Home /News /movies /

Raja Vikramarka trailer: ‘రాజా విక్రమార్క’ ట్రైలర్ విడుదల.. దివాళీ బాగా గ్రాండ్‌గానే ప్లాన్ చేసారుగా..!

Raja Vikramarka trailer: ‘రాజా విక్రమార్క’ ట్రైలర్ విడుదల.. దివాళీ బాగా గ్రాండ్‌గానే ప్లాన్ చేసారుగా..!

రాజా విక్రమార్క ట్రైలర్ (raja vikramarka trailer)

రాజా విక్రమార్క ట్రైలర్ (raja vikramarka trailer)

Raja Vikramarka trailer: చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన అలనాటి సినిమా టైటిల్ ‘రాజా విక్రమార్క’ (Raja Vikramarka trailer) టైటిల్‌తో కొత్త సినిమా చేసాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ఈ సినిమాపై ఆసక్తి రేకిత్తించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి రేకిత్తించేలా ఉంది.

ఇంకా చదవండి ...
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ‘ప్రేమతో మీ కార్తీక్’ సినిమాతో పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ (Karthikeya Gummakonda).. ఆ తర్వాత అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘RX100’ మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి వావ్ అనిపించాడు. ఆ తర్వాత తెలుగులో ‘హిప్పి’, ‘గుణ 369’, 90 ML, చావు కవురు చల్లగా వంటి సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా చిరంజీవి హీరోగా నటించిన అలనాటి సినిమా టైటిల్ ‘రాజా విక్రమార్క’ టైటిల్‌తో కొత్త సినిమా చేసాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ఈ సినిమాపై ఆసక్తి రేకిత్తించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి రేకిత్తించేలా ఉంది. ఈ సినిమాలో కార్తికేయ ‘NIA’ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలోని సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కార్తికేయ ఒదిగిపోయారు. తనికెళ్ల భరణితో కార్తికేయ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అనుకోకుండా కార్తికేయ చేతిలో రివాల్వర్ పేలుతోంది. అక్కడ్నుంచే ట్రైలర్ మొదలవుతుంది. టీజర్ కూడా అక్కడ్నుంచే మొదలైంది. గన్ పేలిన వెంటనే తనికెళ్ల భరణిని ఉద్దేశిస్తూ చూసుకోలేదు బాబాయి అంటాడు. దానికి తనికెళ్ల భరణి.. ఏదో కాలు తొక్కినంత ఈజీగా చెప్పావు అంటారు. మార్నింగ్ కశ్మీర్‌లో మిలిటెంట్స్‌కు దొరికిపోయి.. రాత్రి సెకండ్ షోకు ఢిల్లికి వచ్చాడని హీరో గురించి తనికెళ్ల భరణి చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

Bigg Boss 5 Telugu 9th Week Nominations: బిగ్ బాస్ 5 తెలుగు వీక్ 9 నామినేషన్స్.. కెప్టెన్ షణ్ముఖ్ తప్ప అందరూ..!


Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్‌కు నాగార్జున ముందే ఐ లవ్ యూ చెప్పిన హీరోయిన్..


ఈ సినిమాలో కార్తికేయ.. ఏజెండ్ విక్రమ్.. అదే ’రాజా విక్రమార్క’ పాత్రలో  అలరించనున్నాడు. మొత్తంగా డబుల్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్టు ట్రైలర్‌లో చూపించారు.   ట్రైలర్ అంతా కామెడీతో పాటు సీరియస్‌గానూ సాగింది. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి.

Samantha - Gay Marriage: ‘గే’ మ్యారేజ్‌కు సమంత సపోర్ట్.. ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటుంది..!


‘రాజా విక్రమార్క’ సినిమాను రామారెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీ సరిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కార్తికేయకు జెడిగా తాన్య రవిచంద్రన్ నటిస్తుంది. ఈ చిత్రంలో కార్తికేయ యాక్షన్‌తో పాటు కామెడీని ట్రై చేసాడు. నవంబర్ 12న విడుదల కానుంది రాజా విక్రమార్క. మొత్తంగా ‘రాజా విక్రమార్క’ గా కార్తికేయ సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Raja Vikramarka, RX 100 Fame Karthikeya, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు