Home /News /movies /

KARTIKA DEEPAM SERIAL HEROINE DEEPA SURPRISE GIFT TO FAN TA

అభిమానికి అదిరిపోయే గిప్ట్ ఇచ్చిన కార్తీక దీపం వంటలక్క.. అవాక్కయిన ఫ్యాన్ ఫ్యామిలీ..

కార్తీక దీపం వంటలక్క (Twitter/Photo)

కార్తీక దీపం వంటలక్క (Twitter/Photo)

కార్తీక దీపం వంటలక్క గురించి తెలుగు టీవీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా ఈమె ఓ అభిమానికి సర్ప్రైజ్ గిప్ట్ అందించి అందరినీ ఆశ్యర్యపరిచింది.

    కార్తీక దీపం వంటలక్క గురించి తెలుగు టీవీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఆమె కార్తీక దీపం రేటింగ్‌ ముందు మిగతా సీరియల్స్ అన్ని దిగదుడుపే. గత రెండేళ్లుగా ఈ సీరియల్ టాప్ రేటింగ్‌లో కొనసాగుతూనే ఉంది. కార్తీక దీపం దూకుడు ఆపే సీరియల్ ఎపుడు వస్తుందో కానీ.. ఇప్పటికైతే.. కార్తీక దీపం సీరియల్ తెలుగులో నెంబర్ వన్ పొజిషన్‌లోనే కొనసాగుతూనే ఉంది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా కార్తీక దీపం వంటలక్క దీప. అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ తన అభిమానికి ఓ సర్ఫ్రైజ్ గిప్ట్ అందించింది.తాజాగా ఓ అభిమాని చేసిన ట్వీట్ కార్తీక దీపం వంటలక్కను బాగా ఆకట్టుకుంది. ఆ ఫ్యాన్ వంటలక్కేను ఏమి కోరకపోయినా.. తన సీరియల్ విషయమై చేసిన రిక్వెస్ట్‌కు ఫిదా అయింది. ఈమె యాక్ట్ చేసిన కార్తీక దీపం టెలికాస్ట్ అవుతున్న సమయంలోనే ఐపీఎల్ ప్రసారం అవుతోంది. ఈ సందర్భంగా సూర్యాపేటకు చెందిన శివచరణ్.. తన ఫ్యామిలీ సీరియల్‌ను మిస్ అవుతున్నారని.. లేకపోతే.. తాను ఐపీఎల్‌ను చూడలేనని చెప్పాడు. తమ ఇంట్లో మరో టీవీ కూడా లేదన్నాడు. కాబట్టి ఐపీఎ టైమ్‌ను మార్చాలంటూ చేసిన ట్వీట్‌ను గంగూలి, స్టార్ మా చెన్నై ఐపీఎల్‌కు ట్యాగ్ చేసిన సంగతి తెలిసిందే కదా.

    అభిమానికి కార్తీక దీపం వంటలక్క సర్ప్రైజ్ గిఫ్ట్ (Twitter/Photo)


    ఐపీఎల్ టైమ్‌ను రాత్రి 8 గంటలకు మార్చాలని ట్విట్టర్ వేదికగా శివ చరణ్ రిక్వెస్ట్ చేసాడు. ఈయన చేసిన ట్వీట్ సరైనదే అంటూ స్టార్ మా కూడా అభిప్రాయపడింది. ఈ విషయం తెలుసుకున్న వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్.. శివచరణ్‌కు ఓ లేఖను రాయడమే కాకుండా... ఆయనక ఇంటికీ 32 ఇంచెస్ టీవీని బహుమతిగా పంపించింది. ట్విట్టర్‌లో మీరు చెప్పిన దానికి ఇంత కంటే గొప్ప పరిష్కారం ఇది ఉండదన్నారు. ఈ బహుమతితో మీ ఇంట్లో కార్తీక దీపం నిరంతరాయంగా వెలుగుతూనే ఉంటుంది. మీ అభిమానం మా పట్ల ఇలాగే ఉండాలని వంటలక్క తన లెటర్‌లో పేర్కొన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Karthika deepam, Premi Viswanath, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు