Home /News /movies /

KARTHIKEYA 2 NORTH INDIANS MOVIE LOVERS REQUESTING TO INCREASE NIKHIL KARTHIKEYA MOVIE SHOWS IN HINDI REGION SK

Karthikeya 2: నార్త్‌ని ఊపేస్తున్న కార్తికేయ-2.. హిందీలో షోలు పెంచాలని విజ్ఞప్తుల వెల్లువ

Karthikeya 2 Twitter Review  Photo : Twitter

Karthikeya 2 Twitter Review Photo : Twitter

Karthikeya-2: కార్తికేయ-2 సినిమాకు హిట్ టాక్ రావడంతో హిందీ రీజియన్లో డిమాండ్ పెరిగింది. తెరపై నిఖిల్ మ్యాజిక్‌ను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. తమ రాష్ట్రాల్లో కార్తికేయ-2 హిందీ వర్షన్ షోలను పెంచాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    శనివారం విడుదలైన కార్తికేయ-2 (Karthikeya 2) మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. సినిమా టీజర్, ట్రైలర్ నుంచే ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే తెరపై కార్తికేయ టీమ్ మ్యాజిక్ చేసిందని రిపోర్టులు వస్తున్నాయి. మైథలాజికల్ అడ్వెంచరస్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆడియెన్స్‌ని అట్రాక్ట్ చేస్తోందని రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం మార్నింగ్ షో ముగిసిన తర్వాత.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు (Karthikeya Review) రావడంతో... తర్వాతి షోలకు బుకింగ్స్ పెరిగిపోయాయి. మౌత్ టాక్‌తోనే మూవీ లవర్స్ థియేటర్‌లకు క్యూకడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అంతటా కార్తికేయ-2 థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఆదివారం టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్మాడయ్యాయి. మొదటి రోజులు షోలు తక్కువగానే ఉన్నప్పటికీ కలెక్షన్‌లు బాగానే రాబట్టింది. షోలు పెరగడం, ప్రేక్షకులు పెరగడంతో.. ఇవాళ్టి నుంచి బాక్సాఫీస్ షేకవుతుందని... కలెక్షన్‌లు భారీగా పెరిగే అవకాశముందని అంచనాలున్నాయి.

    అనుపమకు బంపర్ ఆఫర్.. బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌లో ఛాన్స్..

    తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్‌లో కార్తీకేయ దూసుకెళ్తున్నాడు. హిందీలో కూడా భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఐతే శనివారం హిందీలో కార్తికేయ-2 మూవీ కేవలం 50 షోలకే పరిమితమైంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో హిందీ రీజియన్లో డిమాండ్ పెరిగింది. తెరపై నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddarth) మ్యాజిక్‌ను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. తమ రాష్ట్రాల్లో కార్తికేయ-2 హిందీ వర్షన్ షోలను పెంచాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం హిందీలో కార్తికేయ షోలను 150కి పెంచారు.










    ప్రేక్షకుల నుంచి డిమాండ్ పెరగడంతో నిఖిల్ కూడా స్పందించారు. హిందీలో తమ మూవీ షోలను పెంచాలని పీవీఆర్, ఐనాక్స్ మూవీస్‌కి విజ్ఞప్తి చేశారు.





    ద్వారక విశిష్టతతో పాటు కృష్టతత్వాన్ని దర్శకుడు చందూ మొండేటి అద్భుతంగా తెరకెక్కించారనే టాక్ రావడంతో గుజరాత్‌తో పాటు యూపీ, బీహార్‌లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే షోలను పెంచాలని ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. భారత సంప్రదాయాలు, సంస్కృతిని గొప్పగా చూపించే.. ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Karthikeya 2 Movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు