Home /News /movies /

KARTHIKEYA 2 NEW RELEASE DATE UPDATE SB

Karthikeya 2: కార్తీకేయ2 కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!

కార్తికేయ 2 మోషన్ పోస్టర్ విడుదల (Twitter/Photo)

కార్తికేయ 2 మోషన్ పోస్టర్ విడుదల (Twitter/Photo)

కార్తీకేయ2 సినిమా జూలై 22న విడుదల కావాల్సి ఉంది.అయితే ఇదే రోజు.. నాగచైతన్య థాంక్యూ సినిమా విడుదల అవుతుండటంతో.. దిల్ రాజు రిక్వెస్ట్ మేరకు... కార్తీకేయ 2 టీం తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు.

    యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ... అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన  సినిమా 'కార్తికేయ2'. కొన్నేళ్లక్రితం వచ్చిన 'కార్తికేయ' సినిమాకి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను.. చందు మొండేటి డైరెక్ట్  చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా  విడుదల విషయంలో గత కొన్నిరోజులుగా సస్పెన్స్ కొనసాగుతంది. వాస్తవానికి కార్తీకేయ2ను జూలై 22న విడుదల చేయాల్సి ఉంది. అయితే నాగచైతన్య నటంచిన 'థాంక్యూ' అదే రోజున వస్తుండడంతో నిర్మాత దిల్ రాజు.. 'కార్తికేయ2' టీమ్ ని కన్విన్స్ చేసి సినిమాను వాయిదా వేసేలా చేశారు.

    ఆ తరువాత నిఖిల్ అండ్ కో ఆగస్టు 5న సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అదే సమయానికి కళ్యాణ్ రామ్ 'బింబిసార' రిలీజ్ కానుంది. రెండు ఫాంటసీ స్టోరీలు కావడంతో ఇప్పుడు 'కార్తికేయ2'ని ఆగస్టు సెకండ్ వీక్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆగస్టు 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే అదే వారంలో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నిఖిల్ ఇన్ని వాయిదాలు వేసుకున్నా.. అతడికి సోలో రిలీజ్ అయితే దక్కడం లేదు.



    ఆగస్టు 12న నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' కూడా రిలీజ్ కాబోతుంది. ఇదొక పొలిటికల్ యాక్షన్ డ్రామా. నితిన్ సొంత బ్యానర్ పై దీన్ని తెరకెక్కించారు. చాలా రోజుల క్రితమే నితిన్ తన సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వెనుకడుగు వేసే ఛాన్సే లేదు. దీంతో ఇప్పుడు నిఖిల్, నితిన్ ల మధ్య బాక్సాఫీస్ పోరుకి రంగం సిద్ధమవుతోంది. అయితే రెండూ వేర్వేరు జోనర్స్ కాబట్టి ఆడియన్స్ రెండు సినిమాలను చూడడానికి ఆసక్తి చూపుతారు. కానీ థియేటర్లు, ఓపెనింగ్స్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది.

    మరోవైపు ఇటీవలే కార్తీకేయ 2 సినిమా టీంకు అరుదైన గౌరవం లభించింది. కార్తికేయ 2 చిత్రం శ్రీ కృష్ణుడి తత్వం, ఆయన బోధించిన ఫిలాసఫీ ఆధారంగా వస్తుందని.. టీజర్, మోషన్ పోస్టర్‌ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా కార్తికేయ 2 చిత్రయూనిట్‌కు ఇస్కాన్ అత్యున్నత సంస్థానం బృందావన్‌కు రావాలంటూ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ గారి నుంచి ఆహ్వానం లభించింది. దీంతో కార్తీకేయ 2 టీం బృందావన్‌కు వెళ్లింది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Hero nikhil, Karthikeya 2 Movie, Nikhil Siddharth, Nithiin

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు