Home /News /movies /

KARTHIKEYA 2 MOVIE REVIEW AND RATING NIKHIL ANOTHER THRILLING ADVENTURE DRAMA TA

కార్తికేయ 2 (Karthikeya 2)
కార్తికేయ 2 (Karthikeya 2)
2.5/5
రిలీజ్ తేదీ:13/8/2022
దర్శకుడు : చందూ మొండేటి (Chandoo Mondeti)
సంగీతం : కాల భైరవ (Kaala Bhairava)
నటీనటులు : నిఖిల్ సిద్ధార్ధ్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస రెడ్డి, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్ తదితరులు..
సినిమా శైలి : థ్రిల్లింగ్ అడ్వెంచర్ డ్రామా (Thrilling Adventure Drama)
సినిమా నిడివి : 2Hr 30M

Karthikeya 2 Movie Review : కార్తికేయ 2 మూవీ రివ్యూ.. థ్రిల్లింగ్ అడ్వెంచర్ డ్రామా..

కార్తికేయ 2 మూవీ రివ్యూ (Karthikeya 2 Twitter)

కార్తికేయ 2 మూవీ రివ్యూ (Karthikeya 2 Twitter)

Karthikeya 2 Movie Review : విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని.. యూత్ ఐకాన్‌గా మారిపోయారు యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth). ప్రస్తుతం ఇతను చందూ మెండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’ మూవీ చేసారు. తాజాగా విడుదలైన ఈ సినిమా కార్తికేయ లాగా ఆకట్టుకునేలా ఉందా ఈ సినిమాతో నిఖిల్ సిద్ధార్ద్ మరో సక్సెస్‌ను అందుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    రివ్యూ : కార్తికేయ 2(Karthikeya 2)
    నటీనటులు : నిఖిల్ సిద్ధార్ధ్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస రెడ్డి, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్ తదితరులు..
    ఎడిటర్: కార్తీక్ ఘట్టమనేని
    సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
    సంగీతం: కాల భైరవ
    నిర్మాత : అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్
    దర్శకత్వం: చందూ మొండేటి
    విడుదల తేది :13/8/2022

    డిఫరెంట్ స్టోరీలతో  తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని.. యూత్ ఐకాన్‌గా మారిపోయారు యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth). ప్రస్తుతం ఇతను చందూ మెండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’ మూవీ చేసారు. తాజాగా విడుదలైన ఈ సినిమా కార్తికేయ లాగా ఆకట్టుకునేలా ఉందా ఈ సినిమాతో నిఖిల్ సిద్ధార్ద్ మరో సక్సెస్‌ను అందుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

    కథ విషయానికొస్తే..

    కార్తికేయ (నిఖిల్ సిద్ధార్ధ్) ఒక డాక్టర్. అంతేకాదు జంతువుల సైకాలజీ కూడా ఇతనికి తెలుసు. ఒక ఎక్కడ ఎలాంటి ప్రాబ్లెమ్ ఉన్న తాను అంతు చూసే వరకు ఒదలడు. ఈ క్రమంలో అతని ఇంట్లో ఓ ఎద్దు తులసీ కోటను ధ్వంసం చేస్తోంది. ద్వారకలో వాళ్ల అమ్మ ఒక మొక్కు ఉంటోంది. అది తీర్చకపోవడంతోనే ఇదంత జరిగిందని ఓ పండితుడు చెప్పిన మాట ప్రకారం మొక్కు తీర్చుకోవడానికి తల్లితో కలిసి కార్తికేయ ద్వారకకు బయలు దేరుతాడు. అక్కడ అనుకోకుండా ఒక ఆర్కియాలజికల్ ఆఫీసర్ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి ముగ్ధ (అనుపమ పరమేశ్వరనర్) కాపాడుతోంది. అసలు ముగ్ధ.. కార్తికేయను ఎందుకు కాపాడింది. అసలు శ్రీకృష్ణుడు కార్తికేయను ఎందుకు ద్వారకకు  రప్పించాడు. ఈ మొత్తం వ్యవహారంలో కార్తికేయ ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఫేస్ చేసాడు ? చివరకు తాను అనుకున్నది సాధించాడా ? లేదా అనేదే కార్తికేయ 2 స్టోరీ.

    కథనం, టెక్నీషియన్స్ విషయానికొస్తే..

    దర్శకుడు చందూ మొండేటి నిఖిల్‌తో తెరకెక్కించిన కార్తికేయతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇపుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ కథను రాసుకున్నాడు. కార్తికేయ సినిమా సుబ్రహ్మణ్యపురం నేపథ్యంలో తెరకెక్కితే.. కార్తికేయ 2 మాత్రం శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక నేపథ్యంలో తెరకెక్కించాడు. ముఖ్యంగా చందూ మొండేటి.. సినిమా ప్రారంభం నుంచే ఎక్కడ లాగ్ లేకుండా ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసాడు. ముఖ్యంగా శ్రీకృష్ణుడుకు సంబంధించిన కథను యానిమేషన్ రూపంలో చూపించడం ఆకట్టుకుంది. ముఖ్యంగా శ్రీకృష్ణుడు కొలిచే దారి దోపిడి దొంగలు అభీరులను చూపించడం కొత్తగా ఉంది.

    ఇక చందూ మొండేటి తాను రాసుకున్న కథను ఇంకాస్త బెటర్‌గా చూపిస్తే బాగుండేది. ఏదో ఫజిల్ ఇచ్చినట్టు.. క్రీ.పూ. సూర్య వర్మన్ రాజు.. టాలమీకి ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు.. ఉద్ధవుడుకి ఇచ్చిన కాలి కంకణం గురించి రహాస్యాలు వెల్లడించడం వంటి సన్నివేశాలను చందూ మొండేటి ఈ సినిమా  స్క్రీన్ ప్లే‌లో చక్కగా అల్లుకున్నాడు. దానికి సంబంధించిన సమాచారం గ్రీస్‌కు చెందిన లైబ్రరీలో ఉంటుంది. దాన్ని మన దేశానికి ఒక ఆర్కాలజీ ఆఫీసర్ అక్కడ లైబ్రరీ నుంచి మన దేశానికి  తీసుకు రావడం వంటివి చక్కగా అల్లుకున్నాడు. ఇక ఆర్కాలజీ ఆఫీసర్.. తాను తెలుసుకున్న రహస్యాన్ని ఛేదించడానికి కార్తికేయనే బెస్ట్ ఆప్షన్ ఎందుకు అనుకున్నాడనేది కూడా ఈ సినిమా చక్కగా చూపించాడు.

    కార్తికేయ 2లో  అడ్వెంచర్ కమ్ సస్పెన్స్ సన్నివేశాలను దర్శకుడు ఇంకాస్త బెటర్‌గా క్లారిటీగా తెరకెక్కించి ఉంటే బాగుండేది.   మొత్తంగా చందూ మొండేటి మన దేశంలోని మన చెప్పుకుంటున్న పురాణాలు... మైథాలజీ కాదు.. అది మన చరిత్ర అంటూ ఈ సినిమాలో చెప్పడం బాగుంది. అక్కడ కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అయినా.. ఓవరాల్‌గా పర్వాలేదనిపిస్తోంది. ఒక ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఒక కాల భైరవ ఈ సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    నటీనటుల విషయానికొస్తే..

    నిఖిల్ సిద్ధార్ధ్ డాక్టర్ కార్తికేయ పాత్రలో మంచి నటన కనబరిచాడు. ఫస్టాఫ్‌‌తో  ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో సెటిల్ పర్ఫామెన్స్ చేశాడు. ఇక ముగ్ఢ పాత్రలో అనుపమ పరమేశ్వర్ ఆకట్టుకుంటుంది. ఇక శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష తన కామెడీ టైమింగ్‌ బాగుంది. విలన్‌గా ఆదిత్య మీనన్ నటన బాగుంది. ఇక అనుపమ్ ఖేర్ ఉన్నది కొంచెం సేపు అయినా.. సినిమాలో తన ఇంపాక్ట్ చూపించారు.

    ప్లస్ పాయింట్స్ 

    కథ

    నిఖిల్ నటన

    కాల బైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

    మైనస్ పాయింట్స్ 

    స్క్రీన్‌‌  ప్లే సన్నివేశాల్లో తడబాటు..

    అక్కడక్కడ లాజిక్ మిస్ కావడం

    చివరి మాట : కార్తికేయ 2 ఆకట్టుకునే థ్రిల్లింగ్ అడ్వెంచర్ డ్రామా..

    రేటింగ్ : 2.75/5
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    రేటింగ్

    కథ:
    3/5
    స్క్రీన్ ప్లే:
    2.5/5
    దర్శకత్వం:
    2.5/5
    సంగీతం:
    3.5/5

    Tags: Anupama Parameswaran, Karthikeya 2 Movie, Nikhil Siddharth, Tollywood

    తదుపరి వార్తలు