హోమ్ /వార్తలు /సినిమా /

లక్కీ లక్ష్మణ్ పాటను విడుదల చేసిన కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి..!

లక్కీ లక్ష్మణ్ పాటను విడుదల చేసిన కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి..!

లక్కీ లక్ష్మణ్ పాట విడుదల చేసిన డైరెక్టర్ చందు మొండేటి

లక్కీ లక్ష్మణ్ పాట విడుదల చేసిన డైరెక్టర్ చందు మొండేటి

దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో, హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    ‘లక్కీ లక్ష్మణ్‌’ సినిమాలో ఓ పాటను కార్తికేయ 2 డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు.  చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’. దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో, హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ సందర్బంగా ఈ సినిమాలోని "ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే..’ సాంగ్ ను కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు. అంటూ హీరోయిన్ కు సారీ చెప్పడానికి తన వెంటపడే లవ్ సాంగ్ చాలా క్లాసీ గా ఇంట్రెస్ట్ గా ఉంది. బిగ్ బాస్ తరువాత హీరోగా నటిస్తున్న సోహైల్ సింపుల్ స్టెప్స్ తో వేసిన డ్యాన్స్ చాలా ఈజ్ గా ఉంది. ఈ పాటను ప్రముఖ రచయిత భాస్కరపట్ల రాశారు. సింగర్ అనురాగ్ కులకర్ణి చ‌క్క‌గా ఆలపించారు. ఈ పాటకు విశాల్ అందించిన కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. డి ఓ పి ఆండ్రు చక్కటి విజువల్స్ ఇచ్చారు.

    టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ పాటలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నుంచి వస్తున్న “ఓ మేరీ జాన్” మరో క్రేజీ సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రేక్షకులనుండి హ్యుజ్ రెస్పాన్స్ వస్తోంది. టిప్స్ ఆడియో ద్వారా విడుదలైన పాటలన్నీ కూడా ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తాయి. ఇక  సినిమాలో సోహెల్, మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, రచ్చ రవి , జబర్దస్త్ కార్తిక్, జబర్దస్త్ గీతు రాయల్, కామెడీ స్టార్స్ ఫేమ్ యాదం రాజు తదితరులు నటించారు.

    Published by:Sultana Shaik
    First published:

    Tags: Karthikeya 2 Movie, Tollywood

    ఉత్తమ కథలు