హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: ద‌టీజ్ మోనిత‌.. సౌంద‌ర్య‌కు మోనిత ఛాలెంజ్.. అదిరిపోయిన సౌర్య ప్లాన్

Karthika Deepam: ద‌టీజ్ మోనిత‌.. సౌంద‌ర్య‌కు మోనిత ఛాలెంజ్.. అదిరిపోయిన సౌర్య ప్లాన్

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో దీప టిఫిన్ సెంట‌ర్‌కి వ‌చ్చిన కొంద‌రు టిఫిన్లు బావున్నాయ‌ని అంటారు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో సౌర్య‌ను ప‌క్క‌కు పిలిచిన హిమ‌.. ఏంటి మీ ఇద్ద‌రు న‌వ్వుకుంటున్నారు అని అడుగుతుంది.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో దీప టిఫిన్ సెంట‌ర్‌కి వ‌చ్చిన కొంద‌రు టిఫిన్లు బావున్నాయ‌ని అంటారు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో సౌర్య‌ను ప‌క్క‌కు పిలిచిన హిమ‌.. ఏంటి మీ ఇద్ద‌రు న‌వ్వుకుంటున్నారు అని అడుగుతుంది. ఇదే నా ఐడియా. ఆవిడ వార‌ణాసికి తెలిసిన ఆవిడ‌. కార్లో వాళ్లు కూడా ఇక్క‌డ‌కు వ‌చ్చి తింటున్నారంటే చూశావా మిగ‌తా కార్లు కూడా ఆగుతున్నాయి అని అప్పుడే వ‌చ్చిన కారును చూపిస్తుంది. అందులో నుంచి ఇద్ద‌రు దిగి తిన‌డానికి వ‌స్తారు. అలా ఒక్కొక్క‌రుగా దీప టిఫిన్ సెంట‌ర్‌కి వ‌స్తుంటారు. అంద‌రూ టిఫిన్లు బావున్నాయ‌ని, త‌క్కువ రేటుకు వ‌స్తున్నాయ‌ని మెచ్చుకుంటుంటారు. ఇక హిమ‌, సౌర్య డ‌బ్బులు తీసుకుంటుంటారు. ఆ త‌రువాత సౌర్య ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన దీప.. అత్త‌మ్మ నీ బుర్రే బుర్ర అని అని మెచ్చుకోగా.. న‌న్ను అత్త‌మ్మ అని పిల‌వొద్దు అని చెప్పానా. మీ అత్త‌మ్మ‌కు బుర్ర‌నే ఉండి ఉంటే ఈపాటికి మన అంద‌రినీ క‌లిపేది అని సౌర్య అంటుంది. ఇక ముగ్గురు డ‌బ్బుల‌ను లెక్కపెడుతూ ఉంటారు.

  మ‌రోవైపు మోనిత ఇంట్లో కార్తీక్ ఉంటాడు. మోనిత మాట్లాడుతూ.. దాదాపు అన్ని హాస్పిట‌ల్స్‌కి దీప‌, పిల్ల‌ల ఫొటోలు పంపాను కార్తీక్. వాళ్లు చిన్నా, చిత‌కా క్లినిక్‌ల‌కు కూడా పంపిస్తారు. వాళ్ల‌కు ఏ జ‌లుబో, జ్వ‌రం వ‌చ్చి హాస్పిటల్‌కి వెళ్లినా ఈజీగా దొరికిపోతారు. నాకు తెలిసిన ఫార్మాసిటిక‌ల్స్ రెప్ర‌జెంటిటీవ్‌కి కూడా ఇన్ఫార్మ్ చేశాను. వారి ద‌గ్గ‌ర కూడా అంద‌రి ఫొటోలు ఉంటాయి అని అన‌గా.. నిజంగా గుడ్ ఐడియా. వాళ్ల‌ను వెతికిప‌ట్టుకోవ‌డానికి ఇదొక మంచి దారి. వెళ్లే ముందు రౌడీకి జ‌లుబు చేసింది. కొత్త ప్లేస్, కొత్త వాతావ‌రణం, కొత్త నీళ్ల వ‌ల‌న ఆ జ‌లుబు ఎక్కువై ఇన్ఫెక్ష‌న్ రావొచ్చు అని కార్తీక్ అంటాడు. వెంట‌నే మోనిత‌.. ఆ రౌడీ ట్యాబ్లెట్లు వేసుకొనే ర‌కం కాదు. నాలాగే మొండిది. మ‌హా అయితే ఆవిరి ప‌డుతుందేమో అని అన‌గా.. హిమ అడ్ర‌స్ తెలిశాక రౌడీని కూడా తెచ్చేసుకుందాం మోనిత అని కార్తీక్ అంటాడు. దాంతో కాస్త ఇబ్బందిప‌డుతూనే నీ ఇష్టం నువ్వు ఏదంటే అదే. దీప త‌ప్ప నీతో ఎవ‌రు ఉన్నా నాకేం అభ్యంత‌రం లేదు. మ‌నం ఇద్ద‌రం. మ‌న‌కు ఇద్ద‌రు అని న‌వ్వుతూ ఉంటుంది. ఆ త‌రువాత కార్తీక్ ఏం రెస్పాండ్ అవ్వ‌క‌పోగా.. ఏం నీకు న‌వ్వు రాలేదా అని అడ‌గ్గా...నాకు పిల్ల‌ల మీద బెంగ ఎక్కువ అయ్యింది అని అంటాడు. వెంట‌నే మోనిత‌.. ఏం కాదు నేను ఉన్నాను క‌దా. ఈ విష‌యంలో నీకు అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తాను. ఒక్కోసారి నువ్వు మ‌రీ చిన్న పిల్లోడిలా ఆలోచిస్తావు అని న‌వ్వుతూ కార్తీక్ మీద చెయ్యి వేస్తుంది. అదే స‌మ‌యానికి సౌంద‌ర్య ఆ ఇంటికి వ‌స్తుంది.

  ఇద్ద‌రు ఆమెను చూడ‌గా.. న‌వ్వ‌డం పూర్తి అయితే లోప‌లికి వ‌స్తాను అని సౌంద‌ర్య అంటుంది. ఆ త‌రువాత న‌వ్వ‌డం ఆగిపోయిందా అని వారి వ‌ద్ద‌కు వెళుతుంది. డిస్ట‌ర్బ్ చేసిన‌ట్లు ఉన్నాను అని సౌంద‌ర్య అన‌గా.. నో ప్రాబ్ల‌మ్ మ‌మ్మీ. రేప‌టి రోజున హిమ‌ను నువ్వు కాకుండా మోనిత తీసుకొస్తే మ‌మ్మ‌ల్ని చూడ‌టానికి నువ్వు ఇక్క‌డికే రావాలి క‌దా అని కార్తీక్ అంటాడు. దాంతో మోనిత సంతోషప‌డుతూ ఉంటుంది. ఇక సౌంద‌ర్య‌.. ఓహ్. ఫ్యూచ‌ర్ ప్లానింగ్స్ చాలా ఉన్న‌ట్లు ఉన్నాయి సుపుత్ర‌. గుడ్. ఆ మాత్రం భ‌విష్య‌త్ గురించిన అంచ‌నాలు మ‌నిషికి ఉండాలి అని అంటుంది. దానికి కార్తీక్ మ‌న‌సులో.. నేను ధైర్యం చేసి ఇక్క‌డే ఉంటాను అని చెప్పినా నువ్వు మాత్రం హిమ ఆచూకీ చెప్ప‌వేంటి మ‌మ్మీ అని అనుకుంటాడు. ఇక సౌంద‌ర్య మాట్లాడుతూ.. భ‌విష్య‌త్ ప్రణాళిక గురించి మ‌నం ఇంటి ద‌గ్గ‌ర తీరిగ్గా చ‌ర్చించుకుందాం గానీ నువ్వు కొంచెం బ‌య‌ట‌కు వెళ‌తావా నాన్న‌. నేను మోనిత‌తో మాట్లాడాలి అని అంటుంది.

  దానికి కార్తీక్ రివాల్వ‌ర్ తీసుకొచ్చావా మ‌మ్మీ అని అడ‌గ్గా.. మార‌ణాయుధాలు మోసుకొని తిర‌గ‌డం మానేసి చాలా కాలం అయ్యింది నాన్న‌. పిచ్చుక‌ల మీద బ్రహ్మాస్త్రాలు వేసేంత స‌మ‌యం నాకు లేదు అని సౌంద‌ర్య అంటుంది. మ‌రి న‌న్ను బ‌య‌ట‌కు పంప‌మంటున్నావేంటి మ‌మ్మీ అనగా.. ఇప్ప‌టికిప్పుడు ఉన్న‌ప‌ళంగా నేను మోనిత చాచి పెట్టి కొట్ట‌డం గానీ, జుట్టుప‌ట్టుకొని నేల మీద‌కు నెట్టేయం గానీ ఇలాంటివి ఏవీ చేయ‌న‌ని నీకు మాటిస్తున్నాను. నువ్వు ప్ర‌శాంతంగా హాస్పిట‌ల్ వెళ్లు. అంబులెన్స్ పంపాల్సిన అవ‌స‌రం కూడా రానివ్వ‌ను. ప్రామిస్ అని సౌంద‌ర్య అంటుంది. ఇక కార్తీక్‌ని ప‌ట్టుకున్న మోనిత‌.. వెళ్లొద్దు కార్తీక్. నువ్వు ఇక్క‌డే ఉండు. నాకు భ‌యంగా ఉంది అని అంటుంది. వెంట‌నే సౌంద‌ర్య‌.. ద‌రిద్రం ప‌ట్టుకున్న‌ట్లు అలా ప‌ట్టుకున్నావేంటి మోనిత. ఓవ‌రాక్ష‌న్ ఆపి వ‌దులు. కూల్, ఎందుకు అలా భ‌య‌ప‌డిన‌ట్లు న‌టిస్తున్నావు. నువ్వు వెళ్లు నాన్న అని సౌంద‌ర్య అంటుంది. ఏం జ‌రుగుతుందో తెలుసుకోవ‌చ్చా అని కార్తీక్ అడ‌గ్గా..జ‌రిగిన త‌రువాత ఎలాగో ఫ‌స్ట్ కాల్ నీకే చేస్తుంది గానీ ఎందుకు తొంద‌ర. వెళ్లు అని సౌంద‌ర్య చెప్ప‌గా.. కార్తీక్ బ‌య‌ట‌కు వెళ‌తాడు.

  ఇక మోనిత సోఫాలో కూర్చోగా.. సౌంద‌ర్య మాట్లాడుతూ.. ఆడవాళ్లు వ‌స్తే కూర్చొని చెప్పే సంప్రదాయం మీ ఇంట వంట లేద‌నుకుంటా. నో ప్రాబ్ల‌మ్ అని కూర్చుంటుంది. మోనిత మాట్లాడుతూ.. ఏదో కాళ్ల‌బేరానికో, రాయ‌బారానికో వ‌చ్చిన‌ట్లు ఉన్నారు అని అన‌గా.. నేను వ‌శుదేవుడిని కాదు. నువ్వు గాడిదవు కాదు. కాళ్ల బేరానికి రావ‌డానికి. ఇక రాయ‌బారానికి రావ‌డానికి రాజ్యాల మ‌ధ్య యుద్దాలేం జ‌ర‌గ‌లేదు క‌దా అని సౌంద‌ర్య అంటుంది. మ‌రి నా ఇంటిని వెతుక్కుంటూ ఎందుకు వ‌చ్చిన‌ట్లో అని మోనిత అన‌గా.. మీ ఇంట్లో ఒక పంచ‌వ‌న్నెల చిలక ఉండేది. అదే హీరోయిన్ పేరును త‌గ‌లించుకున్న ప‌నిమ‌నిషి. ప్రియ‌మ‌ణి. ఉందా అని సౌంద‌ర్య అడుగుతుంది. ఎందుకు అది మార్కెట్‌కి వెళ్లింది. అయినా ఏ రోజు అయినా మీ ఇంటికి వ‌స్తే నాకు కాఫీ ఆఫ‌ర్ చేశారా. కాఫీలు, గ‌ట్రా ఇచ్చే సంప్ర‌దాయం మా ఇంటా వంటా లేదు అని మోనిత అన‌గా.. నువ్వు ఒక ఆడ‌దానివి అయితేనే క‌దా. సంప్ర‌దాయాల గురించి తెలిసేది. కూల్‌గా మాట్లాడుకోవ‌డానికి ముందు కాఫీ తాగుదాం అనుకున్నాను. కానీ నువ్వు మ‌గ‌వారికి మందు పోయడం త‌ప్ప ఆడ‌వారిని కాఫీ ఇవ్వ‌వ‌ని అర్థ‌మైంది. నీతో కూడా మాట్లాడాల్సి రావ‌డం అన్న‌ది సౌంద‌ర్య జీవితంలో దుర్దినం. దుర్దినం అనేశా అయినా ప‌ర్వాలేదు. నా కోడ‌లి కోసం త‌ప్ప‌డం లేదు అని సౌంద‌ర్య అంటుంది.

  వ‌చ్చిన ప‌నేంటో చెప్పండి నాకు టైమ్ లేదు అని మోనిత అన‌గా.. నా కోడ‌లు నీలాగా కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ దానికి. నా కోడ‌లు నీలాగా ఉండ‌దు. మూర్తీభ‌వించిన స్త్రీత్వం దానిలో తొణికిస‌లాడుతూ ఉంటుంది. నా కోడలు నీలాగా చంచ‌లంగా ఉండ‌దు. స్థిరంగా,నిర్మ‌లంగా, ఆత్మ‌సౌంద‌ర్యంతో అల‌లారుతూ ఉంటుంది. ఎందుకు నా కోడ‌లి గుణ‌గ‌ణాలు చెబుతున్నానంటే ఒక ఆడ‌దానికి ఉండాల్సిన ల‌క్ష‌ణాలు నీలో అణువంత కూడా ఉండ‌వ‌ని. అయినా నీతో మాట్లాడ‌టానికి వ‌చ్చాను. నువ్వేదో కార్తీక్ బ‌ల‌హీన‌త‌ను అడ్డం పెట్టుకున్నావు. హిమ‌ను వెతికి తీసుకొస్తే పెళ్లి చేసుకోవ‌డానికి కార్తీక్ ఒప్పుకునేంత‌లా మార్చేశావు. నువ్వు ఎందుకు అన‌వ‌స‌రంగా ప్ర‌యాస ప‌డ‌తావు. నీకు ఈ జీవితంలో పెళ్లే జ‌ర‌గ‌దు. హిమ నీకు అస్స‌లు దొర‌క‌నే దొర‌క‌దు. నా కోడ‌ళ్ల‌ను, మ‌న‌వ‌రాళ్ల‌ను వెత‌క‌డానికి ఆ ముగ్గురి వెన‌కాల జ‌న‌స‌ముద్ర‌మే ఉంది. అది నీకు తెలీక నీ స్వ‌లాభం కోసం హిమ‌ను మాత్ర‌మే తీసుకొస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌ల‌క‌కు అని సౌంద‌ర్య అంటుంది. వెంట‌నే మోనిత‌.. అదేంటి అత్త‌గారు. మీకు క‌లిసి వ‌చ్చే కాలానికి న‌డిచొచ్చే కోడ‌లు వ‌స్తానంటే వ‌ద్దాంటారేంటి అని అన‌గా.. మా ఇంటికి నేను ద‌రిద్రాన్ని బొట్టుపెట్టి, హార‌తి ఇచ్చి ఆహ్వానిస్తాన‌ని నువ్వు ఎలా అనుకున్నావు అని సౌంద‌ర్య అంటుంది.

  దానికి మోనిత‌.. ద‌రిద్రం పోయింది. సౌభాగ్యం వ‌స్తుంది. మోనిత వెన‌కాల కూడా బోలెడంత ఆస్తి ఉంది. అయినా మీరు బొట్టు పెట్టి, హార‌తి ఇచ్చి ఆహ్వానించ‌డానికి మేము పెళ్లి చేసుకొని మీ ఇంటికి వ‌స్తే క‌దా. మా ఇంట్లో కూడా బొట్టు పెట్టి హార‌తి ఇవ్వ‌డానికి పంచ‌వ‌న్నెల చిల‌క ప్రియ‌మ‌ణి సిద్ధంగా ఉంటుంది అని అంటుంది. వెంట‌నే సౌంద‌ర్య‌.. స‌రే. నువ్వు ఆ పంచ‌రంగుల క‌ల‌లు కంటూనే ఉండు. కాద‌న‌డం లేదు. కానీ ఆ క‌ల‌లు క‌ల్ల‌లు అవుతాయ‌ని కాస్త మెంట‌ల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండు. మామూలుగా అయితే ఈ సౌంద‌ర్య నిన్ను అత్యంత దారుణంగా, అత్యంత హీనంగా దండించి, దూషించి, వార్నింగ్ ఇచ్చి వెళ్లాలి. కానీ నా కొడుకుకు నిన్ను కొట్ట‌న‌ని, తిట్ట‌న‌ని మాటిచ్చాను. మాట మీద నిల‌బ‌డే వంశం కదా మాది అని అంటుంది. ఇక మోనిత‌.. అది కాదండి కార‌ణం. మీరు హిమ‌ను వెతికి ప‌ట్టుకోలేరు అది కార‌ణం అని అంటుంది. వెంట‌నే సౌంద‌ర్య‌.. నువ్వు వైద్య వృత్తి మానేసి జ్యోతిష్య శాస్త్రం అధ్యయనం చేయ‌డం ఎప్పుడు మొద‌లు పెట్టావు అని అడ‌గ్గా.. పోనీ మీరే వెతికి ప‌ట్టుకోండి. మీ భ‌యం నాకు అర్థ‌మైంది. మీ అబ్బాయి మా పెళ్లి ముహూర్తం గురించి మీతో ముచ్చ‌టించిన‌ప్ప‌టి నుంచి ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి మీకు. మ‌రి మీరు వెతికి తీసుకొస్తానంటే నాకు కూడా చెమ‌ట‌లు ప‌ట్టాలి క‌దా. నేను ఇంత రిలాక్స్‌డ్‌గా ఎందుకు ఉన్నానో ఆలోచించండి. ద‌టీజ్ మోనిత‌. నా కాలుక్యేష‌న్స్ నాకు ఉన్నాయి, నా ప్లాన్స్ నాకు ఉన్నాయి. నా జీవితంలో కార్తీక్ తొలిసారిగా మ‌న‌స్ఫూర్తిగా మంచి ఆఫ‌ర్ ఇచ్చాడు. దాని నేను ఎందుకు యుటిలైజ్ చేసుకోకూడ‌దో చెప్పండి అని మోనిత‌ అంటుంది.

  వెంట‌నే సౌంద‌ర్య‌.. నేను నీ సోదినీ విన‌డానికి రాలేదు. నీ వృధా ప్ర‌యాస మానుకోమ‌ని హెచ్చ‌రించడానికి వ‌చ్చాను అని అన‌గా.. మీరు హెచ్చ‌రించ‌డానికి వ‌స్తే నేను దీన్నొక స‌వాల్‌గా స్వీక‌రించ‌డానికి సిద్ధంగా ఉన్నాను. వెల్ ప్రిపేర్డ్‌. ఇవాళ్టి నుంచి మీకు, నాకు మ‌ధ్య వార్ మొద‌లైంది. వార్‌లో వ‌న్‌సైడే గెలుపు. ఆ గెలుపు మీదా, నాదా అన్న‌ది తేల్చుకుందాం అని మోనిత అంటుంది. అదే స‌మ‌యానికి లోప‌లికి ప్రియ‌మ‌ణి వ‌స్తుండ‌గా ఆమెను చూసిన మోనిత‌.. రావే పంచ‌వ‌న్నెల చిల‌క‌. మేడ‌మ్‌కి మంచినీళ్లు ఇవ్వు. టీలు, కాఫీలు గ‌ట్రా ఇవ్వ‌కే. ఆడ‌వారికి మ‌ర్యాద‌లు చేసే సంప్ర‌దాయం మ‌న ఇంటా, వంటా లేదు. వెళ్లు అని చెబుతుంది. ఆ త‌రువాత సోఫాలో నుంచి లేచి మోనిత‌.. వ‌స్తాన‌త్తా. నాకు నా భ‌విష్య‌త్ ప్రణాళిక‌లు. నిర్మాణాత్మ‌కమైన ప‌నులు చాలా ఉన్నాయి. ఉంటాను అని బ‌య‌ట‌కు వెళుతుంది. ఇక ప్రియ‌మ‌ణి నీళ్లు తీసుకురాగా.. సౌంద‌ర్య అక్క‌డి నుంచి కోపంగా వెళుతుంది.

  మ‌రోవైపు రాత్రి వార‌ణాసి, దీప‌, హిమ‌, సౌర్య డబ్బులు కౌంట్ చేస్తూ ఉంటారు. అక్క‌డ‌కు ఒక ఆవిడ వ‌చ్చి.. పిల్ల‌లు ఎంత ముద్దు వ‌స్తున్నారో. ఎంత అదృష్ట‌వంతురాలివ‌మ్మా నీకు ర‌త్రాలలాంటి పిల్ల‌లు పుట్టారు. కొత్త‌గా వ‌చ్చారా. ఇంత‌కు ముందు ఈ బండి లేదే. నేను గుళ్లో మూడురోజులు సేవ చేసుకొని ఇవాళే వ‌చ్చాన‌మ్మా. అందుకే చూడ‌లేదు అని అంటుంది. మీరు అని దీప అడ‌గ్గా.. నా పేరు చెప్ప‌లేదు క‌దా. నా పేరు సంతాన ల‌క్ష్మి అంటార‌మ్మా. మా ఆయ‌న ముద్దుగా సంతానం అంటారు. మా ఆయ‌న గ‌వ‌ర్న్‌మెంట్ ఆఫీస‌ర్. ఈ ప‌క్క‌నే మా ఇల్లు. మీరు కొత్త‌గా వ‌చ్చిన‌ట్లు ఉన్నారు. ఏ ఊరు నుంచ‌మ్మా అని అడ‌గ్గా.. మా ఊరు నుంచి అని సౌర్య చెబుతుంది. మీ ఊరు నుంచే లేవే. అదే ఏ ఊరు అని సంతాన‌ల‌క్ష్మి అడ‌గ్గా.. పొట్ట‌చేత‌న ప‌ట్టుకొని తిరిగే వాళ్లం. ఒక ఊర‌ని ఏముంటుంది లేమ్మా అని దీప అంటుంది. అమ్మా అన‌క‌మ్మా. నా గుండెల్లో కెలికిన‌ట్లు ఉంటుంది. పెళ్లై మూడేళ్లు అయినా నాకు పిల్ల‌లు పుట్ట‌లేదు. డాక్ట‌ర్లు చేతులు ఎత్తేశారు. దీవించాల్సిన వాళ్లు చేతులు దించేశారు. అయినా ఆశ చావ‌క పూజ‌లు, మొక్కులు అంటూ అన్ని దేవాల‌యాలు తిరుగుతూనే ఉన్నాను. నీ పిల్ల‌లు నిజంగా ర‌త్నాలులా ఉన్నారు. కంటే ఇలాంటి పిల్ల‌ల‌ను కనాలి అని సంతాన‌ల‌క్ష్మి అంటుంది. ఆ తరువాత నీ పేరేంటి అని సౌర్య‌ను అడ‌గ్గా.. రౌడీ అని చెబుతుంది. అదేం పేరే అని సంతాన‌ల‌క్ష్మి అడ‌గ్గా.. మా నాన్న అలానే పిలుస్తాడు అని చెబుతుంది. దానికి సంతాన‌ల‌క్ష్మి.. అవునా. పిల్ల అచ్చం వాళ్ల నాన్న పోలికా అని అడ‌గ్గా.. మా నాన‌మ్మ పోలిక అని సౌర్య చెబుతుంది. ఇక సంతాన‌ల‌క్ష్మి.. నీ బుగ్గ‌లు ఎంత బావున్నాయి. అచ్చం చిన్న‌ప్పటి శ్రీదేవీలా ఉన్నావు అని అంటుంది. ఇక నీ పేరేంటి అని హిమ‌ను అడ‌గ్గా.. బంగారం అని చెబుతుంది. బంగార‌మా అదేం పేరే అని సంతాన‌ల‌క్ష్మి అన‌గా.. మా నాన్న అలానే పిలుస్తాడు అని చెబుతుంది.

  ఇక సంతాన‌ల‌క్ష్మి.. నాన్న‌, నాన్న అంటున్నారు. ఏరీ మీ నాన్న అని సంతాన‌ల‌క్ష్మి అడ‌గ్గా.. దీప ఇబ్బందికి గురి అవుతూ ఉంటుంది. వెంట‌నే సంతాన‌ల‌క్ష్మి.. నేను వేయ‌కూడ‌ని ప్ర‌శ్న వేసిన‌ట్లు ఉన్నాను. అంటే.. టిఫిన్ సెంట‌ర్ పేరు నాన్న అని పేరు పెట్టాను క‌ద‌మ్మా. అందుకే అడిగాను. నేను అనే కాదు. రేపు ఇక్క‌డ టిఫిన్ చేసే వాళ్లు కూడా ఇదే ప్ర‌శ్న‌ను వేస్తే ఏం జ‌వాబు చెబుతార‌మ్మా. ఆలోచించండి. వ‌స్తాను అని పిల్ల‌ల‌ను ముద్దుచేసి వెళుతుంది. ఇక దీప కోపంగా.. నాన్న ఒక్క‌డే ఉంటాడు అనాథ‌లాగా అన్నావు. నాన్న అక్క‌డే ఉంటాడు. మ‌న‌ల్నే అనాథ‌లుగా వ‌దిలేసి అని అంటుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  ఉత్తమ కథలు