్తీక్ కారును చూసి ఆపుతుంది. కిందికి దిగి.. ఇది మీ ఆయ‌న కారు అన‌గా.. దిక్కులు చూసి అడుగోండి అత్త‌య్యా మా ఆయ‌న అంటుంది. ఎక్క‌డా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. కార్తీక్, సౌర్య తింటున్న వైపు చూపుతుంది. అది చూసిన సౌంద‌ర్య‌, దీప త‌ల మీద మొట్టికాయ వేసి అన్నీ అవ్వ బుద్దులే నీ కూతురికి. నా కూతురిని చెడ‌గొడుతుందే అని అంటుంది. దానికి దీప‌.. మీకు స్టేట‌స్ క‌నబ‌డుతుందా..? నాకు ఒక అంద‌మైన దృశ్యం కనిపిస్తుంది అని అంటుంది. ఇక సౌంద‌ర్య‌.. ఒసేయ్ వాడు వేళ్లు చ‌ప్ప‌రిస్తున్నాడే అన‌గా.. తృప్తిగా తింటున్నాడు అత్త‌య్యా అని దీప చెబుతుంది. దానికి సౌంద‌ర్య‌.. నీ మొహం ప‌దా అని వాళ్లిద్ద‌రి ద‌గ్గ‌ర‌కు వెళ‌తారు.

    అక్క‌డ‌కు వెళ్లి.. కార్తీక్ తిన‌డాన్ని చూసి ఇబ్బంది ప‌డే సౌంద‌ర్య‌.. ఒరేయ్ వంశోద్దార‌కా అంటాడు. దానికి కార్తీక్.. మ‌మ్మీ నువ్వా అని అడుగుతాడు. ఇక సౌర్య‌.. అమ్మ మీరు ఎలా వ‌చ్చారు. కారు ఏది అని అడ‌గ్గా.. తాత‌య్య బండి మీద అని దీప చెబుతుంది. దానికి సౌర్య‌.. నాన‌మ్మ‌, తాత‌య్య బండి ఎక్కిందా అని ప్ర‌శ్నిస్తుంది. ఇక సౌంద‌ర్య‌.. ఏంట్రా ఇది ద గ్రేట్ ఇండ‌స్ట్రియ‌లిస్ట్ కొడుకు. సిటీలోనే పేరున్న కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ కార్తీక్ ఇలా రోడ్డు మీద తిన‌డం ఏంటిరా అని అడ‌గ్గా.. బావుంది మమ్మీ టిఫెన్ అని కార్తీక్ అంటాడు. ఇదే దోసె 500 పెట్టి తిన్నా ఇంత మంచి టేస్ట్ ఉండ‌దు. మీరూ తినండి అని చెబుతాడు. ఇక సౌంద‌ర్య‌.. ఆప‌రా. ఎవ‌రైనా చూస్తే ఈ డాక్ట‌ర్‌కి, వాళ్ల ఫ్యామిలీకి చెడిన‌ట్లు ఉంది. అంత పెద్ద ఫ్యామిలీలో టిఫెన్లు స‌రిగా పెట్ట‌ర‌నో ఏదో ఒక‌టి అనుకుంటారు. ఇప్ప‌టికే పేప‌ర్‌కి ఎక్కావు అది చాల‌దా. న‌డ‌వండి ఇంటికి అంటుంది. దానికి కార్తీక్.. అదేంటి మ‌మ్మీ. మారాలి, మారాలి అనేది నువ్వే. మారితే డైజెస్ట్ చేసుకోనిది నువ్వే. నేనేం చేసినా త‌ప్పేనా.. నువ్వు కూడా తిను మమ్మీ అంటాడు.

    దానికి సౌంద‌ర్య‌.. థ్యాంక్స్ నాకంత టైమ్ లేదు. ఇక్కడ నిల‌బ‌డ‌టానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది అంటుంది. దానికి కార్తీక్ నీ ఇష్టం అంటాడు. ఇక కార్తీక్.. ఏయ్ వంట‌ల‌క్క నువ్వు చేసే ఉప్మా కంటే చాలా బెట‌ర్ తింటావా అని అడ‌గ్గా.. దీప హా అని ముందుకు వెళుతుంటుంది. దాంతో సౌంద‌ర్య ఆపగా.. అత్త‌య్య గారికి ఇష్టం లేదు డాక్ట‌ర్ బాబు అని దీప చెబుతుంది. ఇక కార్తీక్.. క‌డుపు నిండేది నీకా.? మీ అత్త‌య్య‌కా..? అని అడుగుతాడు. ఆ త‌రువాత దీప‌ను నువ్వు న‌డ‌వ‌వే. అంద‌రూ క‌లిసి న‌న్ను వీధుల పాలు చేసేలా ఉన్నారు. ఈ రౌడీ బాగా చెడ‌గొడుతుందే నా కొడుకుని. రాత్రి కూడా టెర్ర‌స్‌పైన ప‌క్క వేసుకొని ప‌క్క‌ప‌క్క‌న ప‌డుకొని ప‌క‌ప‌కా న‌వ్వుకున్నార‌ట‌. మీ మామ‌య్య చూసి వ‌చ్చి చెప్పారు అని అంటుంది.

    దానికి కార్తీక్.. వెన్నెల్లో ప‌క్క ప‌రుచుకొని డాబా మీద ప‌డుకొని, చుక్క‌ల్ని, చంద‌మామ‌ను, చ‌ల్లగాలిని ఆస్వాదిస్తూ ఉండొచ్చు అని అంటాడు. ఆ త‌రువాత సౌర్య ప‌క్క‌కు తిరిగి దేనికైనా క‌ళాపోష‌ణ ఉండాలి సుమా అని అంటాడు. ఇక సౌంద‌ర్య‌.. ఈ రౌడీ నిన్ను బాగా ఎడ్యుకేట్ చేసిందిరా. ఇంటికి రావే నీ సంగ‌తి చెబుతా అని అంటుంది. ఇక కార్తీక్.. మ‌ధ్య‌లో అదేం చేసింది. నాకు న‌చ్చింది నేను ఒప్పుకున్నాను. దాని జోలికి వ‌స్తే ఊరుకునేది లేదు. మ‌మ్మీ.. ఎన్ని డ‌బ్బులు, ఎంత బిల్లు కాదు ముఖ్యం. ఇలా తృప్తిగా తిన్నామా లేదా అది ముఖ్యం అని అంటాడు.

    ఇక సౌర్య‌.. విన్నావా అమ్మా డాక్ట‌ర్ బాబుకు న‌చ్చింది. తిన‌మ‌న్న‌ప్పుడు తినొచ్చు క‌దా. నాన‌మ్మ‌కు బాడీగార్డ్‌లా నిల‌బ‌డ‌క‌పోతే అని అంటుంది. దాంతో దీప‌.. నోరు ఊరుతుంది. ఉల్లి దోసె బావుంటుంది. మ‌నం కూడా అని అంటుండ‌గా.. సౌంద‌ర్య ముఖం ప‌చ్చ‌డి అవుతుంది అని అంటుంది. దానికి దీప‌.. అక్క‌ర్లేదు వీళ్లు పెడ‌తారు ప‌చ్చ‌డి అన‌గా.. ఇంటికిరా ఇంత గ‌డ్డి పెడ‌తాను. నీకు అంత ఆక‌లిగా ఉంటే స్టార్ హోట‌ల్‌కి తీసుకెళ‌తాను గానీ ఇక్క‌డ మాత్రం ఇప్పించ‌ను ప‌దా అని సౌంద‌ర్య అంటుంది.

    ఇక సౌర్య‌.. వెళ్లండి వెళ్లండి దేనికైనా అదృష్టం ఉండాలి. గ్రేట్ ఇండ‌స్ట్రియ‌లిస్ట్ డొక్కు స్కూటీ మీద తిర‌గ‌చ్చు కానీ డాక్ట‌ర్ బాబు రోడ్డు ప‌క్క‌న తిన‌కూడ‌దంటా. వెళ్లండి అని అంటుంది. దానికి సౌంద‌ర్య‌.. ఏయ్ స్టుపిడ్ నువ్వు నోర్మూయ్. నువ్వు రావే అని దీప‌ను తీసుకొని వెళుతుంది. ఇక స్కూటీ ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. ఏంటే నీ కూతురు మ‌న‌కు ఫుల్ రివ‌ర్స్‌లో ఉంది అని అంటుంది. దానికి దీప‌.. ఈ మ‌ధ్య లౌక్యం తెలుసుకుందిలే. వంట‌ల‌క్క‌కు తిడితే డాక్ట‌ర్ బాబు హ్యాపీగా ఫీల్ అవుతాడ‌ట అలా ద‌గ్గ‌రైపోయి మా ఇద్ద‌రిని క‌లుపుతుందంట అంటుంది. దానికి సౌంద‌ర్య‌.. చూస్తుంటే ఇది వాడితో ఓ ఇడ్లీ బండి పెట్టిచ్చేలాగా ఉందే అని అక్క‌డి నుంచి వెళ‌తారు. ఇక దీప‌, సౌంద‌ర్య వెళుతుండ‌గా కార్తీక్.. అటు చూడ‌వే. ఈ ల‌వ‌ర్స్ ప‌నికి వ‌స్తారు. జామ్‌గా వెళుతున్నారు అని అంటాడు.

    మ‌రోవైపు ఇంట్లో రెడీ అవుతూ ఉండే మౌనిత‌.. ఏంటి ఎప్పుడూ ఫోన్ చేసినా విష‌యం చెప్పే లాయ‌ర్ సుజాత గారు ఇవాళ విష‌యం చెప్ప‌కుండా అర్జెంట్‌గా వ‌చ్చి క‌ల‌వ‌మ‌న్నారు. ఏమై ఉంటుంది. ఏదైనా గుడ్ న్యూసా..? లేదా హిమను కార్తీక్ ద‌గ్గ‌ర‌కు పంప‌డం కుద‌ర‌ద‌ని బాంబ్ పేలుస్తుందా..? నా ఆశ‌ల‌న్నీ ఈవిడ‌పై పెట్టుకున్నానే. ఆఖ‌రికి విష‌యం చెప్ప‌మ‌ని ఎంత అడిగినా మీరు అర్జెంట్‌గా రండి అని చెప్పిందే త‌ప్ప. ఇదీ విష‌యం అని అస్స‌లు చెప్ప‌లేదు. ఏమై ఉంటుందో అని టెన్ష‌న్ పెరుగుతోంది. ఇక్క‌డే ఉండి టెన్ష‌న్ ప‌డే కంటే త్వ‌ర‌గా అక్క‌డికి వెళ్లి అస‌లు ఎందుకు అర్జెంట్‌గా ర‌మ్మందో క‌నుక్కోవాలి అని లాయ‌ర్ ద‌గ్గ‌ర‌కు బ‌య‌లుదేరుతుంది.

    మ‌రోవైపు కారులో వెళుతుండ‌గా.. సౌర్య, కార్తీక్‌ని చూస్తూ అత‌డితో గ‌డిపిన స‌న్నివేశాల‌ను గుర్తు చేసుకుంటుంది. ఆ త‌రువాత కార్తీక్ కూడా సౌర్య‌.. రెండు రోజులు త‌న‌తో ఉంటాన‌ని అడిగిన స‌న్నివేశాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ త‌రువాత సౌర్య‌.. నాన్న నీకు అక్క‌డ తిన‌డం న‌చ్చిందా..? అని అడుగుతుంది. దానికి కార్తీక్ హూ అంటాడు. బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారా..? అని అడ‌గ్గా.. మ‌ధ్య‌లో ద గ్రేట్ ఇండ‌స్ట్రియ‌లిస్ట్ స్కూటీలో వ‌చ్చి మూడ్ చెడ‌గొట్టిందే అని అంటాడు. ఆ త‌రువాత సౌర్య‌.. వాళ్లు మ‌న కారును ఫాలో అవుతున్నారా నాన్న..? అని అడ‌గ్గా.. అవునే ఈ థాట్ నాకు రాలేదు. ఆ ఇద్ద‌రు క‌లిస్తే గూఢ‌చారి 116 ఏం ప‌నికొస్తుంది చెప్పు. మ‌న‌ల్ని నిజంగానే ఫాలో అవుతున్న‌ట్లు ఉన్నారు అని కార్తీక్ అంటాడు.

    దానికి సౌర్య‌.. ఇదంతా ఆ వంట‌క‌ల్క ప్లాన్ నాన్న‌. నాకు తెలుసు అని అన‌గా.. క‌చ్చితంగా దాని ప్లాన్. మా అమ్మ‌ను తీసుకొచ్చి మ‌రీ తిట్టించింది. హైబ్రో రాక్ష‌సి అని కార్తీక్ చెబుతాడు. దానికి సౌర్య న‌వ్వుతుంది. ఆ త‌రువాత సౌర్య‌... నాన్న ఈసారి మ‌నం హిమ‌ను కూడా తీసుకొచ్చి ఆ బండి ద‌గ్గ‌ర తినిపిద్దామా..? అని అడ‌గ్గా.. ఓ ఎస్ అని కార్తీక్ అంటాడు. ఇక సౌర్య‌.. హిమ కూడా ఎప్పుడూ తిన‌లేదు. త‌నకు బాగా న‌చ్చుతుంది అని చెబుతుంది. ఇక హిమ ఏం చేస్తుందో..? ఎలా ఉందో..? అని అన‌గా.. ఆలోచించ‌డం ఎందుకు నాన్న‌.. వెంట‌నే అమ్మా దీప తాత‌య్య ఇంటికి వెళ్లి చూద్దాం అని సౌర్య చెబుతుంది. ఇప్పుడు అక్క‌డికి ఎందుకు నాకు న‌చ్చ‌దు అని కార్తీక్ అన‌గా.. మ‌రి హిమ ఉన్న‌ది అక్క‌డే క‌దా అని సౌర్య అంటుంది. హిమ‌ను తాత‌య్య వాళ్ల ఇంట్లో ఉంచి, నానమ్మ‌ను స్కూటీ మీద తీసుకెళుతుంది వంట‌ల‌క్క అని సౌర్య చెబుతుంది. దానికి కార్తీక్.. అందుకేనా ఇది ఎంక్వైరీలు చేస్తూ బ‌లాదూర్‌గా తిరుగుతుంది అని మ‌న‌సులో అనుకుంటాడు. ఇక లాయ‌ర్ సుజాత ఇంటికి దీప‌, సౌంద‌ర్య కూడా వెళ‌తారు. కార్తీక్ దీపం కొన‌సాగుతోంది.
    Published by:Manjula S
    First published: