KARTIKA DEEPAM SERIAL HEROINE DEEPA DO YOU KNOW HOW MUCH REMUNERATION FOR AN EPISODE MK
కార్తీక దీపం వంటలక్క ఒక ఎపిసోడ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ తింటారు...
Image : Star Maa
మళయాళంలో ప్రేమి విశ్వనాథ్ ఒక్కో ఎపిసోడ్ కు రూ.15 వేల వరకూ పారితోషికం అందుకుందని టాక్. అయితే తెలుగులో ఇంత క్రేజ్ సంపాదించిన ప్రేమివిశ్వనాథ్ అలియాస్ దీప అలియాస్ వంటలక్క భారీ మొత్తంలోనే పారితోషికం అందుకుంటోందని టాక్ ఉంది.
తెలుగు సీరియల్స్ లో కార్తీక దీపం ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పవచ్చు. ఈ సీరియల్ దెబ్బతో మిగితా చానెల్స్ వారికి పోటీ పెరిగిందంటే అతిశయోక్తి కాదు. సినిమా హీరోలను మించి అభిమానం ఈ సీరియల్ కేరక్టర్లకు ఉంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న కార్తీకదీపం సీరియల్‌ను పురుషుల్లో సైతం పెద్ద ఎత్తున అభిమానులున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ సీరియల్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రపంచ కప్ లాంటి ఈవెంట్లను సైతం పక్కన పెట్టేసి మహిళా ప్రేక్షకులు ఇంట్లో టీవీ రిమోట్ కంట్రోళ్లను దాచేసి మరీ సీరియల్ ఫాలో అవుతుంటారు. మరి ఇంతలా ఆకట్టుకున్న ఈ సీరియల్‌కు అంత పేరు తెచ్చింది మాత్రం దీప అలియాస్ వంటలక్క కేరక్టర్ అనే చెప్పవచ్చు. దీప, కార్తీక్ మధ్య ఉన్న దాంపత్య బంధమే ఈ సీరియల్ సక్సెస్ అని చెబుతుంటారు. అలాగే వంటలక్క కేరక్టర్ లో ఒదిగిపోయిన ప్రేమి విశ్వనాథ్ పెద్దగా గ్లామరస్ కాకపోయినప్పటికీ ఆమెకు మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మరి అలాంటి వంటలక్క అలియాస్ దీప కేరక్టర్ కు పారితోషికం ఎంత ఇస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే తెలుగు కన్నా ముందే ఈ సీరియల్ మళయాలంలో కారుముత్తు పేరిట ప్రసారమై 7 సంవత్సరాలు నిరాఘాటంగా సాగి ముగిసింది. ఆ సీరియల్ లో సైతం లీడ్ కేరక్టర్ పోషించింది ప్రేమి విశ్వనాథ్యే కావడం విశేషం.
అయితే మళయాళంలో ప్రేమి విశ్వనాథ్ ఒక్కో ఎపిసోడ్ కు రూ.15 వేల వరకూ పారితోషికం అందుకుందని టాక్. అయితే తెలుగులో ఇంత క్రేజ్ సంపాదించిన ప్రేమివిశ్వనాథ్ అలియాస్ దీప అలియాస్ వంటలక్క భారీ మొత్తంలోనే పారితోషికం అందుకుంటోందని టాక్ ఉంది. ముఖ్యంగా తెలుగులో బుల్లితెరపై ఏ ఆర్టిస్ట్ కూడా అందుకోని రేంజులో ప్రేమి విశ్వనాథ్ చార్జ్ చేస్తుందని టాక్. కార్తీక దీపం సీరియల్ కు ఒక్కో ఎపిసోడ్ కు కనీసం 1 లక్ష రూపాయలు ప్రేమి విశ్వనాథ్ వసూలు చేస్తోందట...మరి సీరియల్ మొత్తాన్ని ఒంటి చేత్తో లాగిస్తున్న వంటలక్కకు ఆ మాత్రం ఇవ్వడం న్యాయమే అంటున్నారు ఆమె ఫ్యాన్స్.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.